Home /News /astrology /

WEEKLY HOROSCOPE 17TH OCTOBER TO 23RD OCTOBER 2021 HERE IS THIS WEEK ASTROLOGY PREDICTIONS IN TELUGU SK

Weekly Horoscope: అక్టోబరు 17 నుంచి 23 వరకు వార ఫలాలు.. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: అక్టోబరు 17 నుంచి అక్టోబరు 23 వరకు రాశి ఫలాలు. ఈ వారం రోజుల పాటు ఎవరికి ఎలా ఉంది? ఏయే రాశుల వారికి బాగుంది? ఏయే రాశుల వారికి బాగాలేదు.? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? ఈ వారం రాశి ఫలాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  కాలజ్ఞానం

  అక్టోబరు 17 నుంచి అక్టోబరు 23 వరకు

  వార ఫలాలు


  మేష రాశి (Aries):
  చాలావరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన వస్తుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్ధులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. (పేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతాన భాగ్యం కలిగే సూచనలున్నాయి.

  వృషభ రాశి (Taurus):
  జీవితం విషయంలో పాజిటివ్‌గా ఉండండి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఐ.టి, సాంకేతిక విభాగ విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధించే సూచనలున్నాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది.

  మిథున రాశి (Gemini):
  ఈ వారం బాగానే గడిచిపోతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. కొద్దిగా తిప్పట ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. సన్నిహితులొకరు మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. చాలా వరకు అప్పులు తీరుస్తారు. వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. సహోద్యోగులకు సహాయసహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

  కర్కాటక రాశి (Cancer):
  సప్తమంలో శని సంచారం కారణంగా చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాద వివాదాలకు దిగవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్‌, బ్యాంకింగ్‌, అర్థిక రంగ నిపుణులకు బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితురాలితో సమస్యలు తలెత్తుతాయి.

  సింహ రాశి (Leo):
  ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం వచ్చే సూచనలున్నాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటు౦ది. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. స్నేహితురాలితో హుషారుగా తిరుగుతారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు అన్నివిధాలా సమయం బాగుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


  కన్య రాశి (Virgo):
  ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. జీవితంలో పైకి రావాలనే తపన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం అనుకూలంగా ఉంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి ఆశించిన మంచి సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల కాస్తంత అప్రమత్తంగా ఉండండి. కోర్టు కేసు ఇబ్బంది పెడుతుంది.

  తుల రాశి (Libra):
  ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్‌ పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులొకరు మోసం చేసే సూచనలున్నాయి. ఆదాయానికి ఏమాత్రం కొరత లేదు. విద్యార్దులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి.


  వృశ్చిక రాశి (Scorpio):
  గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన నమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. స్వయం ఉపాధివారికి, చిన్న వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది.

  ధనస్సు రాశి (Sagittarius):
  అతి కష్టం మీద పనులు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన సెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. వారాంతంలో స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్టు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు. ఐ.టి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.

  మకర రాశి (Capricorn):
  బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాలు తలపెడతారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో బాగా ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్ధులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది.

  కుంభ రాశి (Aquarius):
  ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరుస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటిక్టీ, వైద్య సహాయంతో కోలుకుంటారు. అదాయం పెరుగుతుంది. సంఘుంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు సెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్ధులు మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు.

  మీన రాశి (Pisces):
  ఈ వారమంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనవసర వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం మంచిది కాదని గ్రహించండి. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu, Zodiac signs

  తదుపరి వార్తలు