• Home
  • »
  • News
  • »
  • astrology
  • »
  • WATCH THE ENCHANTING VIDEO OF PEACOCKS CIRCLING AROUND THE STATUE OF GODDESS SARASWATI IN GERMANY NK

Viral video: కలియుగ వింత. సరస్వతి అమ్మవారి చుట్టూ నెమళ్ల ప్రదక్షిణం. వీడియో చూడండి

సరస్వతి అమ్మవారి చుట్టూ నెమళ్ల ప్రదక్షిణం (image courtesy - twitter)

Mata Saraswati Viral video: ఆ మూడు నెమళ్లు అమ్మవారి విగ్రహం చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఈ అద్భుతం ఎక్కడ జరిగింది? తెలుసుకుందాం.

  • Share this:
    Mata Saraswati Viral video: ఎప్పుడూ ఎక్కడా జరగనిది... జరిగితే... ఆశ్చర్యపోతాం. అలాంటి ఓ అద్భుతం మన ముందే జరిగింది. నెమలిని వాహనంగా చేసుకున్న చదువుల తల్లి సరస్వతి అమ్మవారి విగ్రహం చుట్టూ మూడు నెమళ్లు... ప్రదక్షిణం చేశాయి. ఇది చూసిన భక్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ నెమళ్లు అలా ఎందుకు చేశాయో ఎవరికీ అర్థం కాలేదు. వాటికి ఎవరూ ట్రైనింగ్ కూడా ఇవ్వలేదు. పోనీ ఎవరైనా అలా ప్రదక్షిణం చేయడాన్ని చూసి అవి అలా చేశాయా అంటే... అలా జరగలేదు. ఎందుకంటే... ఆ విగ్రహం పైన ఉంది. అక్కడ ఆ చిన్న విగ్రహం చుట్టూ ఎవరూ, ఎప్పుడూ ప్రదక్షిణలు చెయ్యలేదు. అలాంటి చోట ఈ మూడు నెమళ్లూ... ఒకదాని వెంట ఒకటి నడుస్తూ... ప్రదక్షిణం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది.

    ఇదో కలియుగ వింత అంటున్నారు భక్తులు. ఇది జరిగినది మన దేశంలో కాదు. జర్మనీలోని... శ్రీ పీఠ నిలయం ఆశ్రమంలో. సనాతన ధర్మంలోనే ఈ శక్తి ఉందనీ... అందువల్లే ఆ నెమళ్లు పరిక్రమం చేశాయని ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఇటీజ్ శ్రీ అకౌంట్ నిర్వాహకులు కాప్షన్ పెట్టారు.


    ఈ వీడియో నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. ఇది చూసిన వాళ్లంతా అద్భుతం అంటున్నారు. జనవరి 4న దీన్ని పోస్ట్ చెయ్యగా... ఇప్పటికే ఈ వీడియోను 80వేల మందికి పైగా చూశారు. 13వేల మందికి పైగా లైక్ చేశారు. 68 మంది కామెంట్స్ రాయగా... 2600 మంది షేర్ చేశారు.





    ఇది కూడా చదవండి: Horoscope: ఈ 6 రాశులవారితో తేడా వస్తే తెగతెంపులే... భాగస్వాములూ బీకేర్‌ఫుల్
    చాలా మంది ఈ వీడియో అద్భుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఈ కరోనా రోజుల్లో ఇలాంటి మంచి వీడియో చూడటం తమ అదృష్టం అంటున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: