• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • WEEKLY HOROSCOPE ASTROLOGY SUGGEST THIS WEEK THESE ZODIAC SIGNS GET MORE EARNING OPPORTUNITIES CHECK YOU RASI PHALALU FROM MAY 9 TO 15 NK

Weekly Horoscope: వార ఫలాలు... ఈ రాశుల వారికి మరిన్ని ఆదాయ మార్గాలు

Weekly Horoscope: వార ఫలాలు... ఈ రాశుల వారికి మరిన్ని ఆదాయ మార్గాలు

Weekly Horoscope: వార ఫలాలు... ఈ రాశుల వారికి మరిన్ని ఆదాయ మార్గాలు

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. మే 9 నుంచి 15 వరకూ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థిక, సామాజిక, కుటుంబ, ప్రేమ వ్యవహారాల్లో ఎలాంటి సూచనలు ఉన్నాయో తెలుసుకుందాం.

  • Share this:
    Horoscope Weekly: రాశి ఫలాల్లో వార ఫలాలు ప్రత్యేకమైనవి. ఇవి తెలుసుకుంటే... ఈ వారంలో మన భవిష్యత్తు ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. అంతా మంచే జరిగే అవకాశం ఉంటే... ఒకింత ఆనందపడవచ్చు. అలా కాకుండా ఏవైనా సమస్యలు ఎదురవుతాయనో, ఆర్థిక ఇబ్బందులు వస్తాయనో జ్యోతిష పండితులు చెబితే... ఆ విషయాల్లో అప్రమత్తం అవ్వవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఈ కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. అందువల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విపత్తుల్ని ఎలా ఎదుర్కోవాలో వార ఫలాలు ముందుగానే సంకేతాలిస్తాయి. తద్వారా జాగ్రత్త పడవచ్చు. మరి మే 9 నుంచి 15 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries)
    ఈ వరం పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆదాయపరంగా వృద్ధి కనిపిస్తోంది. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. అక్రమ సంబంధాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి చాలావరకు పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు బాగా శ్రద్ధ పెట్టడం అవసరం. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, వాణిజ్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది.

    వృషభ రాశి (Taurus)
    ఆరోగ్యానికీ, ఆదాయానికీ లోటు ఉండదు. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. భార్యాపిల్లలతో కలిసి విహరిస్తారు. వివాహ సంబంధం కుదరవచ్చు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు. డబ్బు నష్టం జరిగే అవకాశం ఉంది.

    మిథున రాశి (Gemini)
    అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఉద్యోగంలో మార్పులకు అవకాశం ఉంది. బంధువులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు.

    కర్కాటక రాశి (Cancer)
    మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. చిన్న వ్యాపారాల్లో ఉన్నవారికి లాభార్జనకు అవకాశం ఉంది. సామాజిక సేవలో పాల్గొంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకూ సమయం బాగుంది.

    సింహ రాశి (Leo)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడటం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారులు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది.

    కన్య రాశి (Virgo)
    ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులొకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పరవాలేదు. ఆదాయానికి కొరత లేదు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. వృత్తి నిపుణులకు, హోటళ్లవారికి అనుకూల సమయం.

    తుల రాశి (Libra)
    గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారులు లబ్ధి పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం శ్రేయస్కరం కాదు. డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

    వృశ్చిక రాశి (Scorpio)
    ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అన్ని విధాలా అనుకూమైన సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. డాక్టర్లు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారికి బాగుంది. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    ధనస్సు రాశి (Sagittarius)
    బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మధ్య మధ్య అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారులు అభివృద్ధి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది.

    మకర రాశి (Capricorn)
    ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నవారు అదనపు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, న్యాయ, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది.

    కుంభ రాశి (Aquarius)
    మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడటమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అక్రమ సంబంధాలతో కొన్ని సమస్యలకు లోనవుతారు. వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

    ఇది కూడా చదవండి: Venus in Gemini: మిథున రాశిలోకి శుక్రుడు.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

    మీన రాశి (Pisces)
    ఈ వారం ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ఉద్యోగం మారే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు