హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Weekly Horoscope: నవంబరు 14 నుంచి 20 వరకు రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక ధనలాభం

Weekly Horoscope: నవంబరు 14 నుంచి 20 వరకు రాశి ఫలాలు.. వీరికి ఆకస్మిక ధనలాభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Weekly Horoscope: నవంబరు 14, 2021 నుంచి 20 వరకు రాశి ఫలాలు. ఈ వారం పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ముఖ్యంగా ఆర్థికంగా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మరి మేషం నుంచి మీన రాశి వరకు.. ఈ వారం ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...

కాలజ్ఞానం

నవంబరు 14, 2021

వార ఫలాలు

మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ వారమంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. తల పెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థ లంగానీ, ఇల్లు గానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ బాగా తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కోర్టుకేసు పరిష్కారమవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో ఆశించినట్టే పురోగతి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. మంచి సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం నుంచి మంచి కబుర్లు తెలుస్తాయి. సమీప బంధువుల రాకతో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్య వహారాలు ఫలిస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి.

మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ప్రమోషన్ గానీ, మంచి ఇంక్రిమెంట్ గానీ లభించవచ్చు. ఉన్న తాధికారులు, సహోద్యోగులు సహకరిస్తారు. మంచి చోట పెళ్లి సంబంధం కుదరవచ్చు. ఒక పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగానికి పిలుపు వస్తుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండకండి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేసుకోండి. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అతి తేలికగా విజయాలు సాధిస్తారు. స్నేహితురాలితో పెళ్లి విషయం చర్చిస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.

ఈ వస్తువులు కిచెన్‌లో పెడుతున్నారా? అయితే, ఇబ్బందులు తప్పవు..

కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి సమయం బాగుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా చికాకులుంటాయి. శని సంచారం కారణంగా మధ్య మధ్య అనుకోని సమస్యలు తలెత్తుతుంటాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి.

సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు కాస్తంత ఇబ్బంది కలిగిస్తాయి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూల సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశీ సంస్థల నుంచి మంచి ఆఫర్ అందుతుంది. స్నేహితురాలితో ఉత్సాహంగా విహార యాత్రలు చేస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ వృథా వ్యయం ఎక్కు వగా ఉంటుంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. వడ్డీ వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త వారితో పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అ నుకూలంగా ఉంది. వారాంతంలో విహారాల్లో పాల్గొంటారు. స్నేహితురాలి మీద బాగా ఖర్చు చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది.

Vastu Tips: మట్టితో చేసిన ఈ వస్తువులు.. ఇంటికి చాలా లక్కీ!

తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) నిరుద్యోగులు తీపి కబురు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఆదాయం పెరుగుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఒకపట్టాన కలిసిరావు. ఆస్తి పెంచుకునే ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు.

వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. చిన్న వ్యాపారులకు, స్వయం ఉపాధివారికి సమయం అనుకూలంగా ఉంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. హామీలు ఉండొద్దు. కోర్టు కేసు ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.

ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) శుభవార్తలు వింటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. తల పెట్టిన పనులన్నీ చక్కగా పూర్తవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువర్గం వారితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. స్నేహితురాలి మీద కానుకలు గుప్పిస్తారు. కోర్టు కేసు పరిష్కారమవుతుంది. ఆర్థిక లావాదేవీలు, స్పె క్యులేషన్ బాగా లాభిస్తాయి.

Name Meaning: మీ పేరు 'A' అక్షరంతో మొదలవుతుందా?

మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. స్నేహితులతో ఆపార్థాలు తొలగుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్యాలు చికాకు కలిగిస్తుంటాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఆలస్యం అవుతుంటాయి. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. బంధువులు దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవ హారాలు ఫలిస్తాయి.

కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకు నే ఆలోచన చేస్తారు. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఏలిన్నాటి శని కారణంగా మ ధ్య మధ్య ఆలస్యాలు, అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. ఇల్లు కొనా లని ప్రయత్నాలు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఉపాధ్యా యులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. హామీలు ఉండొద్దు.

మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. ఖర్చులు పెరిగిపోతాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేస్తారు. ఔదార్యానికి హద్దులు పెట్టుకోండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఐ.టి, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్తారు..

First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Rasi phalalu, Weekly Horoscope

ఉత్తమ కథలు