Home /News /astrology /

VIJAYAWADA NAVARATRI 2020 VIJAYAWADA KANAKA DURGAMMA APPEARS AS DURGA DEVI AND MAHISHASURA MARDHINI DEVI TODAY NK GNT

Dussehra 2020: భక్తులతో రద్దీగా ఇంద్రకీలాద్రి... దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు

Dussehra 2020: దసరా నవరాత్రుల్లో ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజించడం, అలంకారం చేయడం మన సంప్రదాయం. మరి నేటి దుర్గాదేవి అలంకార ప్రాసస్థ్యం తెలుసుకుందాం.

    Vijayawada Navaratri 2020: ఆదివారం దసరా కావడంతో... విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొండపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఇవాళ అమ్మవారు... రెండు రూపాల్లో దర్శనం ఇస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ అమ్మవారు... దుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇస్తున్నారు. దుర్గతులను దూరం చేసే రూపమే దుర్గాదేవి అలంకారం. రాక్షసుడైన దుర్గమాసురుణ్ని అష్టమి రోజున చంపి... అమ్మవారి... ఇంద్రకీలాద్రిపై దుర్గగా స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహాస్వరూపాల్లో దుర్గాదేవి రూపం మొదటిది, అనంతమైన శక్తి కలిగినది. ఉగ్రరూపంతో ఉండే అమ్మవారు భక్తులతో మాత్రం శాంతంగానే ఉంటారు. కోటి సూర్యకాంతులంత ప్రభావంతో ఉండే అమ్మవారిని పూజిస్తే.. దుర్గతులు తొలగిపోతాయని ప్రతీతి.

    దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు


    అలంకారం : మహిషాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఆవిర్భవించిన అవతారం ఇది. ఈ అమ్మవారికి సింహాన్ని వాహనంగా ఇచ్చాడు హిమవంతుడు. అంతే సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి ఆ తర్వాత అమ్మవారు ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత అమ్మవారు మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు. ఇంద్రకీలాద్రిపై స్వయంభువుగా వెలిసిన అమ్మవారి సహజ స్వరూపం ఇదే. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది అంటారు. అమ్మవారి ఆరాధన వల్ల భయాలన్నీ తొలగి... శత్రు పరాజయం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

    మహిషాసుర మర్ధినీ దేవి అలంకారంలో అమ్మవారు


    అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి... అందుకు తగిన ఏర్పాట్లలో అధికారులు, ఆలయ నిర్వాహకులు తలమునకలయ్యారు. ప్రస్తుతం దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు. మాస్క్ తప్పని సరి చేశారు.

    భక్తులకు ఇవీ రూల్స్ :
    కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Dussehra 2020, Navaratri 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు