• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • WEEKLY HOROSCOPE BY ASTROLOGY THESE ZODIAC SIGNS MAY GET GOOD NEWS ABOUT JOBS AND MARRIAGE MATCHINGS THIS WEEK CHECK RASI PHALALU FROM APRIL 25 2021 TO MAY 1 2021 HERE NK

Weekly Horoscope: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కలిసొచ్చే ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు

Weekly Horoscope: రాశి ఫలాలు... ఈ రాశుల వారికి కలిసొచ్చే ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు

Weekly Horoscope: వార ఫలాలు

Horoscope Weekly in telugu: ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏప్రిల్ 25, 2021 నుంచి మే 1, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు వారఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాలు ఎవరికి బాగా కలిసొస్తాయి? తెలుగు పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తోంది? గ్రహయోగం ఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటివి తెలుసుకుందాం. ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు వారఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా ఈ వారం అనుకూలంగా ఉంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ కొనే అవకాశం ఉంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు.

    వృషభ రాశి (Taurus)
    ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కాస్తంత తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    మిథున రాశి (Gemini)
    గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధన యోగం పడుతుంది. శుభవార్త వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అష్టమ శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.

    కర్కాటక రాశి (Cancer)
    అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం బాగుంది.

    సింహ రాశి (Leo)
    ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. స్నేహితులు సాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం చూసుకోవాలి.

    కన్య రాశి (Virgo)
    ఆదాయానికీ, ఆరోగ్యానికీ ఢోకా ఉండదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉంటే దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు.

    తుల రాశి (Libra)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశా నుంచి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

    వృశ్చిక రాశి (Scorpio)
    గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పరవాలేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. విందు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. శుభవార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది.

    మకర రాశి (Capricorn)
    ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. డబ్బు నష్టపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

    కుంభ రాశి (Aquarius)
    ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

    ఇది కూడా చదవండి: Lemon Health: నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా... డేంజరే.

    మీన రాశి (Pisces)
    మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతాన కలిగే సూచనలు కనిపిస్తాయి. డబ్హు నష్టపోతారు జాగ్రత్త.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు