• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • WEEKLY HOROSCOPE FOR 28TH FEBRUARY TO 6TH MARCH 2021 THESE ZODIAC SIGNS MAY GET GOOD BENEFITS WITH PLANET SUPPORT NK

Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి గ్రహబలంతో మంచి ఘడియలు

Weekly Horoscope: వారఫలాలు... ఈ రాశుల వారికి గ్రహబలంతో మంచి ఘడియలు

వారఫలాలు

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... ఫిబ్రవరి 28, 2021 నుంచి మార్చి 6, 2021 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    Zodiac Signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (ఫిబ్రవరి 28, 2021 నుంచి మార్చి 6, 2021) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
    ఆదాయం బాగున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థాన చలన సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికీ అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాదన, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఆదాయం పెంచుకోవడానికి బాగా శ్రమ పడతారు. అయితే, అనుకోని ఖర్చులు వచ్చి పడుతుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి పెడతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతర అవసరం లేని స్త్రీలతో పరిచయం ఏర్పడి ఇబ్బందులు పడతారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ఆవేశకావేషాలకు లోనుకావద్దు. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ, ఖర్చులు పెరుగుతాయి. శ్రమ ఎక్కువ, ఉపయోగం తక్కువగా ఉంటుంది. చేతికి అందాల్సినవి చివరి క్షణంలో చేజారిపోతుంటాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. అనారోగ్య సమస్యలు తప్పవు. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతానానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఈ వారం అన్ని విధాలా చాలా బాగుంది. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు, అన్ని విధాలా బాగుంటుంది.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలమయిన సమయం. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులు ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఐ.టి నిపుణులకు విదేశీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఈ వారం నుంచి కొంత అనుకూల సమయం ప్రారంభమవుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్‌ అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోతారు. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. అష్టమ శని కారణంగా శ్రమ మీద పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభించవచ్చు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయం పెంచుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో గెలిచే సూచనలు ఉన్నాయి.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి కలిసి వస్తుంది. ఒక ఇంటివారు కావాలన్న మీ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. సంతాన యోగం ఉంటుంది.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. మీరున్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వడ్డీ వ్యాపారులకు కొత్త ఆదాయ మార్గాలు ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం చాలా బాగుంది.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం కావడం, మధ్య మధ్య అనారోగ్యాలు తలెత్తడం జరుగుతుంటుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు, చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయం మెరుగుపడుతుంది. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. కుమారుడికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఈ వారం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఏలిన నాటి శని కారణంగా తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. న్యా్య, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు.

    ఇది కూడా చదవండి: Bhakti: తులసిని ఇలా వాడకండి.. దురదృష్టం వెంటాడుతుంది.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు దూసుకుపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, టెక్నాలజీ, పరిశోధన, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు