HOME »NEWS »PROPHECY »weekly horoscope for 24th january to 30th january 2021 these zodiac signs get more money this week check your astrology nk

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు... ఈ రాశుల వారికి పెరగనున్న ఆదాయం

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు... ఈ రాశుల వారికి పెరగనున్న ఆదాయం
ఈ వారం రాశిఫలాలు...

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... జనవరి 24, 2021 నుంచి జనవరి 30, 2021 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • Share this:
  Zodiac signs: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (జనవరి 24, 2021 నుంచి జనవరి 30, 2021) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)


  మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీవైన
  వస్తువులు కొంటారు. గత బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మేథ్స్‌, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొంత ఒత్తిడి పెరిగినా ప్రనులు పూర్తి చేస్తారు. సాహస కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

  మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కొనసాగుతోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి
  ఉంటాయి. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. మీ కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక, సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నికడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  గ్రహ సంచారంలో కొద్దిగా ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహార యాత్రలు చేస్తారు.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  గ్రహ సంచారం సామాన్యంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో శత్రుబాధ ఉంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలిన నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పుట తప్పవు. సంతానం నుంచి శుభవార్త వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్‌ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. ఏలిన నాటి శని కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.

  ఇది కూడా చదవండి: Money Mantra: రోజూ ఈ మంత్రం జపిస్తే డబ్బే డబ్బు... అప్పులు, ఆర్థిక సమస్యలూ పరార్

  మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయటా గౌరవ ఆదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్త వింటారు. కామర్స్‌ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
  Published by:Krishna Kumar N
  First published:January 24, 2021, 08:26 IST

  टॉप स्टोरीज