Weekly Horoscope: వార ఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది.. పట్టిందల్లా బంగారమే

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు ఏం చెబుతున్నాయి. ఏ రాశి వారికి శుభ ఫలాలు ఉన్నాయి.. ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 16 వరకు ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో చూద్దాం..

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 10, 2021 నుంచి అక్టోబరు 16, 2021 వరకు

    వార ఫలాలు

    మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఈ వారం పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అదనపు ఆదాయం కోసం బాగా శ్రమపడతారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢాకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలోని సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఆర్థికంగా పరవాలేదు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్ధిక, ఆధ్యాత్మిక ప్రవచన రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది.

    వృషభం (Taurus): (కృత్తిక 2,3,4 రోహిణి, మృగశిర 1,2)
    ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. సహ ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యానికి, ఆదాయానికి ఏమాత్రం లోటు ఉండదు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో విహారానికి వెళతారు. తిప్పట ఎక్కువగా ఉన్నా, కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వివాహ సంబంధాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు బాగా క్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నం చేసినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు.

    మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆదాయం మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహి తులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యో గం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం అన్నివిధాలా బాగుంది. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. వ్యాపారులు బాగా కష్టపడాల్సి ఉంటుంది.

    Vastu Tips: మీకు అదృష్టాన్ని తెచ్చే 5 వాస్తు చిట్కాలు!

    కర్కాటకం (cancer): (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    అదృష్ట యోగానికి లేదా ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసంసంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఏలినాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. తిప్పట కూడా ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి అనూహ్యంగా సహాయం అందుతుంది. వ్యాపారులు తమ తమ రంగాలలో కొత్త పుంతలు తొక్కుతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించరు. రియల్ పో లైట్ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది.

    సింహం Leo: (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రశాంతంగా జరిగిపోతుంది ద. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల మధ్య ఆర్థిక, అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. మీ మాటల్ని బంధువులు అపార్థం చేసుకుని, దూరం జరిగే ప్రమాదం ఉంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్ ఎస్టేట్ వరికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. వ్యాపారులు శ్రమ మీద లాభాలు ఆర్జిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

    కన్య (Virgo): (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ముఖ్యమైన పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అనవసర ఖర్చులతో కష్టాలు పడతారు. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాలు విరమిస్తే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఎవరికైనా డబ్బు ఇచ్చినా తీసుకున్నా నష్టపోతారు.

    Shani puja: శనిదేవుని ఈ 5 విధాలుగా పూజిస్తే.. ఇబ్బందులే ఉండవు!

    తుల (Libra): (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    ఉద్యోగంలో అకస్మాత్తుగా కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు గడించడానికి అవకాశం ఉంది. ఖర్చులను బాగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరినీ నమ్మి ఆర్ధిక బాధ్యతలు అప్పగించవద్దు. కొందరు పలుకుబడిగల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులకు సహాయంగా ఉంటారు. కొద్దిగా ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెఓ సంబంధం కుదిరే అవకాశం ఉంది. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు శ్రమ ఎక్కువవుతుఉంది. స్పెక్యులేషన్ వ్యాపారంలో అడుగు పెద్ద సూచనలు కనిపిస్తున్నాయి.

    వృశ్చికం (Scorpio ): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
    అన్ని విధాలా అనుకూలమయిన సమయం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఆర్థిక సమ స్యల నుంచి చాలావరకు గట్టెక్కుతారు. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభ కార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. దానధర్మాలు చేస్తారు. ఒక వ్యక్తిగత సమస్యను స్నేహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారుల ఆదాయానికి రోకా లేదు. వృత్తి నిపుణులు, రాజకీయ, సామాజిక రంగాల వారు రాణించడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగాలవారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.

    ధనుస్సు( Sagittarius ): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు ఎక్కువవుతాయి. బంధువుల ఇళ్లలో శుభకార్యాలకు వీలైనంతగా సహాయపడతారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హెరాదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగు తుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. . వ్యాపారులకు ఆదాయాలు, లాభాలు నిలకడగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు. ఐ.టి నిపుణులకు అధ్యాపకులకు బాగుంటుంది.

    Navaratri 2021: నవరాత్రుల్లో ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే.. ధనానికి లోటు ఉండదు!

    మకరం (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
    గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. తలపెట్టిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. సంపద … ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అక్రమ, అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి.

    కుంభం (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఈ వారం చాలా వరకు ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది. ఆరోగ్యం కుదుట పడటమే కాకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఈ ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు, బాధ్యతలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశ్రమ, అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి నిపుణులకు శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. వాటి వారికి కాలం కలిసి వస్తుంది. వివాదాలలో తలదూర్చవద్దు. మితిమీరిన ఔదార్యం వల్ల డబ్బు నష్టపోతారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

    ఇంటికి ఎన్ని కిటికీలు, తలుపులు ఉండాలో తెలుసా.. మీ ఇంటి నిర్మాణం ఇలా ఉండాలి

    మీనం (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
    ఉద్యోగంలో కొన్ని ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వి వాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త లు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. వ్యాపారులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవ ద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ జీవి తం చాలా ప్రశాంతంగా ఉంటుంది.
    Published by:Shiva Kumar Addula
    First published: