Weekly Horoscope: సెప్టెంబరు 19 నుంచి 25 వరకు వార ఫలాలు.. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.. వీరు మాత్రం స్నేహితులతో జాగ్రత్త..

ప్రతీకాత్మక చిత్రం

సెప్టెంబరు 19 నుంచి సెప్టెంబరు 25 వరకు.. ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో చూద్దాం..

  • Share this:
    Weekly Horoscope: ఈ వారం(సెప్టెంబరు 19 నుంచి సెప్టెంబరు 25 వరకు) పలు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలతో కొత్త సమస్యలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వారంఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? నేటి నుంచి సెప్టెంబరు 25 వరకు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

    మేష రాశి (Aries): ఈ వారం ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చక్కగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఇంజనీరింగ్‌, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

    వృషభ రాశి (Taurus): చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత వరకు అర్థిక సమస్యల నుంచి బయటపడతారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్‌ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

    మిథున రాశి (Gemini): ఈ వారం అర్థిక వ్యవహారాలకు ఎంతో అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. అతి జెదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణ బాధ తగ్గుతుంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.

    కర్కాటక రాశి (Cancer): అనుకున్నవి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. దైవానుగ్రహం మీకు అనుకూలంగా ఉంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్‌ వస్తు౦ది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. శని సంచారం కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్ధులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

    సింహ రాశి (Leo): గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరింట గురు సంచారం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శమ, తిప్పట తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్‌ విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

    కన్య రాశి (Virgo): ఈ వారం గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు అమ్మే అలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్టు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.

    తుల రాశి (Libra): గ్రహ సంచారంలో కొద్దిగా ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గాంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యారులకు పరవాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాతలు చేస్తారు.

    వృశ్చిక రాశి (Scorpio): ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. కాస్తంత సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది.

    ధనస్సు రాశి (Sagittarius): గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం అందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.

    మకర రాశి (Capricorn): ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూర౦గా ఉండండి.

    కుంభ రాశి (Aquarius): గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కొనసాగుతోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు 'స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయతృంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

    మీన రాశి (Pisces): రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికారు చేస్తారు.
    Published by:Sumanth Kanukula
    First published: