• HOME
 • »
 • NEWS
 • »
 • ASTROLOGY
 • »
 • WEEKLY HOROSCOPE ACCORDING TO ASTROLOGY PLANETS BRING GOOD NEWS TO THESE ZODIAC SIGNS THAN THOSE RASI PHALALU NK

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు. ఈ రాశుల వారికి అనుకూలంగా గ్రహసంచారం

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు. ఈ రాశుల వారికి అనుకూలంగా గ్రహసంచారం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Weekly in telugu: ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి. ఏప్రిల్ 18, 2021 నుంచి ఏప్రిల్ 24, 2021 వరకు... వార ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో... ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

 • Share this:
  Horoscope Weekly: ప్రతి వారం న్యూస్18 తెలుగు వారఫలాలను అందిస్తోంది. తిథి, నక్షత్రం, పంచాంగం, గ్రహాలు, నక్షత్రాలు, ఘడియలు, ముహూర్తాలు అన్నింటినీ లెక్కలోకి తీసుకొని జ్యోతిష పండితులు వారఫలాలను అందిస్తున్నారు. ఈ వారం ఏయే రాశుల వారికి ఎలా ఉంది? ఆర్థిక అంశాలు ఎవరికి బాగా కలిసొస్తాయి? తెలుగు పంచాంగం ఎలాంటి సూచనలు చేస్తోంది? ఎవరికి ఏయే శుభవార్తలను జ్యోతిషశాస్త్రం అందిస్తోంది? వంటివి తెలుసుకుందాం ఏవైనా సమస్యలు, కష్టాలు ఉంటే ముందుగానే వాటిని అంచనా వేసి... ఎదుర్కొనేందుకు వీలవుతుంది. ఏప్రిల్ 18 నుంచి 24 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  మేష రాశి (Aries)
  గురు గ్రహ (Jupiter Planet) బలం బాగా ఉన్నందువల్ల ఈ వారం ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. ఆస్తి కొనే అవకాశం ఉంది. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారుల అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయటపడతారు.

  వృషభ రాశి (Taurus)
  ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆర్థిక సంబంధమైన రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  మిథున రాశి (Gemini)
  గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా మారినందువల్ల ఆర్థిక పరిస్థితి మారుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. అష్టమ శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.

  కర్కాటక రాశి (Cancer)
  ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పుట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం బాగుంది.

  సింహ రాశి (Leo)
  ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగి అప్పు చేయాల్సి వస్తుంది. స్నేహితులు, బంధువులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

  కన్య రాశి (Virgo)
  ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. పెండింగ్ పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండొద్దు. దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగాల వారికి అనుకూల సమయం. ప్రయాణాల వల్ల నష్టపోతారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు.

  తుల రాశి (Libra)
  గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశా నుంచి ఆఫర్‌ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం.

  వృశ్చిక రాశి (Scorpio)
  గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పరవా లేదు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

  ధనస్సు రాశి (Sagittarius)
  ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళతారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్త వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు బాగుంటుంది.

  మకర రాశి (Capricorn)
  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. శుభవార్త వింటారు. గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్‌, ఐ.టి విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

  కుంభ రాశి (Aquarius)
  మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేయడం మంచిది.

  ఇది కూడా చదవండి: Papaya Benefits: ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... బొప్పాయిని తినకుండా ఉండరు

  మీన రాశి (Pisces)
  మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాదనలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. డబ్బు నష్టపోతారు జాగ్రత్త.
  Published by:Krishna Kumar N
  First published: