Home /News /astrology /

WEEKLY HOROSCOPE FROM 13 JUNE TO 19 JUNE 2021 CHECK YOUR ASTROLOGY PREDICTION ZODIAC SIGNS HERE NK

Weekly Horoscope: వారఫలాలు... జూన్ 13 నుంచి 19 వరకు రాశి ఫలాలు

Weekly Horoscope: వారఫలాలు

Weekly Horoscope: వారఫలాలు

Weekly Horoscope (13 జూన్ నుంచి 19 జూన్ 2021 వరకు): ఈ వారం ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. జ్యోతిష పండితులు రాశి ఫలాలకు సంబంధించి ఏం చెప్పారో తెలుసుకుందాం.

    Weekly Horoscope: రాశి ఫలాల్లో ఒక్కొక్క రాశికి ఒక్కో రకమైన ప్రత్యేకతలు ఉంటాయి. కొన్ని ప్లస్సులూ, కొన్ని మైనస్‌లూ ఉంటాయి. పూర్తిగా ఏ రాశీ అద్భుతమైనదిగా ఉండదు అలాగే... పూర్తిగా ఏ రాశీ అత్యంత బలహీనంగా ఉండదు. ఒక్కో సందర్భంలో ఒక్కో రాశికి బాగా కలిసొస్తుంది. ఇందుకు గ్రహ గమనాలు, సూర్య గమనం, చంద్రుడి ఆకర్షణ బలం ఇలా ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. మరి ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో, జ్యోతిష పండితులు ఎలాంటి పంచాంగం చెబుతున్నారో తెలుసుకుందాం.

    మేష రాశి (Aries)
    ఈ వారమంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ, సహోద్యోగుల సహాయ సహకారాలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులు ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆదాయపరంగా వ్యాపారులకు కలిసి వచ్చే కాలం ఇది. పేరున్న వారితో పరిచయాలు అవుతాయి.

    వృషభ రాశి (Taurus)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం పరవాలేదు. పొదుపు చర్యలు చేపడతారు. తల్లితండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటుండదు. ఖర్చుతో కూడుకున్న కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. ప్రయాణాల వల్ల నష్టపోతారు. ఇరుగు పొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభించదు. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

    మిథున రాశి (Gemini)
    వారమంతా ఆనందోత్సాహాలతో గడిచిపోతుంది. సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేస్తారు. పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారంలో బాగా ఒత్తిడికి గురవుతారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారి తీస్తుంది. భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

    కర్కాటక రాశి (Cancer)
    జీవితంలో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా లాభాలున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యక్తిగతంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. ఆదాయం వృద్ధికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

    సింహ రాశి (Leo)
    పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి మిత్రుల సహాయంతో పరిష్కారం అవుతుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చక్కని ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు ఊహించని అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇరుగు పొరుగువారితో వాదాలకు, పేచీలకు దిగవద్దు. నిరుద్యోగులకు ఒకేసారి రెండు మూడు ఆఫర్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

    కన్య రాశి (Virgo)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు మీ సలహాలు నచ్చుతాయి. ఉద్యోగంలో సహెూద్యోగులు ఎంతగానో సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలకు ఇది సమయం కాదు. స్పెక్యులేషన్ లాభించదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటకు విలువ పెరుగుతుంది.

    తుల రాశి (Libra)
    ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొంత అసౌకర్యం ఉంటుంది. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగంలో మీ సూచనలకు, ఆలోచనలకు విలువ పెరుగుతుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థికంగా పెద్దగా ఎదుగుదల ఉండదు. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం ఉండదు.

    వృశ్చిక రాశి (Scorpio)
    అనుకున్న పనులేవీ పూర్తి కాక చికాకు పడతారు. ఒక పట్టాన పెళ్లి సంబంధాలు కుదరవు. అవతలి వారి నుంచి స్పందన లభించదు. ఆదాయానికి మించిన ఖర్చుల కారణంగా ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ పెండింగ్ లో పడుతుంది. మిమ్మల్ని చూసి అసూయపడేవారుంటారు. మీరు ఇబ్బంది పడుతున్నా స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. స్పెక్యులేషన్ లాభించదు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హామీలు ఉండొద్దు.

    ధనస్సు రాశి (Sagittarius)
    సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహాలు అందుకుంటారు. అధికార లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. ఒక కుటుంబ సమస్య నుంచి తెలివిగా బయటపడతారు. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు ఆర్జిస్తారు.

    మకర రాశి (Capricorn)
    ఉద్యోగ, కుటుంబ జీవితాలు ప్రశాంతంగా సాగిపోతాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మితిమీరిన ఔదార్యంతో అందరికీ హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. స్పెక్యులేషన్ ఏమాత్రం లాభించదు. వ్యక్తిగత సమస్య ఒకటి ఆందోళన కలిగిస్తుంటుంది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఇతరత్రా సంపాదన కోసం సన్నిహితులతో చర్చిస్తారు. వ్యాపారం పెద్దగా అనుకూలంగా ఉండకపోవచ్చు. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    కుంభ రాశి (Aquarius)
    కుటుంబపరంగా ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో మాత్రం విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారే ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. స్పెక్యులేషన్ అంతగా లాభించకపోవచ్చు. బంధుమిత్రులు అండగా ఉంటారు. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు ఫుడ్ లవర్స్... స్వీట్స్, కేక్స్ అంటే తెగ ఇష్టపడతారు

    మీన రాశి (Pisces)
    ఈ వారం రాజకీయ, సామాజిక రంగాలవారికి చాలా బాగుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. అయితే, వైద్య ఖర్చులు ఇబ్బంది పెడతాయి. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారం నిలకడగా సాగుతుంది. దగ్గరవారితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్పెక్యులేషన్‌కు అవకాశం లేదు. హామీలు ఇవ్వొద్దు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు