Horoscope Weekly: వారఫలాలు.. ఆదాయ వృద్ధి.. మంచికాలం

Horoscope Weekly: వారఫలాలు

Horoscope Telugu: రాశిఫలాలు ప్రతి వారం మారిపోతూ ఉంటాయి. ఈ వారం ఆగస్ట్ 29, 2021 నుంచి సెప్టెంబర్ 4, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly Telugu: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా అవరోధాలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. ఈ వారం ఆగస్ట్ 29, 2021 నుంచి సెప్టెంబర్ 4, 2021 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. వృత్తి నిపుణులకు ఎంతో అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సఏద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

    వృషభ రాశి (Taurus)
    మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త.

    మిథున రాశి (Gemini)
    ఆరోగ్యానికి, ఆదాయానికి సమస్య ఉండదు. ఉద్యోగంలో సానుకూలమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హెూదా పెరుగుతుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో మీకు అనుకూలత పెరుగుతుంది. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, లాయర్లకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది.

    ఇది కూడా చదవండి: Bhakti: అప్పులు పెరుగుతున్నాయా.. వెంటనే ఈ పూజ చేయండి

    కర్కాటక రాశి (Cancer)
    గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. డబ్బు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అంతగా లాభించవు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా లాభాలు మాత్రం నిలకడగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

    సింహ రాశి (Leo)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగానికి సంబంధించి ఒకటికన్నా ఎక్కువ సంస్థల నుంచి ఆఫర్లు అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

    కన్య రాశి (Virgo)
    గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. అశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవచ్చు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

    తుల రాశి (Libra)
    ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువులు ఆదుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారులు శ్రమ మీద లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి.

    వృశ్చిక రాశి (Scorpio)
    గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ధోకా ఉండదు. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. వ్యాపారులకు ఆర్థికంగా పరవాలేదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండవచ్చు.

    ధనస్సు రాశి (Sagittarius)
    గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. ఏలిన్నాటి శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు, హామీలకు, స్పెక్యులేషన్ కు వీలైనంత దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: రాశులు.. మానవ సంబంధాలు.. ఏ రాశి వారు ఏ తప్పులు చేస్తారు?

    కుంభ రాశి (Aquarius)
    ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులు విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయంఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.

    మీన రాశి (Pisces)
    ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సంతృప్తి చెందాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా అడుగు వేయడం మంచిది. హామీలు ఉండవద్దు.
    Published by:Krishna Kumar N
    First published: