Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది.. అన్నీ శుభాలే

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Weekly: ఈ వారం రాశిఫలాలు ఏం చెబుతున్నాయి. ఏ రాశి వారికి శుభ ఫలాలు ఉన్నాయి.. ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో చూద్దాం..

 • Share this:
  కాలజ్ఞానం

  అక్టోబరు 3 నుంచి 9

  వార ఫలాలు

  మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఉద్యోగంలో సహోద్యోగులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉటుంది.

  వృషభం (Taurus): (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2)
  ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తలకెత్తుకోవాల్సి వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త వాద వివాదాలకు దిగవద్దు, సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల డబ్బు నష్టపోతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది..

  మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ప్రేమించినవారితో పెళ్లి జరిగే సూచనలున్నాయి. కుటుంబం లో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వా ములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

  మీ వ్యాలెట్‌లో ఈ వస్తువును అస్సలు పెట్టుకోకూడదు!

  కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో త్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తి ని కలిగిస్తాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు, రాజకీయ, సామాజిక రంగాలవారు అభివృద్ధి సాధిస్తారు.

  సింహం Leo: (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. విందులు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు న్యాయవాదుల కు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

  కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  సమయం అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేయాల్సిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయ౦ నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

  Dreams Meaning: మీకు వచ్చే కలలో ఇలా జరిగిందా ? అయితే మీ నిర్ణయాలను మార్చుకోవాల్సిందే

  తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొ౦దరు స్నేహితుల కారణంగా అప్రతిష్టపాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం. శ్రమ, తిప్పలు ఎక్కువగా ఉన్నా పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

  వృశ్చికం (Scorpio ): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
  ఆదాయానికి, ఆరోగ్యానికి ఢాకా ఉండదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హా మీ ఉండి దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

  ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోని వారికి సమయం అంతగా అనుకూలంగా లేదు. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అనవసర, అవాంచనీయ పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త ఉండాలి.

  మహిళలు ఈ పనిచేస్తే.. ఆ ఇల్లు లక్ష్మీనివాసమే!

  మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
  అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకొంది. వ్యాపారంలో ఉన్నవారు ఆర్ధిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు, శుభ కార్యాలు జరిగి సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. తిప్పట ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. ఐ.టి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది.

  కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఏలినాటి శని కారణంగా మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడతారు. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. అంతా మన మంచికే అనుకోండి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా శ్రమ పెరుగుతుంది.

  ఈ 5 రాశులవారు ప్రతి విషయాన్ని డీప్‌గా ఆలోచిస్తారట!

  మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
  ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలను పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. తిప్పట ఎక్కువగా ఉన్నప్పటికీ ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  Published by:Shiva Kumar Addula
  First published: