Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఇల్లు కట్టుకునే యోగం

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... డిసెంబర్ 6, 2020 నుంచి డిసెంబర్ 12, 2020 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

news18-telugu
Updated: December 6, 2020, 7:39 AM IST
Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఇల్లు కట్టుకునే యోగం
Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి ఇల్లు కట్టుకునే యోగం
  • Share this:
తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (డిసెంబర్ 6, 2020 నుంచి డిసెంబర్ 12, 2020) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)

మీ ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్ర సందర్శనకు బయలుదేరుతారు. వేరే నగరంలోని మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబుర్లు తెలుస్తాయి. సమీప బంధువు రాకతో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభించే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కామర్స్‌ విద్యార్థులకు బాగుంది.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ, వివాహ ప్రయత్నాలకు మరి కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. మంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. ఈ వారం ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండకండి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త వస్తువులు కొంటారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది.

మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఇల్లు కొనాలనే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా చికాకులు ఉంటాయి. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి.

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకూ అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి ఆఫర్‌ అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వారమంత ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయగాలుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయా, సామాజిక, సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూంగా ఉంది. వారాంతంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
మంచి సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్‌ అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం గానీ, ఇల్లు గానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయండి. ఆరోగ్యం జాగ్రత్త.

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఉద్యోగం విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. హామీలు ఉండొద్దు. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
మీరు తలపెట్టిన పనున్నీ పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఖర్చులు చేయి దాటుతాయి. పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. కుటుంబంతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు పరిష్కారమవుతుంది.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితులతో ఆపార్థాలు తొలగుతాయి. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్త వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. స్త్రీతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉంది. విద్యార్థులకు అనుకూంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పొదుపు మీద దృష్టి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పను పూర్తవుతాయి. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. హామీలు ఉండొద్దు.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
తల్లిదండ్రులను విహార యాత్రకు తీసుకువెళ్తారు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు పెరిగిపోతాయి. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. ఔదార్యానికి హద్దులు పెట్టుకోండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఈ వారమంతా మీకు ప్రశాంతంగానే గడిచిపోతుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థలంగానీ, ఇల్లు గానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలున్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
Published by: Krishna Kumar N
First published: December 6, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading