Home /News /astrology /

VASTU TIPS KEEP THESE SEVEN THINGS IN YOUR MIND WHEN BUYING NEW HOME OTHERWISE YOUR FAMILY MAY FACE SOME ISSUES SK

Vastu Tips: కొత్త ఇంటిని కొంటున్నారా? ఈ వాస్తు నియమాలను తప్పకుండా పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వాస్తు దోషాలున్న ఇంటిలో కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి కనిపిస్తాయి. అందుకే కొత్త ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేసేటప్పుడు వాస్తు గురించి తెలుసుకోవాలి.

    సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ డ్రీమ్ హౌస్‌లో నివసించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలు పడతారు. డబ్బులు కూడ బెట్టో లేదంటే లోన్లు తీసుకొనో ఇంటిని కొంటారు. తమ సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. ఎన్నో కలల కని.. కష్టాలు పడి.. కట్టుకున్న ఆ ఇంటిలో ఎలాంటి కొరత ఉండకూడదని భావిస్తారు. తమకు అదృష్టం తెచ్చేలా ఉండాలని కోరుకుంటారు. ఐతే వాస్తుశాస్త్రం (Vastu Shastra) ప్రకారం.. ఇంటిలో వాస్తు దోషాలు (Vastu Doshas) ఉంటే అది అంత మంచిది కాదు. ఆ ఇంట్లో నివసించే కుటుంబానికి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే కొత్త ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొనుగోలు చేసేటప్పుడు వాస్తు గురించి తెలుసుకోవాలి. అన్నీ వాస్తు ప్రకారమే ఉన్నాయా? లేదా చూసుకోవాలి. మరి ఇల్లు కొనేటప్పుడు ఎలాంటి వాస్తు నియమాలను గుర్తుంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

    ఇంట్లో శంఖం ఊదడం వల్ల 7 ప్రయోజనాలను తెలుసుకోండి

    కొత్త ఇల్లుకు వాస్తు నియమాలు

    1. ఇల్లు లేదా ఫ్లాట్‌కు సంబంధించిన ప్రధాన ద్వారం ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పులో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలాంటి ప్రధాన ద్వారం ఉన్న గృహాలు వాస్తులో ఉత్తమమైనవిగా వాస్తు నిపుణులు చెబుతారు. అందుకే మెయిర్ డోర్ విషయంలో వాస్తు నియమాలను పాటించాలి.

    మీ ఇంట్లో.. ఏ దిక్కు ఏ దేవతకు సంబంధించిందో తెలుసా? ధనాకర్షణ విపరీతంగా రావాలంటే ఈ దిక్కే..

    2. మీరు ఏ ఇల్లు లేదా ఫ్లాట్ తీసుకున్నా.. దాని ఆకారం చతురస్రాకారంగా లేదా దీర్ఘచతురస్రాకారంగా ఉండేలా చూసుకోవాలి. ఇది వాస్తు ప్రకారం అలాగే ఉండాలి. ఇంటి ముందుభాగం లేదా చివరిలో.. ఎక్కడైనా కోణం ఏర్పడినట్లయితే... దానిని తీసుకునే ముందు మంచి వాస్తు నిపుణుడిని సంప్రదించాలి.

    3. మీ ఇల్లు లేదా ఫ్లాట్ ప్రధాన ద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూసుకోవాలి. మెయిర్ డోర్‌కు ఎదురుగా లిఫ్ట్, ఏదైనా గోడ లేదా పెద్ద చెట్టు వంటివి అస్సలు ఉండకూడదు. అలా ఉంటే వాస్తు దోషం కలుగుతుంది. ఇంట్లో అనేక ఇబ్బందులు వస్తాయి.

    Feng Shui: ఇంట్లో ఏనుగు విగ్రహాన్ని ఈ ప్రాంతంలోనే పెట్టండి.. కెరీర్ లో తక్షణ పురోగతి..

    4. మీరు కొనబోయే ఇల్లు లేదా ఫ్లాట్‌కు దక్షిణం, పశ్చిమ దిశలో పెద్ద చెరువు, స్విమ్మింగ్ పూల్ ఉంటే దానిని కొనడం మానుకోవాలి. ఇంటికి ఆ దిశలో చెరువులాంటివి ఉండడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

    5. ఇంట్లో లేదా ఫ్లాట్‌లో వంటగది ఆగ్నేయ దిశలో ఉంటే మంచిది. తూర్పు దిశలో ఉన్నా పరవాలేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది తూర్పు దిశలోనే వంట గది ఉండేలా జాగ్రత్త పడతారు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వంట గది ఉండకూడదని గుర్తుంచుకోవాలి.

    6. ఫ్లాట్ లేదా ఇంటికి తూర్పు, ఈశాన్య దిశలో ఖాళీ స్థలం ఉండాలి. దక్షిణ లేదా పశ్చిమ దిశలో ఉంటే బాల్కనీ దానిని కొనకండి. అలా ఉంటే ఇంట్లో పలు రకాల ఇబ్బందులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు.

    Zodiac Signs-Fraud : ఈ 5 రాశుల వారు కట్టప్ప కంటే డేంజర్..మీరు కూడా అందులో ఉన్నారేమో చూడండి

    7. ఇంట్లో పూజ గది లేదా పూజ చేసే ప్రాంతం ఉత్తర దిశలో ఉండాలి. పిల్లల గది వాయువ్య దిశలో, పడకగది నైరుతి దిశలో ఉండాలి. ఇల్లు కొనేముందు ఈ వాస్తు నియమాలను పాటిస్తే.. ఆ ఇంట్లో అంతా బాగుంటుందని చాలా మంది విశ్వసిస్తారు.

    (Disclaimer: ఈ కథనంలో ఉన్న సమాచారం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Life Style, Lifestyle, Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు