హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Virgo Horoscope 2023: కన్యా రాశి వారికి వచ్చే ఏడాది అదృష్టం మామూలుగా ఉండదు..

Virgo Horoscope 2023: కన్యా రాశి వారికి వచ్చే ఏడాది అదృష్టం మామూలుగా ఉండదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Virgo Horoscope 2023: కొత్త సంవత్సరం 2023 కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? రిలేషన్‌, కెరీర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారు? అనే విషయాలు తెలుసుకోండి.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Virgo Horoscope 2023: నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలను జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తారు. ఆగస్ట్‌ 23 నుంచి సెప్టెంబర్‌ 22వ తేదీల మధ్య జన్మించిన వారికి కన్యారాశి వర్తిస్తుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం 2023 కన్యారాశి వారికి ఎలా ఉంటుంది? రిలేషన్‌, కెరీర్‌కి సంబంధించి ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారు? అనే విషయాలు తెలుసుకోండి.

జనవరి :

మీరు ముందు ముందు కాలంలో చేయాల్సిన పనుల పట్ల ప్రణాళిక కలిగి ఉంటారు. ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న పనిని చేస్తున్నందుకు ఉత్సాహం కనపరుస్తారు.ప్రస్తుతం మీ పనిని పూర్తి చేయడం ద్వారా సానుకూల దోరణి అలవడి ఆధిపత్యాన్ని పొందుతారు.మీ ముందస్తు ప్రణాళిక వల్ల ప్రతిఒక్కరూ లబ్ది పొందుతారు.రాబోయే కాలంలో మరిన్ని శుభవార్తలు వింటారు.

రిలేషన్‌: ప్రస్తుతం మీరు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు.కొంత మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడొచ్చు.ఒకసారి మీరు కమిట్ అయితే,దానికి అనుగుణంగా నడుచుకోవాలి.

కెరీర్‌: ప్రస్తుతం మీకు కొత్త ఆఫర్లు వస్తున్నట్లయితే కొంతకాలం వాటికి పక్కన పెట్టండి. మీ ప్రతి కదలికను కనిపెట్టేవారు ఉన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు వెళితే మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు. లక్కీ కలర్: మెజెంటా(Magenta)

ఫిబ్రవరి:

మీ భాగస్వామి మీపై ఆధిపత్యం చెల ఇస్తున్నారని మీరు భావిస్తారు కానీ మీ మాట వినేవారు ఉండరు. మీకు చట్టపరమైన సమస్యలు తలెత్తితే మంచి న్యాయవాదిని కలుసుకొని అతనితోపాటు నడవండి. కౌన్సిలింగ్ పొందడానికి మీకు సకాలంలో సహకారం అందుతుంది. షాపింగ్ మళ్లీ వాయిదా వేస్తారు.

రిలేషన్‌: కొంతకాలం పాటు ఒకరితో కొత్త సంబంధం నడపవచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారిని క్షమిస్తారు. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీకు తగిన వ్యక్తి కనుగొంటారు.

కెరీర్‌: ఎక్కువ సమయం మీ పనిని అర్థం చేసుకోవడంలో ప్రణాళిక వేసుకోవడంలోని గడుపుతారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది అది మీకు కొత్త అవకాశాలు తీసుకురావచ్చు. పబ్లిక్ సర్వీస్ లో ఉండే వారికి తీరిక లేకుండా ఉంటుంది.

లక్కీ కలర్: స్కై బ్లూ(Sky Blue)

మార్చి:

మీకు ఇతరుల సహాయం అవసరమైతే వారిని అడగాలి లేదంటే మిమ్మల్ని పట్టించుకోరు. మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. ఇతరుల సహాయం పొందడానికి మీ ప్రణాళికలను రూపొందించుకోండి వాటిని వారికి వివరించండి. మీ జీవితంలో ఎక్కువ సమయం మీకు మీరు గానే ఎదిగారని అనుకుంటారు, కానీ మీ ఎదుగుదలకు గైడెన్స్ అవసరం. మంచి అవకాశాలు ఎదురుచూస్తున్నాయి మీరు వేగం పెంచాలి.

రిలేషన్‌: నిర్మాణాత్మకమైన విమర్శలను మీరు స్వాగతించాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళనకు గురిచేస్తుంది. మీ పాత ప్రేమికులను కలిసి అవకాశం ఉంది.

కెరీర్‌: ఈ మధ్య మీ జీవితం నెమ్మదిగా సాగవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నట్లయితే ఆకస్మిక మార్పులు సూచిస్తున్నాయి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్లయితే మంచి అవకాశం ఎదురుచూస్తుంది.

లక్కీ కలర్: కానరీ ఎల్లో(Canary Yellow)

ఏప్రిల్:

మీరు కలల్లో నుండి బయటికి వచ్చి మీ ఇంట్లో గాని,మీ ఆఫీసు లో గాని మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మీ వెనక జరిగే విషయాలు చాలా అరుదుగా తెలుసుకుంటారు.అంత అయిపోయాక మీరు వాటిని తెలుసుకుంటారు.ఏదైనా మీ అంతట మీరు బలంగా సృష్టించుకుంటారు.మానసికంగా స్థిరత్వంగా ఉన్నారు.

రిలేషన్‌: మీరు ఒంటరిగా ఉన్నట్లయితే ఒక వ్యక్తి మీ పట్ల ఆకర్షితులవుతారు. మీకు తగిన వ్యక్తి కనుగోంటానని నమ్మకం ఉంది. మీ రహస్య బంధాలను ముగించవలసిన సమయం.

కెరీర్‌: మీరు కొత్త ఉద్యోగం కోసం అప్లయ్ చేసినట్లయితే మీకు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. ఏకాగ్రత సమస్య రావచ్చు. వేచి చూస్తే ఉద్యోగ బదిలీ అయ్యే సూచన ఉంది.

లక్కీ కలర్: టార్కోయిస్(Turquoise)

మే:

మీరు ఊహించిన విధంగా ఆనందాలను పొందుతారు. మీ భవిష్యత్తు నిర్మించుకోవడం కోసం ప్రాథమిక అంశాలను సరిగ్గా పొందలేదని భావనతో వాటిని తిరిగి పొందడానికి చూస్తున్నారు. ఎక్కువ కాలం మీతో పాటు ఉండే స్నేహితుడిని కలుస్తారు. మీరు పోగొట్టుకున్న ఈమెయిల్ గాని లెటర్ గాని తిరిగి పొందుతారు.

రిలేషన్‌: మీ జీవిత భాగస్వామితో పాత ఆకర్షణలకు లోనవుతారు. కొన్ని గందరగోల క్షణాలు ఉన్న అవి తత్కాలికమైనవి. ఆన్ లైన్ లో ఆసక్తికరమైన వ్యక్తిని కలుసుకుంటారు.

కెరీర్‌: ఇప్పటివరకు మీరు పెద్ద పెద్ద పనులు చేస్తూ ఉండవచ్చు.ఇది విరామం తీసుకోవడానికి సరైన సమయం. మీకోసం ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. కొన్నిసార్లు ఏటువంటి వార్తలు లేకపోవడం కూడా శుభవార్తే .

లక్కీ కలర్: లిలక్(Lilac)

 జూన్:

మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాన్ని కప్పి పుచ్చుకోకుండా తప్పు ఒప్పుకొని ముందుకు సాగండి. ఒకవేళ మీరు దాచినట్లయితే అది ఏదో ఒక రోజు బయటికి వచ్చి పెద్ద గొడవ జరుగుతుంది. మీకు ప్రయాణం చేయడం బాగా ఇష్టం దానికోసం మీరు ముందుంటారు. మీ ప్లాన్లు అమలు చేయడానికి పెద్దగా అవకాశాలు రావు.

రిలేషన్‌: ప్రస్తుత ఉన్న సంబంధాలకి అనుగుణంగా మీరు ఉండటం లేదు. వ్యతిరేకంగా ఉండే కన్నా వాటిని మెరుగుపరుచుకోండి. మీ వ్యవహార శైలి మీకు నష్టాన్ని కలిగిస్తుంది.

కెరీర్‌: మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కంపెనీలో మీకు పోటీగా ఉన్నవారు తొలగిపోతారు. త్వరలో రివార్డులు పొందే అవకాశం ఉంది.

లక్కీ కలర్: పీకాక్‌ గ్రీన్‌(Peacock Green)

జులై:

మీరు ఇంటి వద్ద కానీ ఆఫీసులో గాని కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. వారంలో ఎక్కువసార్లు ఆతిథ్యం ఇచ్చే పని పడుతుంది. మిమ్మల్ని మీరు ముందుకంటే ఎక్కువగా నియంత్రించుకోవాలి. మీరు చేసే చిన్న తప్పులు గాని పెద్ద తప్పులు గాని తర్వాత లేనిపోని సమస్యలకు దారితీస్తాయి.

రిలేషన్‌: మీరు ప్రశాంతంగా ఉంటూ ఎవరి కోసమైన ఎదురు చూడడానికి ఇది సరైన సమయం. మీ బంధంలో విడిపోయిన తర్వాత జీవితంలో ముందుకు సాగుతారు. కొంతకాలం తర్వాత మళ్లీ దీనికోసం ఎదురు చూస్తారు.

కెరీర్‌: ఊహించని ఫోన్ కాల్ యాదృచ్ఛికంగా మీకు కొత్త వ్యాపారాన్ని తీసుకొస్తుంది. మీకోసం మీరు మీ కంపెనీపై పెట్టుకున్న అంచనాలను వదులుకోవాల్సి రావచ్చు. ఒకరి నుంచి అందే ఊహించని మద్దతు మీ మార్గాన్ని సులభతరం చేస్తుంది.

లక్కీ కలర్: సాల్మన్ రెడ్(Salmon red)

ఆగస్ట్‌:

ఆత్మవిశ్వాసానికి అతి విశ్వాసానికి మధ్య చిన్న గీత తేడా. ఈ విషయాన్ని మీరు గతంలో చాలాసార్లు గ్రహించి ఉంటారు. గతంలో మీరు పదేపదే ఆ గీతను దాటి మీ అసహనాన్ని ప్రదర్శించారు. మీరు గతం నుండి నేర్చుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మరోవైపు జనానికి మీరు అహంకారిగా కనిపిస్తారు. మీ అభిరుచికి తగ్గట్టు మీరు ఎదురుచూస్తున్న దాన్ని త్వరలోనే పొందుతారు.

రిలేషన్‌: మనస్పర్ధలకు అవకాశం ఉంది.మీ తప్పును మీరు ఒప్పుకోవాలి. గతంలో మీకు పరిచయం ఉన్న వ్యక్తి ఏదో ఒక రూపాన్న మిమ్మల్ని కలవడానికి వస్తారు.

కెరీర్‌: కొన్ని అనుకోని చికాకులు ఉండవచ్చు కానీ మీకు స్వీయ విశ్లేషణ, ఆత్మ పరిశీలన ఉంటుంది. మీ భవిష్యత్తు ప్రణాళికల కోసం నిపుణులు నుండి సలహాలు తీసుకోండి. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నట్లయితే,వాటిని క్లియర్ చేస్తారు.

లక్కీ కలర్: సెఫైర్‌ బ్లూ(Sapphire blue)

మీది తులా రాశా? అయితే కొత్త సంవత్సరం 2023 మీకు ఎలా ఉంటుందో తెలుసుకోండి

సెప్టెంబర్:

మీరు ఇష్టంగా శ్రద్ధతో చేస్తున్న పనిని కొందరు అనుసరిస్తున్నారు.మీ పనిని మీరు బాగా చేస్తూ,మీ ప్రోజెక్ట్ కి సంబంధించి జరుగుతున్న అనధికార సమీక్షలు పట్ల జాగ్రతగా ఉండాలి.ఒకరు మీ నుండి చాలా ఎక్కువగా ఆశిస్తూ ఉద్వేగభరితం అవుతుంటారు, కానీ మీకు వారికి సమయం కేటాయించే తీరిక ఉండదు. త్వరలో హాలిడేను ప్లాన్ చేసుకోవాలి.

రిలేషన్‌: కొత్త బంధం అమరిక కనిపిస్తుంది అలాగే మీ భావాలను పంచుకునే వారు కనిపిస్తారు. మీరు నమ్మిన వ్యక్తితో చాలా ప్రశాంతంగా ఉంటారు. మనుషులు పట్ల మీరు విసుగు చెందడానికి ఒక కారణం ఉంది, దాన్ని మీరు త్వరలోనే తెలుసుకుంటారు.

కెరీర్‌: ప్రస్తుతం మీరు అమలు చేయాల్సిన ప్రణాళికలు ఉన్నాయి. ఇతరులు మీ గురించి పుకార్లు చెబుతారు. మీ సంస్థ మీ పట్ల మక్కువ చూపించడంతో పక్కవారికి శత్రువుగా మారుతారు.

లక్కీ కలర్: మోచ(Mocha)

అక్టోబర్:

పనికివచ్చే విషయమైనా పనికి రాని విషయమైనా కానీ మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు పడతారు. మీరు తప్పు నిర్ణయాలు తీసుకోవడం లేదా తప్పుడు వ్యక్తితో మీ సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఈ నిందలు పడతారు. పక్కవాడు తప్పించుకుని మీరు బలి అవుతారు. మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి తద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు.

రిలేషన్‌: మీ వాళ్ళలో ఎవరో ఒకరికి గుండెనొప్పి వచ్చే అవకాశం ఉంది అది మీకే అవ్వచ్చు కూడా. మీరు వైవాహిక జీవితం ద్వారా స్థిరత్వాన్ని పొందుతారు. మీకు నచ్చని విచిత్రమైన సంబంధం మీ అంగీకారం కోసం వస్తుంది దాన్ని మీరు తిరస్కరిస్తారు.

కెరీర్‌: మీరు మంచితనంతో ఇతరులకు చేసిన సాయాన్ని వారు మరిచిపోతారు. మీ పనిని ఆస్వాదించడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. ఒత్తిడి కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

లక్కీ కలర్: స్టోన్ గ్రే(Stone grey)

నవంబర్:

ఓర్పు పడితే మీరు కోరుకున్నవి దక్కుతాయి. మీరు అనుకున్నది చేయడానికి ఇది సరైన సమయం. మీకు నచ్చిన వ్యక్తితో మీ దినచర్య, మీ పనుల గురించి మాట్లాడండి. ప్రభుత్వ కార్యాలయంలో ఆగిపోయిన పనుల కదలిక ఉంటుంది. త్వరలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

రిలేషన్‌: పనికిరాని విషయాలు పట్ల మీకు మీ భాగస్వామికి గొడవ జరుగుతుంది. మీలో ఒకరు ముందు అతిగా స్పందించి తర్వాత పశ్చాత్తాప పడతారు. మీ బంధంలో నిజాయితీ ఉంది దాన్ని మీరు గౌరవించండి.

కెరీర్‌: మీ సొంత ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఏదైనా ప్రారంభ దశలో ఉంటే కొన్ని నియమాలు ఎదురవుతాయి. మీ చుట్టూ కాస్త ప్రతికూల వాతావరణం ఉంది. ఏ పనైనా చేసే ముందు పూర్తిగా పరిశీలన చేయండి.

లక్కీ కలర్: బనానా ఎల్లో(Banana Yellow)

డిసెంబర్:

మీరు కలలు కంటూ మీ పనులు చేస్తుంటారు. పెద్దపెద్ద కలలు కంటారు కానీ మధ్యలో వచ్చే అవంతరాల వల్ల చికాకు పడతారు. మిమ్మల్ని ఒకరు చాలా కాలం నుండి కలవడానికి ప్రయత్నిస్తున్నారు అది మీకు కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాలు వెనకడుగు వేస్తాయి. స్వయం నియంత్రణ, స్వయం సంరక్షణ, అలాగే ఇతర ప్రాధాన్యమైన విషయాలు నిర్వహించడంలో ముందుంటారు. మీరు చాలా కాలంగా మర్చిపోయిన మీ హాబీ గుర్తుకు వస్తుంది.

రిలేషన్‌: మీ వ్యక్తిగత ఆలోచనల వల్ల మీ బంధాలు ప్రమాదంలో ఉన్నాయి. దాని వల్ల మీ కుటుంబంలో మీ గురించి ప్రముఖంగా చర్చకి వస్తుంది. ఇటీవల మీరు కలిసిన వ్యక్తి గురించి మీకు ప్రతికూలంగా తెలుస్తుంది.

మీ మానసిక ఆరోగ్యం కోసం చిన్న ట్రిప్ మేలుచేస్తుంది.

కెరీర్‌: మీ పనికి గుర్తింపు లభించి రాబోయే కాలంలో మరిన్ని అవకాశాలు వస్తాయి. మీ పని ద్వారా మీరు మీ ముద్రను వేస్తారు. ఐటీ పరిశ్రమలో ఉన్న కొందరు కొత్త ఉద్యోగం కోసం చూడవలసి ఉంటుంది.

లక్కీ కలర్: బ్రాంజ్‌(Bronze)

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

First published:

Tags: Astrology, Horoscope, Virgo, Zodiac signs

ఉత్తమ కథలు