HOME »NEWS »PROPHECY »weekly horoscope for 17th january to 23rd january 2021 these zodiac signs get good jobs this week check your astrology nk

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ యోగం

Weekly Horoscope: ఈ వారం రాశిఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ యోగం
ఈ వారం రాశిఫలాలు... ఈ రాశుల వారికి ఉద్యోగ యోగం

Weekly Horoscope: 12 రాశుల వారికి ఈ వారం... జనవరి 17, 2021 నుంచి జనవరి 23, 2021 వరకు... వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

  • Share this:
    Weekly Horoscope: తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి ఈ వారం (జనవరి 17, 2021 నుంచి జనవరి 23, 2021) వార ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)


    ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామి తరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఐ.టి, సాంకేతిక విభాగ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలి మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
    ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది. చాలావరకు అప్పు తీరుస్తారు. ఈ వారంలో ఎక్కువ రోజులు బాగానే గడిచిపోతాయి. ఆరోగ్యానికి లోటు ఉండదు. సన్నిహితులొకరు మోసగించే ప్రమాదం ఉంది. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. వివాహ సంబంధం కుదురుతుంది. సహోద్యోగులు సహాయపడతారు. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. స్నేహితురాలితో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు.

    మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
    ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అష్టమ శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. చిన్ననాటి స్నేహితులు మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటారు. పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. స్నేహితులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది.

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
    ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యా పిల్లలు సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన కబురు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఎవరికీ డబ్బులివ్వవద్దు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో గెలవవచ్చు.

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. తరచూ శివార్చన చేయించండి. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలు తన ఉద్యోగంలో బిజీ అయిపోతుంది. శుభవార్తలు వింటారు.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
    ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది, అవసరాలు తీరతాయి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. పాజిటివ్‌ దృక్పథం అలవరచుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితురాలితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశా నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
    ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. ఈ వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువు కొంటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు. ఐ.టి నిపుణులకు, టీచర్లకు అన్ని విధాలా బాగుంటుంది.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, వైద్యుల సహాయంతో కోలుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాలలోని వారు అభివృద్ధి సాధిస్తారు.

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
    ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నా లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన
    పెరుగుతుంది. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితురాలితో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.

    ఇది కూడా చదవండి:Vastu Sashtra: ఆదివారం అక్కడ దీపం వెలిగించండి... మీ ఇంట ధన ప్రవాహమే

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
    ఈ వారం చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి అన్ని విధాలా బాగుంది. స్నేహితురాలితో సరదాగా గడుపుతారు.
    Published by:Krishna Kumar N
    First published:January 17, 2021, 07:27 IST