హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Weekly Horoscope: వార ఫలాలు... ఈ వారం వీరికి ప్రశాంతం... కొన్ని తీపి కబుర్లు

Weekly Horoscope: వార ఫలాలు... ఈ వారం వీరికి ప్రశాంతం... కొన్ని తీపి కబుర్లు

Horoscope: రాశి ఫలాలు

Horoscope: రాశి ఫలాలు

Weekly Horoscope: ఈ వారం ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఏ రాశుల వారికి ప్రత్యేక అనుకూల పరిస్థితులు ఉంటాయి. జులై 18 నుంచి 24 వరకు జ్యోతిష పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారు?

Horoscope Weekly: వారం వారం రాశి ఫలాలు మారిపోతూ ఉంటాయి. ఒక వారం కొన్ని రాశుల వారికి కలిసొస్తే... మరో వారం మరికొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. ప్రధానంగా కష్టాల్లో ఉన్న వారు వాటిని అధిగమించి పైకి రావాలి. అందుకు రాశి ఫలాలు కొన్ని సూచనలు చేస్తాయి. హామీలు ఇవ్వవద్దు అని చెప్పినప్పుడు ఇవ్వకపోవడమే మేలు. హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోతే... చెడ్డ పేరు వస్తుంది. అలాగే ఆరోగ్యం జాగ్రత్త అన్నప్పుడు... ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాలు, ఆస్తులు, ప్రేమలు, పెళ్లిళ్లు... అన్ని అంశాలపైనా జ్యోతిష పండితులు తమదైన శైలిలో పంచాంగం చెబుతున్నారు. మరి జులై 18 నుంచి జులై 24 వరకూ వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (Aries)

చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్నా సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగులు అధికార యోగం అనుభవించే అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతాన యోగం కనిపిస్తోంది.

వృషభ రాశి (Taurus)

ఈ వారమంతా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు ఒత్తిడి కాస్తంత అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి డుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలున్నాయి.

మిథున రాశి (Gemini)

అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. మధ్య మధ్య ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు.

కర్కాటక రాశి (Cancer)

సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Bhakti: ఆదివారం ఆ దీపారాధనతో ఇంట ధన ప్రవాహం

సింహ రాశి (Leo)

అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారులు తేలికగా లాభాలు ఆర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి సత్ఫలితాలు సాధిస్తారు.

కన్య రాశి (Virgo)

ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా లేదు. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పడతారు. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు.

తుల రాశి (Libra)

ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్నా సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. స్నేహితులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది.

వృశ్చిక రాశి (Scorpio)

ఈ వారం ప్రతికూల ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. స్నేహితులు, సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతాలలో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలతో సమస్యల్లో పడతారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. బాగా ఒత్తిడి ఉంటుంది.

ధనస్సు రాశి (Sagittarius)

ఈ వారం మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య చిన్న చిన్న అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలం అవుతాయి.

మకర రాశి (Capricorn)

ఉద్యోగంలో మీ నిబద్ధతకు, చిత్తశుద్ధికి గుర్తింపు లభిస్తుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికలావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.

కుంభ రాశి (Aquarius)

ఈ వారంలో ఎక్కువ రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సహెూద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితురాలితో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు.

ఇది కూడా చదవండి: Dakshinayan 2021: దక్షిణాయణం ప్రారంభం.. దక్షిణాయణం అంటే ఏంటి? విశిష్టతేంటి?

మీన రాశి (Pisces)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యానికి నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యం ఇస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాలవారికి, వృత్తి నిపుణులకు సమయం అన్నివిధాలా అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

First published:

Tags: Horoscope, Horoscope Today, Rasi phalalu, Weekly Horoscope, Zodiac sign

ఉత్తమ కథలు