Home /News /astrology /

WEEKLY HOROSCOPE 20 TO 26 JUNE 2021 ASTROLOGY SUGGESTIONS THIS WEEK TO THESE ZODIAC SIGNS CHECK YOUR RASHIFAL HERE NOW NK

Weekly Horoscope 20 to 26 June, 2021: ఈ రాశుల వారికి మెరుగ్గా వార ఫలాలు

ఈ రాశుల వారికి మెరుగ్గా వార ఫలాలు

ఈ రాశుల వారికి మెరుగ్గా వార ఫలాలు

Weekly Horoscope 20 to 26 June, 2021: జూన్ 20 నుంచి జూన్ 26 వరకూ... ఈ వారం ఎవరెవరి వార ఫలాలు ఎలా ఉన్నాయి... ఏ రాశుల వారికి ఎలా ఉందని జ్యోతిష పండితులు చెబుతున్నారో తెలుసుకుందాం.

    Horoscope Weekly: రాశి ఫలాల్లో ఈ వారం ప్రత్యేకమైనది. ఇండియా తిరిగి కోలుకుంటూ... లాక్‌డౌన్లు ఎత్తివేస్తున్న వారం. కాబట్టి ఈ వారంలో ప్రజల్లో కదలికలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార, వాణిజ్యాలు మళ్లీ జోరందుకుంటాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మరి రాశి ఫలాలకు సంబంధించి సూర్య గమనం, గ్రహ బలాలు, రాశుల్లో నక్షత్ర బలాలు, తిథి, కాలం ఇవన్నీ ఏం చెబుతున్నాయి? ఏ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది... ఎవరికి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి? ప్రేమలు, వివాహాలు, శుభకార్యాలు ఎవరి ఇళ్లలో జరుగుతాయి? ఇలాంటి అంశాలపై జూన్ 20 నుంచి జూన్ 26 వరకూ వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (Aries) (March 21-April 20):
    ఉద్యోగానికి సంబంధించి దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తలపెట్టిన పనుల్ని మిత్రుల సహాయంతో పూర్తి చేస్తారు. దగ్గర బంధువొకరికి ఆర్థికంగా సహాయపడతారు. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది.

    వృషభ రాశి (Taurus) (April 21-May 20):
    ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆదాయానికి లోటు ఉండదు కానీ బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఖర్చులు బాగా పెరుగుతాయి. గతంలో మీ వల్ల సహాయం పొందినవారు మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. హామీలు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

    ఇది కూడా చదవండి: Zodiac Signs: ఈ రాశుల వారు పరమ విధేయులు... కట్టప్పను మించిపోతారు

    మిథున రాశి (Gemini) (May 21-Jun 21):
    అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. పాజిటివ్‌గా ఆలోచించండి. ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం మీరు గతంలో మీరు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలనిస్తాయి. ఆరోగ్యానికి ఏమాత్రం డోకా లేదు. ఉద్యోగంలో మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి వస్తుంది. అనుకున్న పనులు మిత్రుల సహాయంతో పూర్తవుతాయి. వ్యాపారంలో బాగా ఒత్తిడి ఉన్నా దాని వల్ల ప్రయోజనం పొందుతారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ వస్తుంది.

    కర్కాటక రాశి (Cancer) (Jun 22-July 22):
    ఉద్యోగులకు ఇతర కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించే సూచనలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. వ్యాపారపరంగా ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపిస్తుంది. వ్యక్తిగతంగా ఊహించని సమస్యలు ఎదురవుతాయి. మిత్రులు అన్ని విధాలా అండగా నిలుస్తారు. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పిల్లల్లో ఒకరికిమంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూడటం మానుకోవాలి.

    ఇది కూడా చదవండి: Vastu Tips: ఇంట్లోని ఆ దిశలో డబ్బు అస్సలు ఉంచొద్దు... ఉంచితే అష్ట దరిద్రమే!

    సింహ రాశి (Leo) (July 23-August 23):
    ఉద్యోగంలో మీ ప్రతిభను, అనుభవాన్ని అధికారులు గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగిస్తారు. ఆదాయం పెరిగి కొన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు. సన్నిహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. వీలైనంతగా రుణ భారం తగ్గించుకుంటారు. వృత్తి నిపుణులకు సమయం బాగుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కొద్దిగా విలాస జీవితానికి అలవాటు పడతారు. ఒక శుభ కార్యం సందర్భంగా బంధువులను కలుసుకునే అవకాశం ఉంది.

    కన్య రాశి (Virgo) (August 24-September 23):
    ఉద్యోగంలో అధికార హెూదా లభించే అవకాశం ఉంది. విధి నిర్వహణలో సూద్యోగులు బాగా సహకరిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కొందరు పలుకుబడి గలవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయంగా ఉంటారు. ఆదాయం పెరగడంతో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలతో సంప్రదించండి. లాయర్లకు, డాక్టర్లకు, చిన్న వ్యాపారులకు క్షణం తీరిక ఉండకపోవచ్చు. బాగస్వామ్య వ్యాపారంలో కాలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

    ఇది కూడా చదవండి:


    తుల రాశి (Libra) (September 24-October 23):
    మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందవద్దు. ఊహించని విధంగా మిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థికంగా బాగానే ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా బాగా ఒత్తిడి, చికాకులు ఉంటాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. ఇరుగుపొరుగుతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

    వృశ్చిక రాశి (Scorpio) (October 24-November 22):
    అనుకోకుండా ఆర్థిక సహాయం అంది కొద్దిగా ఊరట చెందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, స్వయం ఉపాధివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం వేచి చూడక తప్పదు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. అద్దె ఇంట్లో ఉన్నవారు ఇల్లు మారతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.

    ధనస్సు రాశి (Sagittarius) (November 23-December 21):
    మీ కలలు సాకారమయ్యే సమయం ఇది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. గతంలో మీ దగ్గర డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఉద్యోగంలో అధికారులను మెప్పిస్తారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. సొంత నిర్ణయాలు ఉత్తమం. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది. పిల్లలు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారంలో విజయం సాధిస్తారు.

    మకర రాశి (Capricorn) (December 22-January 21):
    ఆదాయం కోసం క్షణం తీరిక లేకుండా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పడి శ్రమకు గురవుతారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం పరవాలేదు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఆఫర్ వస్తుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తల పెట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. బంధువుల ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు. తోబుట్టువులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

    కుంభ రాశి (Aquarius) (January 22-February 19):
    ఉద్యోగం మారడానికి మీరు చేసే కొన్ని ప్రయత్నాలు బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతానికి అటువంటి ప్రయత్నాలు విరమించడం మంచిది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో త్వరలో స్థిరత్వం లభిస్తుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల పురోగతి గురించి సమాచారం అందుకుంటారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సహాయపడతారు.

    ఇది కూడా చదవండి: Viral video: వామ్మో... ఆటో... షాక్ ఇచ్చిందిగా... వీడియోను మళ్లీ మళ్లీ చూస్తున్న నెటిజన్లు

    మీన రాశి (Pisces) (February 20-March 20):
    ఏదో ఒక ఆరోగ్య సమస్య పట్టి పీడిస్తుంటుంది. వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుంటాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికాంశాలు బాగా మెరుగ్గా ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం కోసం మరి కొంతకాలం నిరీక్షించాల్సి ఉంటుంది. కొందరు మిత్రులను నమ్మి నష్టపోతారు. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. బంధువులు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac sign

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు