Weekly Horoscope: ఈ రాశుల వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. వార ఫలాలు ఇవే..

Weekly Horoscope: వార ఫలాలు

ఈ వారం జులై 4 నుంచి 10 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, జ్యోతిష పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

  • Share this:
    Weekly Horoscope: భవిష్యత్తును ఊహించడం కష్టమే అయినప్పటికీ.. జ్యోతిష పండితులు కొన్ని పద్ధతుల ద్వారా ఊహిస్తారు. మన రాశుల నక్షత్రాలు, గ్రహలు, సూర్య గమనం, విశ్వంలో నక్షత్రాలు, తిథులు, కాలం, వారం, వర్జ్యం, రోజు, వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... కొన్ని అంచనాలు వేస్తున్నారు. అవి వంద శాతం సక్సెస్ కాకపోవచ్చు. కానీ చాలా వరకూ వాటిలో చెప్పినట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. మరీ ఈ వారం జులై 4 నుంచి 10 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, జ్యోతిష పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    వారమంతా ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలున్నాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త.

    వృషభ రాశి (Taurus)
    ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు నహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

    మిథున రాశి (Gemini)
    ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. నంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా ఈ వారం అన్ని విధాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. డబ్బు కూడగట్టుకుంటారు. అష్టమ శని కారణంగా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కరళలరు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ది సాధిస్తారు..

    కర్కాటక రాశి (Cancer)
    ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయానికి తిరుగులేదు. నమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. మేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.

    సింహ రాశి (Leo)
    గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆశించిన పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు మీకు అండగా నిలుస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్దులకు పరవాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    కన్య రాశి (Virgo)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒకవ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

    తుల రాశి (Libra)
    ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అరోగ్యం మెరుగుపడుతుంది. గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఐ.టి రంగంలోనివారికి అనుకూల సమయం. ఇంటా బయటా ఒత్తిడి ఉండవచ్చు.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఈ వారం ఆదాయం సెరిగి ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులుబాగా పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు అదుకుంటారు.. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్ళి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి.

    ధనస్సు రాశి (Sagittarius)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్జు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్ధులు టీచర్ల ప్రశంసలు అందుకుంటారు. తిప్పట ఎక్కువగా ఉన్నా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం అన్ని విధాలా బాగుంది.

    మకర రాశి (Capricorn)
    గ్రహ నంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధన యోగం పడుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్జు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎలిన్నాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతు౦ది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉ౦డవు.

    కుంభ రాశి (Aquarius)
    ఆరోగ్యం, ఆదాయం నిలకడగా ఉంటాయి. కాస్తంత తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉవాధి, న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఏ విషయంలోనూ హామీలు ఉండవద్దు.

    మీన రాశి (Pisces)
    ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్ధలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. అరోగ్యానికి ఢోకా లేదు. అధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్ధులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.
    Published by:Sumanth Kanukula
    First published: