హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu Tips: రామ తులసి, కృష్ణ తులసి.. ఈ రెండింటిలో ఏది ఇంట్లో ఉంటే మనకు శుభప్రదం?

Vastu Tips: రామ తులసి, కృష్ణ తులసి.. ఈ రెండింటిలో ఏది ఇంట్లో ఉంటే మనకు శుభప్రదం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: రామ, కృష్ణ తులసి మొక్కల్లో దేనిని ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదంగా ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉంటాయి. మరి ఏది ఉంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తులసి మొక్క (Tulasi Plant)ను హిందూ మతంలో ఎంతో గౌరవంగా భావిస్తారు. తులసి మొక్కకు నిత్యం పూజించి.. దీపాలు వెలిగించే.. ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చాలా మంది నమ్ముతారు. తులసి మొక్క ఉండే ఇంట్లో లక్ష్మీ దేవతన నివసిస్తుందని విశ్వసిస్తారు. వాస్తు శాస్త్రం (Vastu Sashtra) లో తులసి మొక్కను సానుకూల శక్తికి కారకంగా పరిగణిస్తారు. దానిని ఏ దిశలో ఉంచితే సానుకూల ప్రయోజనాలు కలుగుతాయో వివరించారు. ఐతే తులసి మొక్కల్లో ఎన్నో రకాలున్నాయి. అందులో రామ తులసి (Ram Tulasi), కృష్ణ తులసి (Krishna Tulasi) గురించి ఎక్కువ మందికి తెలుసు. కృష్ణ తులసిని శ్యామ తులసి అని కూడా పిలుస్తారు. మరి రామ, కృష్ణ తులసి మొక్కల్లో దేనిని ఇంట్లో పెట్టుకుంటే శుభప్రదంగా ఉంటుందని చాలా మందికి సందేహాలు ఉంటాయి. మరి ఏది ఉంటే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

అమావాస్య రాత్రి కలలో మీ పూర్వీకులు కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా?

వాస్తు శాస్త్రంలో రామ తులసి, కృష్ణ తులసి.. రెండింటికీ ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిలో ఏది మంచిదంటే.. రెండూ గొప్పవేనని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ రెండు రకాల మొక్కలలో ఏదైనా మీ ఇంట్లో నాటవచ్చు. దేనికైనా పూజలు చేయవచ్చు. తులసి మొక్క ఇంట్లో ఉంటే.. ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. తద్వారా కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. కార్తీక మాసంలోని ఏదైనా గురువారం రోజు ఇంట్లో రామ లేదా శ్యామ తులసి మొక్కను పెట్టుకుంటే.. ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

శని సంచారంతో మీన రాశి వారికి తీవ్ర ఇబ్బందులు.. ఈ పరిహారాలు చేయాల్సిందే!

రామ తులసి:

రామ తులసి మొక్క పచ్చని ఆకులను కలిగి ఉంటుంది. కాండం కూడా పచ్చగా ఉంటుంది. మంచి సువాసన వస్తుంది. దీనిని ఉజ్వల్ తులసి అని కూడా అంటారు. రామ తులసి ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. దీని ఆకులు కాస్త తియ్యగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

కుంభ రాశిలోకి శుక్రుడు.. శని కూడా అక్కడే.. ఫిబ్రవరి 15 వరకు ఈ రాశుల వారికి పండగే.. పండగ

కృష్ణ తులసి:

కృష్ణ తులసిలో ఔషధ గుణాలు ఎక్కువ. అందుకే ఆయుర్వేదంలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటి ఆకులు ఊదా, ఆకుపచ్చ కలబోతగా ఉండడం వల్ల కృష్ణ తులసి అని పిలుస్తారు. ఈ చెట్టు కాడలు కూడా ఉదా రంగులో ఉంటాయి. మత విశ్వాసాల ప్రకారం, దాని రంగు కారణంగా శ్యామ తులసి శ్రీకృష్ణుడికి సంబంధించినదని విశ్వసిస్తారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

First published:

Tags: Vastu, Vastu Tips

ఉత్తమ కథలు