Home /News /astrology /

VINAYAKA POOJA SIZE OF THE IDOL FLOWERS USED IN POOJA RNK

Lord vinayaka: వినాయకుని పూజలో ఈ సైజును మించిన విగ్రహం వాడరాదు! లేదంటే..

వినాయక చవితి పూజ

వినాయక చవితి పూజ

విఘ్నేశ్వరుడిని 21 పత్రాలతో, షోడశనామాలతో పూజిస్తే.. క్షేమ, స్థైర్య, ధైర్య, అభయ, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

వినాయక చవితి అతి త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో ఆ గణనాథుడిని ఏ విధంగా పూజిస్తే.. మనకు విఘ్నాలు తొలగి.. సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయో, వినాయకుడిని ఎలా పూజించి ప్రసన్నం చేసుకోగలమో తెలుసుకుందాం.

సాధారణంగా జోతిషశాస్త్రం ప్రకారం కేతువుకు అధిపతి విఘ్నేష్వరుడు. అంతేకాదు, కుజ, బుధుడి అనుగ్రహాలు పొందాలన్నా.. గణనాధుడి అనుగ్రహం తప్పనిసరి. పిల్లల చదువులకు ఏ అడ్డంకులు లేకుండా.. చక్కగా కొనసాగాలంటే కూడా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవాలి.

ముఖ్యంగా మంగళకరమైన విషయాలు.. అంటే పెళ్లిళ్లు, భార్యాభర్తల మధ్య బంధం అన్యోన్యంగా సాగాలన్నా ఆ వినాయకుడి కరుణ ఉండాల్సిందే. వీరికి ఎటువంటి దోషాలు కలిగినా.. విఘ్నేష్వరుడి ఆరాధన వల్ల కచ్చితంగా తొలగిపోతాయి. అయితే, ముఖ్యంగా వినాయకుడిని ఎలా పూజించాలో వినాయక వ్రత కథలో స్పష్టంగా వివరించారు.

అందువల్ల మన దేశవ్యాప్తంగా వినాయక చవితి అత్యంత వైభవంగా, ఉత్సాహాంతో నిర్వహిస్తారు. ఆయన్ను భక్తితో పూజిస్తే.. ఆ ఏడాది మొత్తం కష్టాలు తొలగి కచ్ఛితంగా శుభలు కలిగి, విజయం సాధిస్తారని మన పెద్దలు చెబుతున్నారు.

వినాయకుడి పూజకు ఏ విగ్రహాం వాడాలి?

  • సాధారణంగా ఇళ్లలో పూజామందిరాల్లో పెట్టుకునే వినాయక విగ్రహాం ఆ ఇంటి యజమాని బొటన వేలు మించి ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఎంత పెద్ద విగ్రహాం పెట్టుకుంటే.. అంతగా నిత్యం ధూపదీప నైవేధ్యలు పెట్టాలి అంటారు.

  • అదే వినాయక వ్రతంలో అయితే, అరచేతిని మించకుండా ఉండే విఘ్నేష్వరుని ప్రతిమను ఏర్పాటు చేసుకోవాలి.

  • ఇక వినాయకచవితి నాడు పూజకు మట్టి విగ్రహాం వాడటం అత్యంత శ్రేయస్కరం.

  • వినాయక చవితినాడు పెద్ద పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటారు. వారు ఆ స్థాయిలో గణపతికి ధూపదీప నైవేధ్యలను అందించాలి. ప్రతిరోజూ ఉదయం, మధ్నాహ్నాం, సాయంత్రం పూజలు, హోమాలు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి.

  • ఆ విగ్రహాన్ని తూర్పు లేదా ఈశాన్యం లేదా ఉత్తరంలో ఏర్పాటు చేసుకుని, అత్యంత శుచిగా అన్నప్రసాదాలు నైవేధ్యం పెట్టాల్సి ఉంటుంది. ఈయన పూజకు ముఖ్యంగా భక్తి చాలా అవసరం. హంగూఅర్భాటాలు లేకుండా భక్తికి ప్రధాన్యతనివ్వాలి.

  • ఒకవేళ అవకాశముంటే నదీతీరంలో ఉండే బంకమట్టితో ఆ విఘ్నేష్వరుడి ప్రతిమను తయారు చేసి, మన పూజా మందిరంలో ఏర్పాటు చేసి, అత్యంత భక్తిశ్రద్ధలతో, పరిమళ పత్రాలతో పూజ చేసిన తర్వాత తిరిగి మళ్లీ నీటిలో నిమజ్జనం చేయాలి.

  • పిల్లలకు ఎంతో ఇష్టమైన దైవం వినాయకుడి. ఈయన పూజవల్ల పిల్లలకు బుద్ధి వికాసం పెరుగుతుంది, ఆలోచనలు మెరుగుపడతాయి.అందుకే పూజలో కూడా పుస్తకాలు పెట్టి పూజిస్తారు.


గణపతిని ఇంట్లో ఎన్నిరోజులపాటు ప్రతిష్ఠించుకోవాలి ?

  • శాస్త్రం ప్రకారం మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, ఇరవై ఒకటి రోజులు... ఈ ప్రక్రియలో వినాయకుని స్థాపించుకుంటారు. వారి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలి.

  • ముఖ్యంగా విఘ్నేశ్వరుడి పూజలో 21 పత్రాలతో పూజిస్తారు. అవి జాజి, దత్తుర, అర్ఘ్య, ఇతర పత్రాలు వాడతారు. ఇందులో వాడే పత్రిలో ఔషధ గుణలు కలిగి ఉంటాయి. బాధ్రపదం అంటేనే రోగాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పత్రాలు పూజకు వాడతం కావున.. ఇంట్లో ఉండే క్రిమికీటకాలు నశిస్తాయి.

  • వినాయక చవితి నాడు గడపకు పసుపు రాసి, మామిడాకులు కట్టి, ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని మన పూర్వీకులు చెబుతున్నారు. వినాయక కథను అందరూ కచ్ఛితంగా విని, విగ్రహాంపై అక్షితలు చల్లాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటే సకల విజ్ఙాలు తొలగి శుభాలు కలుగుతాయి.

Published by:Renuka Godugu
First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు