Weekly Horoscope: సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 2 వరకు వార ఫలాలు.. వీరి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి..

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: ఈ వారం (సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 2 వరకు) చాలా రాశుల వారికి అద్భుత ఫలాలు కనిపిస్తున్నాయి. మరి ఈ వారంఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Share this:
    Weekly Horoscope: ఈ వారం (సెప్టెంబరు 26 నుంచి అక్టోబర్ 2 వరకు) చాలా రాశుల వారికి అద్భుత ఫలాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలతో కొత్త సమస్యలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ వారం రాశిఫలాలు ఏం చెబుతున్నాయి. ఏ రాశి వారికి శుభ ఫలాలు ఉన్నాయి.. ఎలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి.. ఈ వారంఏ రాశుల వారికి బాగుంది? ఎవరికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

    మేషం (Aries అశ్విని, భరణి, కృత్తిక 1) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు విం టారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననా టి స్నేహితులను కలుసుకుంటారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృ త్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి.

    వృషభం ( Taurus కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) గురు బలం బాగా ఉన్నందువల్ల ఈ వారం ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆస్తికొనే అవకాశం ఉంది. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. శుభ వార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానంలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్న వారు ముందడుగు వేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక కుటుంబ సమస్య నుంచి బయట పడతారు.

    మిథునం (Gemini మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు పూర్తవుతాయి. శ్రమ అధికం, ఫలితం స్వల్పం అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహెూద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారికి, ఆర్థిక సంబంధమైన రంగాలలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం మంచిది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

    కర్కాటకం ( Cancer పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా మారినందువల్ల ఆర్థిక పరిస్థితి మారుతుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. అష్టమ శని కారణంగా కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. ఆదాయం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లలలో ఒకరికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు మారే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తిగా ఉండవు.

    సింహం (Leo మఖ, పుబ్బ, ఉత్తర 1) ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకా ర్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి మంచి సహాయం అందుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. తిప్పట ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం బాగుంది.

    కన్య ( Virgo ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1, 2) ఈ వారం ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు పడతారు. ఖర్చులు పెరిగి అప్పులు చేయాల్సి వస్తుంది. స్నేహి తులు, బంధువులు సహాయం అందజేస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవా రికి సమయం అనుకూలం. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. వీసా సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.

    తుల (Libra చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలోనూ, కుటుంబంలోనూ ఊహించని సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభా లకు అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా ఉండదు. పెండింగ్ పనులలో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంది. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగాల వారికి అనుకూల సమయం.

    వృశ్చికం (Scorpio విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ) గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తా యి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆఫర్ అందవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొందరు స్నేహితుల కారణంగా డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం ఇది.

    ధనస్సు ( Sagittarius మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) గ్రహ సంచారం ఏమంత అనుకూలంగా లేదు. ఆశించిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. విద్యార్థులకు పరవాలే దు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

    మకరం ( Capricorn ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంది. కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. శుభకార్యాల గురించి ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హెూదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒ త్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శుభవార్త వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు బాగుంటుంది.

    కుంభం ( Aquarius ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగానికి సంబంధించి కొత్తఆఫర్లు మీ ముందుకు వస్తాయి. శుభవార్తలు వింటారు. గ్రహ సంచారం సరిగ్గా లేని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. తలచిన పనులు పూర్తవుతాయి. కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘం లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సైన్స్, ఐ.టి వి ద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యుమానిటీస్, కళలకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుం ది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

    మీనం (Pisces పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) అన్నివిధాలా కొద్దిగా పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. లాభాలు గడిస్తారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది.
    Published by:Sumanth Kanukula
    First published: