• HOME
 • »
 • NEWS
 • »
 • ASTROLOGY
 • »
 • WEEKLY HOROSCOPE FOR 7TH MARCH TO 13TH MARCH 2021 THESE ZODIAC SIGNS PEOPLE MAY GET GOOD NEWS ON THIS WEEK NK

Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఈ వారం శుభవార్తా శ్రవణం

Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఈ వారం శుభవార్తా శ్రవణం

వారఫలాలు... ఈ రాశుల వారికి ఈ వారం శుభవార్తా శ్రవణం

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... మార్చి 7, 2021 నుంచి మార్చి 13, 2021 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • Last Updated:
 • Share this:
  Weekly Horoscope: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (మార్చి 7, 2021 నుంచి మార్చి 13, 2021) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యల గురించి ఆందోళన చెందకండి. ఎవరితోనూ విభేదాలకు దిగవద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాల కోసం కూడా ప్రయత్నాలు
  చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి చాలా బాగుంటుంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక, సేవా రంగాస వారికి
  సమయం శుభప్రదంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ వారం సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం అనుభవానికి వస్తుంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది.

  మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. సోదరులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితుల్లో ఒకరు మిమ్మల్ని పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా బాగా ఒత్తిడి ఉంటుం. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యం తలపెడతారు. అన్ని విధాలా అనుకూలమయిన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల లోని వారికి సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకుపోతారు. కోర్టు కేసు మీకు అనుకూలమవుతుంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారికి సమయం కొంత అనుకూలంగా ఉంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నేతలు, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ఆవేశకావేషాలతో పనులు చెడగొట్టుకోవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. కోర్టు కేసులు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తు్న్నాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఉద్యోగపరంగా అనుకూల కాలం నడుస్తోంది. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆదాయం మెరుగుపడుతుంది. ఖర్చులు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. తగినంత విశ్రాంతి అవసరం. ఇల్లు కొనే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు. స్థాన చలనం ఉండవచ్చు.

  ఇది కూడా చదవండి: Vastusashtra: ఇంట్లో నెమలి పించం ఏ దిక్కున ఉంచాలో తెలుసా?

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్త వింటారు. ఈ వారం పెండింగ్‌ పనుల్లో చాలా భాగం శ్రమ మీద పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. కానీ, ఖర్చులు తగ్గించుకోవాలి. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సహాయం కూడా తీసుకోండి. భాగస్వాములతో లావాదేవీలు నడపడంలో తొందరపాటు తగదు. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. ఆర్థిక, వాణిజ్య, సినిమా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.

  ఇది కూడా చదవండి: Elephant vs Buffalo: ఏనుగుతో పెట్టుకున్న గేదె... కొమ్ములతో ఫైట్... వైరల్ వీడియో

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  బంధుమిత్రుల ప్రోత్సాహంతో శుభకార్యం తలపెడతారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. బంధుమిత్రులతో సంయమనంతో, సహనంతో మాట్లాడాలి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారంలో కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలను ప్రారంభిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం బాగుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు