Home /News /astrology /

WEEKLY HOROSCOPE FROM DECEMBER 26TH TO JANUARY 2 HERE IS TELUGU ASTROLOGY RASHIFAL RASI PHALALU FOR ALL 12 ZODIAC SIGNS SK

Weekly Horoscope: వార ఫలాలు.. ఇయర్ ఎండింగ్‌లో వీరికి కష్టాలు.. కొత్త ఏడాది ఆరంభంలో అద్భుతాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horscope: డిసెంబర్ 26 నుంచి జనవరి 02 వరకు రాశి ఫలాలు. ఇయర్ ఎండింగ్‌లో ఏయే రాశుల వారికి బాగుంది? కొత్త ఏడాది ఎవరికి కలిసి వసతుంది. జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

    కాలజ్ఞానం

    డిసెంబరు 26 నుంచి జనవరి 2

    రాశి ఫలాలు

    మేషం (Aries)(అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ , డబ్బు గానీ Lష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యో గానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగు తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృ త్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

    వృషభం (Taurus)(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్ కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టుకేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితులతో విభేదాలకు అవకాశం ఉంది.

    మిథునం (Gemini)(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు
    సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొని పెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

    ఇంట్లో సాలెగూళ్లు ఉంటే అరిష్టం.. ఎలాంటి కష్టాలు, నష్టాలు వస్తాయంటే?

    కర్కాటకం (Cancer)(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చి పెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. సప్తమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చి పెడతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

    సింహం (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1) గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహెూద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలనిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన స మాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలా పాల్లో పాల్గొంటారు.

    కన్య (Virgo)(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఈ రాశి వారికి సమయం అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. కోర్టుకేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది.

    ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో కాయిన్ ప్లాంట్ ఉంటే ఏమవుతుందో  తెలుసా?

    తుల (Libra)(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) గ్రహ సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా లేదు. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు. హామీలు ఉండొద్దు.

    వృశ్చికం (Scorpio)(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కొద్దిగా నిరుత్సాహం కలిగిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమవ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఇవ్వాల్సినవారు సమయానికి డబ్బు ఇవ్వకపోవచ్చు.

    ధనస్సు (Sagittarius)(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికపరంగా గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.

    Vastu: ఇంట్లో ఎప్పుడూ అత్తగారి గొడవా? దానికి ఈ దోషమే అసలు కారణం..

    మకరం (Capricorn)(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగు తుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు.

    కుంభం (Aquarius)(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఉద్యోగంలో విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసు కోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కొనసాగుతోంది.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మేడ్స్, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్థు లకు చాలాబాగుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Astrology, Horoscope, Rashifal, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు