Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

Weekly Horoscope: వారఫలాలు

Horoscope weekly: ఈ వారం(సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు) రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఏ రాశుల వారు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఫలాలు ఎవరికి దక్కుతాయి.. వంటి విషయాలను చూద్దాం..

 • Share this:
  Weekly Horoscope: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. మరి ఈ వారం(సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు) రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏ రాశి వారికి బాగా కలిసొస్తుంది. ఏ రాశుల వారు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఫలాలు ఎవరికి దక్కుతాయి.. వంటి విషయాలను చూద్దాం..

  మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. తలపెట్టిన పనుల్ని పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయ పరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల కారణంగా సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.  వృషభం (కృత్తిక 2, 3, 4, రోహిణి, మృగశిర 1, 2)
  ఉద్యోగంలో శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఒత్తిడి తక్కువవుతుంది. సహోద్యోగుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వృథా ఖర్చులు తడిసి మోపెడవు తుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. కొందరు మిత్రులను నమ్మి నష్టపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారమవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా నిలుస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.  మిథునం (మృగశిర 3, 4, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3)
  ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగం మారడానికి సమయం అనుకూలంగా లేదు. తల పెట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి మంచి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. వ్యక్తిగత సమస్యలను లెక్క చేయకుండా బంధుమిత్రులకు సహాయపడతారు. ఎవరికీ హామీలు, పూచీకత్తులు ఉండవద్దు. స్పెక్యులేషన్ అంత శ్రేయస్కరంగా లేదు.  కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు మీద పడతాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో కాకపోయినా సంతృప్తికరంగా లాభాలు గడిస్తారు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.  సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కనిపిస్తోంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులలో కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి.  కన్య (ఉత్తర 2, 3, 4, హస్త, చిత్త 1, 2)
  డబ్బు ఇవ్వాల్సినవారు తిరిగి ఇస్తారు. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఉద్యోగ, వ్యాపారా ల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అను కూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.  తుల (చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3)
  ముఖ్యమైన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా, తీసుకున్నా నష్టపోతారు.  వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినీ నమ్మి ఆర్థిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడిగ లవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్నవ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుంది. స్పె క్యులేషన్ వ్యాపారంలో అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.  ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. సంపాదనకు అవకాశం ఉన్నఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వీలైనంతగా రుణభారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబంతో సంతోషంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు.  మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ఠ 1, 2)
  ఉద్యోగ జీవితంలో మంచి పురోగతి కనిపిస్తుంది. అధికార యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. వ్యాపారపరంగా మంచి ఆర్థిక ప్రయోజనాలు కని పిస్తున్నాయి. జీవితానికి పనికివచ్చే నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆ రోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహి తులతో అపార్థాలు చోటు చేసుకుంటాయి. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యల కు కూడా ఆందోళన చెందడం మంచిది కాదు.  కుంభం (ధనిష్ఠ 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3)
  మీరు ఆశించిన స్థాయిలో పనులు పూర్తవుతాయి. పాజిటివ్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

  మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయాని కి లోటుండదు. ఇంటా బయటా శ్రమ ఎక్కువవుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువులకు సంబంధించి ఒక దుర్వార్త వింటారు.
  Published by:Sumanth Kanukula
  First published: