Home /News /astrology /

Weekly Horoscope: వారఫలాలు.. కొన్ని శుభాలు, కొంత శ్రమ

Weekly Horoscope: వారఫలాలు.. కొన్ని శుభాలు, కొంత శ్రమ

Weekly Horoscope: వారఫలాలు.. కొన్ని శుభాలు, కొంత శ్రమ

Weekly Horoscope: వారఫలాలు.. కొన్ని శుభాలు, కొంత శ్రమ

Horoscope Weekly: రాశిఫలాలు ప్రతి వారం మారిపోతూ ఉంటాయి. ఈ వారం 1 ఆగస్ట్, 2021 నుంచి 7 ఆగస్ట్ వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  Horoscope Weekly Telugu: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. ప్రతి ఒక్కరికీ ఒక రాశి ఉంటుంది. ప్రతి రాశికీ మంచీ, చెడూ ఫలితాలు ఉంటాయి. ఏ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? ఆర్థిక అంశాల్లో ఎలాంటి శుభాలు జరుగుతాయి? పంచాంగం ఎలాంటి అంశాలను సూచిస్తోంది? ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? ఈ వారం రాశిఫలాలతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఏవైనా అవరోధాలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలు కలుగుతుంది. ఈ వారం ఆగస్ట్ 1, 2021 నుంచి ఆగస్ట్ 7 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యల గురించి ఆందోళన చెందకండి. ఎవరితోనూ విభేదాలకు దిగవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు కూడా ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందజేస్తారు. వ్యాపారులు కాస్తంత ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం శుభప్రదంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

  వృషభ రాశి (Taurus)
  మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ వారం సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితిసంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కారణంగా తిప్పట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం అనుభవానికి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: ఏ రాశి వారు ఎలాంటి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి?

  మిథున రాశి (Gemini)
  ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులొకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంతవరకు పరవాలేదు. ఆదాయానికి కొరత లేదు. వృత్తి నిపుణులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారులకు పరవాలేదు.

  కర్కాటక రాశి (Cancer)
  ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా బాగా ఒత్తిడి ఉంటుంది. అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక సదా పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు, లాయర్లకు అన్ని విధాలా బాగుంటుంది.

  సింహ రాశి (Leo)
  ఆర్థికంగా అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. రక్తదానం వంటి సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

  కన్య రాశి (Virgo)
  గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాలలోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు. కోర్టు కేసు మీకు అనుకూలమవుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

  ఇది కూడా చదవండి: Zodiac Signs: నల్ల తాడు ఏ రాశుల వారికి మంచిది... ఎవరు కట్టుకోకూడదు?

  తుల రాశి (Libra)
  గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగం వారు అభివృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డబ్బు జాగ్రత్త.

  వృశ్చిక రాశి (Scorpio)
  మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్ది శ్రమతో ఎక్కువ ఫలితం పొందుతారు. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ఆవేశకావేశాలతో పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

  ధనస్సు రాశి (Sagittarius)
  చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. వ్యాపారులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు.

  మకర రాశి (Capricorn)
  ఉద్యోగపరంగా అనుకూల కాలం నడుస్తోంది. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నా యి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు చేస్తారు. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. స్థాన చలనం ఉండవచ్చు.

  కుంభ రాశి (Aquarius)
  ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఈ వారం పెండింగ్ పనుల్లో చాలా భాగం శ్రమ మీద పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ, ఖర్చులు తగ్గించుకోవాలి. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోండి. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటు తగదు. ఆరోగ్యానికి ఢోకా లేదు. వ్యాపారులు ఆర్థికంగా ముందడుగు వేస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది.

  మీన రాశి (Pisces)
  కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో శుభకార్యం తలపెడతారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన ముఖమైన పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంయమనంతో, సహనంతో వ్యవహరించాలి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారంలో కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Weekly Horoscope, Zodiac sign, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు