Home /News /astrology /

WEEKLY HOROSCOPE 24 TO 30 OCTOBER 2021 CHECK ASTROLOGICAL PREDICTION FOR ARIES TAURUS GEMINI CANCER AND OTHER SIGNS SK

Weekly Horoscope: ఈ రాశుల వారు చెడు స్నేహాలకు ఉండాలి.. అక్టోబరు 24 నుంచి 30 వరకు వార ఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope in Telugu: అక్టోబరు 24 నుంచి అక్టోబరు 30 వరకు రాశి ఫలాలు. ఈ వారం రోజుల పాటు ఎవరికి ఎలా ఉంది? ఏయే రాశుల వారికి బాగుంది? ఏయే రాశుల వారికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  అక్టోబరు 24, 2021 నుంచి అక్టోబరు 30, 2021 వరకు..

  వార ఫలాలు

  మేష రాశి (Aries):
  చేపట్టిన పనులు ఎంతో పట్టుదలతో పూర్తి చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. ఇంటా బయటా గౌరవాదరణలు లభిస్తాయి. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్‌ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

  వృషభ రాశి (Taurus):
  మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. వెనుకటి బకాయిలు కొన్ని వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రేమవ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. మేథ్స్‌, ఆర్కియాలజీ, పరిశోధక విద్యార్థులకు బాగుంది.

  మిథున రాశి (Gemini):
  రోజువారీ పనులు అనుకూలంగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు, కార్యాలు అనుకూలిస్తాయి. మితిమీరిన ఔదార్యంతో కొందరికి సహాయం చేస్తారు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. వస్తువులు గానీ, డబ్బు గానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్ధులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

  Dhanteras 2021: ధంతేరాస్‌.. ఈ టైంలో షాపింగ్‌ చేస్తే.. 3 రెట్ల ప్రయోజనం!

  కర్కాటక రాశి (Cancer):
  గ్రహ సంచారం ప్రకారం కొంత ప్రతికూలత కొనసాగుతోంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలున్నాయి. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. డబ్బు జాగ్రత్త.

  సింహ రాశి (Leo):
  ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలున్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసర ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు సానుకూలపడుతుంది. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.

  కన్య రాశి (Virgo):
  గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. ఏ పనైనా శ్రమ మీద గానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి. తల్లి తండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. డబ్బు జాగ్రత్త.

  మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడటానికి 5 ముఖ్యమైన కారణాలు!

  తుల రాశి (Libra):
  ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీరు ఒకటి అనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్త వింటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్దులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు, కళా సాహిత్య రంగాలకు చెందినవారికి బాగుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

  వృశ్చిక రాశి (Scorpio):
  గ్రహ సంచారంలో కొద్దిగా ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి. కొద్దిగా సహనంతో ఉండాలి. అనుకోకుండా కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అవసరానికి కావాల్సిన డబ్బు అందుతుంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. వృథా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. శుభకార్యాల్లో పాల్గాంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. విద్యార్థులకు పరవాలేదు. రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలించి విహారయాత్రలు చేస్తారు.

  Zodiac Sign: ఈ 4 రాశుల అమ్మాయిలు అత్తారింటికి అదృష్టాన్ని తీసుకొస్తారట!

  ధనస్సు రాశి (Sagittarius):
  గ్రహ సంచారం సామాన్యంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు గానీ, స్థలం గానీ అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్ళి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాలలో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన నబ్దెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్టు,టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది.

  మకర రాశి (Capricorn):
  గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరుగుతుంది కానీ, కొన్ని అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు.ఉద్యోగంలో సహచరులతో సమస్యలు తలెత్తుతాయి. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఏలినాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య పని ఒత్తిడి, శ్రమ, తిప్పట తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్‌ విద్యార్ధులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

  Palmistry: మీ అరచేతిలో ‘X’ అక్షరం గుర్తు ఉందా?

  కుంభ రాశి (Aquarius):
  మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్‌ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు సెరిగిపోతాయి. ఏలినాటి శని కారణంగా మధ్య మధ్య కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శమపడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. శ్రమ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

  మీన రాశి (Pisces):
  ఈ వారం మీకు అన్నివిధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అరోగ్యానికి, అదాయానికి లోటు ఉండదు. తలచిన పనులు తేలికగా పూర్తవుతాయి. అతి ఔదార్యం మంచిది కాదు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వృత్తి నిపుణులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్ధులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మిత్రుల నుంచి సమస్యలు తలెత్తుతాయి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Weekly Horoscope, Zodiac signs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు