Home /News /astrology /

VERY LUCKY ZODIAC SIGNS GIRL WHO ARE MARRIAGE THESE GIRLS ALSO GET MORE MONEY NGS

Lucky Zodiac Signs: అదృష్టం అంటే వీరిదే..? ఈ 3 రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలకు కనక వర్షమే

ఈ 3 రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కనక వర్షమే

ఈ 3 రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే కనక వర్షమే

Lucky Zodiac Signs: పెళ్లి కాని అబ్బాయిలకు ఇది గుడ్ న్యూస్.. మీ ఇంట్లో కనక వర్షం కురియాలి అంటే.. జస్ట్ ఈ మూడు రాశుల అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే చాలు.. మీ దశ మారినట్టే.. ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంటున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    lucky zodiac signs girls, girls are very attractive boys, beautiful ladies according to zodiac sign, astrology, today horoscope, ఈ రాశుల అమ్మాయిలు అందగత్తెలు, జ్యోతిషశాస్త్రం
     Lucky Zodiac Signs: సాధారణంగా చాలామంది అదృష్టాన్ని నమ్ముతారు.. అయితే కొంతమంది మాత్రం తమకు లక్ కలసి రావడం లేదని.. ఏ పని చేసినా పూర్తవ్వడం లేదని చింతిస్తూ ఉంటారు. కానీ పెళ్లికాని అబ్బాయిలకు ఆ చింత అవసరం లేదు.. ఇలా చేస్తే.. వారి లక్ మారడం కాదు.. వారి ఇంట కనక వర్షమే కురుస్తుంది అంటున్నారు. 


    జ్యోతిష శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాల ప్రభావాలు అన్ని రాశులపైనా ఉంటాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ ప్రభావం ఒక్కోసారి శుభం కలిగేలా చేస్తే మరికొన్ని సార్లు మాత్రం అశుభాలకు కారణమవుతుంది. ఒకవేళ శుభ ఫలితం ఉంటే ఆ వ్యక్తి జీవితంలో చాలా మంచి స్థాయికి వెళతాడు, చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తాడు.


    అలాగే ఆయా రాశుల ప్రభావం.. రాశులను బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా అదృష్టవంతులుగా కొన్ని రాశులకు చెందిన అమ్మాయిలను చెబుతుంటారు. కేవలం వారే కాదు.. వారి కారరణంగా.. డబ్బులు సంపాదించడం ఇతరుల పాలిట అదృష్టంగా మారుతుంటారు. ఇతరులు అందుకోలేనంత స్థాయికి వెళతారు. అలాంటి మూడు రాశులు ఏవంటే..? 


    వృషభం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే వృషభ రాశి అమ్మాయిలు డబ్బులు చాలా తెలివిగా ఖర్చు చేస్తారట. వీరికి చిన్నప్పటి నుంచి డబ్బు మీద చాలా ఇష్టం ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, ఈ రాశి అమ్మాయిలు వ్యాపారంలో కనుక ఒక చేయి వేస్తే ఖచ్చితంగా మంచి విజయం సాధించి, పెద్ద వ్యాపారవేత్తలుగా మారి సత్తా చాటుతారట.  


    ఇతర అమ్మాయిల కంటే.. వారి బ్రెయిన్ చాలా షార్ప్ అని అంటుంటారు. ఈ రాశిచక్రాన్ని శుక్రుడు పాలించే గ్రహం కావడంతో, వారు వ్యాపారంలో చాలా ముందుకు వెళతారని అంచనా. శుక్రుడు వ్యాపారానికి కారకుడిగా చెబుతారు. అంతే కాదు వారు వివాహం అయితే.. తమ భాగస్వాములతో వ్యాపారంలో భాగస్వాములు అవుతారు. లక్ష్మీ దేవి కూడా ఈ రాశి అమ్మాయిల మీద ప్రత్యేకించి ప్రేమ చూపుతుంది అంటారు. ఆమె తన భర్తకు కూడా అదృష్ట లక్ష్మీగా మారుతుంది అంటున్నారు.


    తులారాశి: ఈ రాశికి చెందిన అమ్మాయిలు వ్యాపార ఆలోచనాపరులుగా ఉంటారు. డబ్బు సంపాదించడంలో అబ్బాయిల కంటే ఈ రాశి అమ్మాయిలు ముందుంటారని జ్యోతిష్య శస్త్రంలో చెబుతారు. అలాగే వీరి ముందు పెద్ద పెద్ద వ్యాపారులు సైతం వెనుకంజ వేస్తాయంట. వీరిని పాలించే గ్రహం శుక్రుడు కావడంతో వారుకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పుట్టుకతోనే వస్తాయంటున్నారు. ఆమె మాట్లాడే విధానం ద్వారా అవతలి వ్యక్తిని ఆకట్టుకుంటుందట. 


    మకరం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశికి అధిపతి శని కావడంతో ఆ శని దేవుడు సైతం వారి మీద చాలా ప్రేమతో ఉంటారు. ఈ రాశి అమ్మాయిలు స్వతహాగా చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారని చెబుతున్నారు.  


    వారి శ్రమ ఆధారంగా, వారు వారి కెరీర్‌లో ఉన్నత స్థానాన్ని చాలా తక్కువ సమయంలోనే అందుకుంటారు. ఇక ఈ రాశికి చెందిన అమ్మాయిలు డబ్బుపై దృష్టి పెడతారు. అందుకే ఈ రాశి అమ్మాయిలను చేసుకున్నవారికి కూడా లక్ కలిసి వస్తుంది అంటారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Astrology, Future Prediction, Horoscope Today, Zodiac signs

    తదుపరి వార్తలు