Home /News /astrology /

VASTU TIPS NEVER EAT AND DRINK FOOD ON BED IN BEDROOM YOU MAY FACE THESE PROBLEMS SK

Vast Tips: బెడ్‌రూమ్‌లో ఈ పనులు అస్సలు చేయకండి.. ఆ ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం..బెడ్‌రూమ్‌లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. వాటి వల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే ఉంటుంది? ఏ పనీ జరగదు. ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి.

    మన సంప్రదాయాల్లో వాస్తు శాస్త్రానికి (Vastu Shastra) ప్రత్యేక స్థానముంది. చాలా మంది వాస్తును విశ్వసిస్తారు. వాస్తు నియమాలను పాటిస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. కానీ కొందరు వాస్తు దోషాల గురించి తెలియక తప్పులు చేస్తుంటారు. మనం చేసే చిన్న చిన్ప పొరపాట్లే ఎన్నో ఇబ్బందులకు కారణమవుతాయని వాస్తు నిపుణులు చెబుతారు. దాని ప్రభావం ఇంట్లోనే కాదు...బయట కూడా పడుతుంది. ఇంట్లో వాస్తు దోషం కారణంగా కుటుంబ సభ్యుల ఆర్థిక వృద్ధి, పురోగతి ఆగిపోతుంది. అందువల్ల వాస్తు నియమాలను (Vastu Tips in Telugu) పాటించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    వాస్తు శాస్త్రం ప్రకారం..బెడ్‌రూమ్‌ (Bedroom vastu tips)లో కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. మంచం మీద కూర్చొని భోజనం చేయడం నిషిద్ధం. చాలా మంది తమ పడకగదిలో మంచం మీద కూర్చొని ఆహారం తింటుంటారు. కానీ అలా చేయకూడదు. ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు ఆర్థికపరమైన అడ్డంకులు ఎదుర్కోవలసి ఉంటుంది. ఏ పని చేసినా సక్సెస్ కాదు. అందుకే బెడ్‌రూమ్‌‌లో బెడ్‌పై కూర్చొని తినడం తాగడం చేయకూడదు.

    వసంత పంచమిరోజు పసుపురంగు దుస్తులు ధరిస్తే.. ఏమవుతుందో తెలుసా?

    వంటగది (Kitchen vastu tips) విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనం తిన్న ప్లేట్స్, కడగని వంట పాత్రలును రాత్రిళ్లు వంటగదిలో అలాగే వదిలేయకూడదు. ఇలా చేస్తే ధన నష్టం వాటిల్లుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు వంటగదిలో పడి ఉన్న పాత్రలను శుభ్రం చేయాలి. అప్పుడే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదు.

    రాత్రిపూట బాత్రూంలో ఒక బకెట్ నిండా నీరు ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉండదు. అంతేకాదు వంటగదిలో ఒక బకెట్ నిండా నీరు ఉంచాలి. ఇలా చేస్తే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి ఎల్లప్పుడూ బాగుంటుంది. డబ్బు సమస్యలు రావు.

    వసంత పంచమిరోజు రతి-మన్మథులను ఎందుకు పూజిస్తారో తెలుసా?

    వాస్తుశాస్త్రం ప్రకారం.. ఇంటికి ఈశాన్యంలో పూజ గది ఉంటే అది శుభప్రదం. అలాగే ఇంటికి ఈశాన్య భాగంలో నీటిని ఉంచడం వల్ల వారి జీవితంలో సంతోషం కలుగుతుంది. ఇంటిల్లిపాది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు.

    వాస్తు నియమాల ప్రకారం... సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఎవరికీ పెరుగు, పాలు, ఉప్పును ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో దారిద్య్రం వస్తుంది. ఆర్థిక సమస్యలు చుట్టముడతాయి. చేతిలో డబ్బులు నిలవదు.

    చెడు జరిగే ముందే ఈ 3 రాశులవారు ముందుగానే పసిగట్టేస్తారట..ఇందులో మీ రాశి కూడా ఉందా?

    (Disclaimer: ఈ కథనం కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, నివేదికల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bedrooms, Lifestyle, Money, Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు