Weekly Horoscope: వారఫలాలు.. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం, ఆర్థిక శుభాలు

Weekly Horoscope: వారఫలాలు

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... సెప్టెంబర్ 5, 2021 నుంచి సెప్టెంబర్ 11, 2021 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    Horoscope weekly: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (సెప్టెంబర్ 5, 2021 నుంచి సెప్టెంబర్ 11, 2021) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries)
    ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవా రు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.

    వృషభం (Taurus)
    వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయపరంగా కలిసి వస్తుంది. బంధు మిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకుంటారు. నిరుద్యోగులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరి తోనూవాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచన లున్నాయి.

    మిథునం (Gemini)
    ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాజ కీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడి స్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి.

    కర్కాటకం (Cancer)
    ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తోంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. శని సప్తమ రాశి సంచారం కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మంచి ఫలి తాలనిస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో అనుకూలమవుతాయి. వ్యాపారులకు శ్రమ మిగులుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాలవారు అభివృద్ధి సాధిస్తారు.

    సింహం (Leo)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. శుభకార్యాలు జరిగే సూచన లున్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ మంచి ఫలితాలనిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది.

    ఇది కూడా చదవండి: Zodiac signs: అతి ప్రేమ చూపించే రాశులు.. తట్టుకోలేరు!

    కన్య (Virgo)
    గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు మీకు మేలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. వృత్తి నిపుణులకు పరవాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    తుల (Libra)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు చాలావరకు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

    వృశ్చికం (Scorpio)
    ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్ లో ఉన్న పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. డాక్టర్లు, లాయర్లు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు.

    ధనస్సు (Sagittarius)
    ఈ వారం ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలావరకు బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. స్నేహితులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అక్రమ పరిచయాలకు దూరంగా ఉండండి. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించండి.

    మకరం (Capricorn)
    ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఆదాయానికి లోటు లేదు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. అనవసర ఖర్చులు బాగా ఒత్తిడికి గురి చేస్తాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు పడతారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.

    కుంభం (Aquarius)
    గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధన యోగం పడుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏలిన్నాటిశని కారణంగా ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.

    ఇది కూడా చదవండి: Bhakti: తులసిని ఇలా వాడకండి.. దురదృష్టం వెంటాడుతుంది.

    మీనం (Pisces)
    ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్త వుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి నిపుణులు బాగా శ్రమ పడాల్సి ఉం టుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.
    Published by:Krishna Kumar N
    First published: