Home /News /astrology /

VINAYAKA CHAVITHI IMPORTANCE WHY WE CELEBRATE STORY BEHIND FESTIVAL RNK

వినాయక చవితి విశిష్టత... ఆ రోజు ఈ పని ఎందుకు చేయకూడదు?

వినాయక చవితి ఐకమత్యానికి ప్రతీక. దేశవ్యాప్తంగా అనేక గణపతి ఆలయాలు వెలశాయి.మనదేశంలోనే కాదు శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇంకా అనేక దేశాల్లో ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో మహారాష్ట్రలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

వినాయక చవితి ఐకమత్యానికి ప్రతీక. దేశవ్యాప్తంగా అనేక గణపతి ఆలయాలు వెలశాయి.మనదేశంలోనే కాదు శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇంకా అనేక దేశాల్లో ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో మహారాష్ట్రలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

వినాయక చవితి ఐకమత్యానికి ప్రతీక. దేశవ్యాప్తంగా అనేక గణపతి ఆలయాలు వెలశాయి.మనదేశంలోనే కాదు శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, ఆస్ట్రేలియా ఇంకా అనేక దేశాల్లో ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో మహారాష్ట్రలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల పుత్రుడు గణపతి. తండ్రి వల్ల తలను పోగొట్టుకోవాల్సి వచ్చింది. హిందూ సాంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. ఏ పనులు తలపెట్టిన విఘ్నాలు లేకుండా కాపాడేవాడు. చివరకు ఏ శుభకార్యాలు తలపెట్టిన ముందుగా పూజలు అందుకునే ఆది దేవుడు.

వినాయక చవితి విశిష్టత..
మట్టి విగ్రహలను వాడవాడల ఏర్పాటు చేసుకుని అంగరంగ వైభవంగా నిర్వహించుకునే ఈ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. ఈ రోజు వినాయకుడి పుట్టిన రోజు. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు పరమశివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. దీనికి ప్రసన్నమైన శివుడు.. ఏ వరం కావాలో కోరుకోమంటాడు. దీనికి ఆ రాక్షసుడు ‘నీవు ఎల్లప్పుడు నా ఉదరంనందే నివసించాలి అంటాడు’ శివుడి అతని కోరికను మన్నించి గజాసురుడి కడుపులో ప్రవేశించి అతని ఉదరంలో నివసించసాగాడు.

విషయం తెలుసుకున్న పార్వతీదేవి.. విష్ణువు వద్దకు వెళ్లి ‘నా భర్తను భస్మాసురుడి నుంచి కాపాడినట్లుగా.. గజాసురిడి నుంచి కూడా రక్షించమ’ని వేడుకుంటుంది. దీనికి ఉపయం ఆలోచించిన విష్ణుమూర్తి దీనికి గంగిరెద్దు మేళమే సరైందని.. శివడి ద్వారపాలకుడైన నందిని గంగిరెద్దుగా మారుస్తాడు. మిగతా బ్రహ్మాదిదేవతలను వివిధ వాయిద్యాకారులుగా మార్చి గజాసురిడి పురానికి వెళ్లి నందిని ఆడించారు. అందుకు తన్మయత్వం చెందిన గజాసురుడు ఏం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. ఇది మహాన్నోతమైన గంగిరెద్దు, శివుడిని వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి నీ ఉదరంలో ఉన్న శివుడిని ఇచ్చేయమని కోరతారు.

అది అడిగింది ఎవరో కాదు సాక్షాత్తూ ఆ మహావిష్ణువేనని తెలుసుకున్న గజాసురుడు తనకింక మరణం తథ్యమని గ్రహిస్తాడు. దీంతో శివుడితో ‘నా ముఖం లోకమంతా ఆరాధించేట్టుగా.. నా చర్మాన్ని ధరించాలని కోరతాడు’ దీనికి శివుడు అంగీకరించగా.. విష్ణువు సైగతో నంది తన కొమ్ములతో గజాసురుడి కడుపును చీల్చి చంపేస్తుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడు.. విష్ణువును స్తుతిస్తాడు. విష్ణువు ఇలా దుష్టులకు అడిగిన దానాలు చేయకూడదని శివుడితో అంటాడు.

వినాయకుడి పుట్టుక...
ఇక తన భర్త శివుడు కైలాసానికి వస్తున్న సంగతి తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో సంతోషిస్తుంది. అభ్యంగన స్నానం ఆచరించడానికి నలుగు పిండితో ఓ బాలుడి బొమ్మను తయారు చేసి.. దానికి ప్రాణం పోసింది. ఆ బాటుడిని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్లింది. ఆ సమయంలోనే శివుడు కైలాసానికి చేరుకున్నాడు.

లోపలికి వెళ్లనీయకుండా ఆ బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపానికి గురైన శివుడు బాలుడి తలను ఖండించి లోనికి వెళ్లాడు. పార్వతీదేవి సర్వాలంకారాలు చేసుకుని శివుడి వద్దకు వచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. వాకిట్లో తనను అడ్డుకున్న బాలుడిని సంహరించినట్లు శివుడు చెబుతాడు. ఆ వార్తతో పార్వతీ దుఃఖించడం మొదలుపెట్టింది. పార్వతీ దేవిని ఓదార్చి తాను తెచ్చిన గజాసురుడి ముఖాన్ని ఆ బాలుడికి పెట్టి ప్రాణం పోశాడు శివుడు. అప్పుడు ఆదిదంపతులు అతన్ని కుమారుడిగా స్వీకరించి.. ఎలుకను వాహనంగా ఇచ్చారు. అందువల్వే గజానానుడిగా విఘ్నేశ్వరుడు పేరుపొందాడు. ఆ తర్వాత పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు.

కొద్దిరోజులు గడిచిన తర్వాత ఒకరోజు దేవతుల, మునులు తాము ఏ పని చేసినా.. విఘ్నాలు కలుగకుండా ఓ దేవుడిని కనికరించమని కోరతారు. దానికి విఘ్వేశ్వరుడు, కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శివుడు మీలో ఏవరైతే ముల్లోకాలలోని అన్నీ పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా ఎవరు వస్తారో వారికే ఈ పదవి అని అన్నాడు. దానికి అంగీకరించిన కుమారస్వామి తన వాహనమైన నెమళిని తీసుకునే వెంటనే వెళ్లిపోతాడు. విఘ్నేశ్వరుడి చిన్నబుచ్చుకుని శివుడితో ఇలా అంటాడు. నా బలబలాలు తెలుసుకుని కూడా మీరు ఇలాంటి షరతు ఎందుకు పెట్టారు అని అడుగుతాడు.

తన మీద దయ తలచి ఏదైనా ఉపాయం చెప్పమని అడుగుతాడు. అందుకు శివుడు నారాయణ మంత్రం చెబుతాడు. దీన్ని ఒక్కసారి స్మరిస్తే మూడువందల కల్పలు పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అంటాడు. ఆ మంత్రం జపిస్తూ.. తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేస్తాడు గణనాథుడు. కుమారస్వామికి మాత్రం ఏ నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నా .. అప్పటికే గజాసురుడు స్నానం చేసి వస్తున్నట్లుగా కనిపిస్తాడు. అన్ని నదుల్లో స్నానం చేసి తిరిగి కైలాసం చేరుకునే సరికి తండ్రి పక్కనే గణేషుడు కనిపిస్తాడు. తన అహంకారాన్ని గ్రహించి.. ఆ అధిపత్యాన్ని తన అన్నకు ఇవ్వమని కుమారస్వామి శివుడిని కోరాడు.

ఆ విధంగా భాద్రపద చవితినాడు గజానానుడు విఘ్వేశ్వరుడైనాడు.ఆ రోజు భక్తులందరూ విఘ్నేశ్వరుడికి అనేక రకమైన పిండివంటలను అందిస్తారు. ముఖ్యంగా కుడుములు, పాలు, నెయ్యి, టెంకాయ, అరటిపళ్లు, పానకం, వడపప్పు పెట్టారు. విఘ్నేశ్వరుడు తినేంత తిని తన వాహనం కోసం తీసుకోని వెళ్లాడు. ఎప్పటిలాగా తల్లిదండ్రులను నమస్కరించడానికి వంగబోతే తన వల్ల కాలేదు. ఆ విధంగా విఘ్నేశ్వరుడు అవస్థ పడుతుంటే.. శివుడి శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు.

చంద్రుడి కన్నుపడి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్ని దోర్లుకుంటూ బయటకు వస్తాయి. దీనికి పార్వతీ దేవి దుఃఖిస్తూ చంద్రుడిని ఈ విధంగా శాపించింది. నీ చూపు తగిలి నా కుమారుడి పొట్ట పగిలింది. అందుకే నిన్ను చూసినవారు నీలపనిందల పాలవుతారని పార్వతి  శాపించింది.చంద్రుడికి శపవిమోచనం కల్పించమని బ్రహ్మ కోరగా ఏ రోజు తన కుమారుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు చంద్రుడి ముఖం చూడరాదని శపవిమోచనం కల్పించింది. ఇలా నీలపనిందలు ఎదుర్కున్న వారిలో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు.
Published by:Renuka Godugu
First published:

Tags: Vinayaka Chavithi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు