VASTU TIPS IN TELUGU IF YOU HAVE BAD HABITS LEAVE THEM IMMEDIATELY TO GET RID OFF FINANCIAL PROBLEMS SK
Vastu Tips: ఎంత సంపాదించినా రూపాయి కూడా మిగలడం లేదా? ఇలా చేస్తే మీ దరిద్రమంతా పోతుంది
ప్రతీకాత్మక చిత్రం
Vastu Tips: మీలోని కొన్ని చెడు అలవాట్లు కూడా మిమ్మల్ని దారిద్ర్యులుగా మారుస్తాయి. వాస్తు, జ్యోతిష్యం ఆధారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు అలవాట్లు మానుకోవాలి. మీకు అలాంటి అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి.
మనలో చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి. కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా.. అది ఖర్చయిపోతుంది. పర్సులు ఖాళీ అవుతుంది. నెల తిరిగే సరికి రూపాయి కూడా మిగలదు. మనుషులు పేదవారిగా మిగలడానికి డబ్బు రాకపోవడం ఒక్కటే కారణం కాదు. మనసు కూడా మంచిగా ఉండాలి. మంచి అలవాట్లు ఉండాలి. అప్పుడే అన్ని విధాలుగా వృద్ధి చెందుతారు. వాస్తు శాస్త్రం (Vastu Shastra), జ్యోతిష్య శాస్త్రం (Astrology) ప్రకారం.. మీలోని కొన్ని చెడు అలవాట్లు కూడా మిమ్మల్ని దారిద్ర్యులుగా మారుస్తాయి. వాస్తు, జ్యోతిష్యం ఆధారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చెడు అలవాట్లు మానుకోవాలి. మీకు అలాంటి అలవాట్లు ఉంటే వాటిని మార్చుకోండి. ఆ విషయాల గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. అలాగే మశుభ్రమైన ఇంట్లోనే లక్ష్మి నివసిస్తుందని కూడా చెబుతారు. మీ ఇల్లు పరిశుభ్రంగా లేకుంటే ధనలక్ష్మి మీ ఇంట్లో నిలవదేదు.
ముఖ్యంగా ఈశాన్య దిశ అపరిశుభ్రంగా ఉంటే.. అది మంచిది కాదు. మీరు ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేయాలి. మురికిగా.. చెత్త చెదారంతో ఉన్న ఇంట్లోకి లక్ష్మి రాదు. చీపురు ఇంటిని శుభ్రం చేస్తుంది కాబట్టే.. చీపురును లక్ష్మికి చిహ్నంగా పరిగణిస్తారు.
డబ్బు, నగలు ఉంచే అల్మారా వద్ద చీపురును ఉంచకూడదు. ఇది మీ ఆదాయంపై ప్రభావం చూపుతుంది. పర్సులో ఉన్న డబ్బంతా నీళ్లలా ఖర్చవుతుంది.
అలాగే ఇంట్లో ఉన్న పెద్ద వారిని గౌరవించాలి. పెద్దలను గౌరవించని వారువయస్సు, జ్ఞానం, కీర్తి, బలాన్ని కోల్పోతారట. అంతకాదు నం కూడా ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అందుకే. మీరు మీ పెద్దలను కూడా గౌరవించాలి. వారిని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచాలి.
ప్రతి చిన్న దానికీ అరవడం, అనవసరంగా ఎక్కడైనా ఉమ్మివేయడం, ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది. ఇది మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంటి ఆగ్నేయ దిశలో డబ్బు ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమాని ఆదాయం తగ్గుతుంది.
చాలా సార్లు ప్రజలు 'కీ'ని కప్బోర్డుల్లో పెట్టి వెళ్లిపోతారు. కానీ ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఎక్కువ ధన నష్టం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు డబ్బకు విలువ ఇవ్వాలి. అప్పుడే మీ ఇంట్లో ధనం నిలుస్తుంది.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.