హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu Tips: న్యూ ఇయర్‌కి ముందు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. కొత్త ఏడాదిలో వద్దంటే డబ్బు

Vastu Tips: న్యూ ఇయర్‌కి ముందు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి.. కొత్త ఏడాదిలో వద్దంటే డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: న్యూఇయర్ రోజు అందరూ తమ ఇంటిని అందంగా డెకరేట్ చేస్తుంటారు. ఎప్పటిలా కాకుండా.. ఈసారి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఇంట్లో ఉంచితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కనీసం ఈ ఏడాదైనా తమకు మంచి జరగాలని.. ఎలాంటి కష్టాలు రావొద్దని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా డబ్బులకు ఇబ్బంది ఉండకూడదని దేవుడికి ప్రార్థిస్తుంటారు. ఐతే వాస్తు శాస్త్రం ప్రకారం.. నూతన సంవత్సరంలో కొన్ని రకాల వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా ఉంటుందట. సాధారణంగా అందరూ న్యూఇయర్ రోజు ఇంటిని అందంగా డెకరేట్ చేస్తుంటారు. ఎప్పటిలా కాకుండా.. ఈసారి కొన్ని ప్రత్యేకమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. వాటిని ఇంట్లో ఉంచితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆర్థిక కష్టాలు తొలగిపోయి.. సంపద పెరుగుతుంది.

 Palmistry: అరచేతిలో ఈ గుర్తు ఉంటే ఆ వ్యక్తి చాలా లక్కీ

లాఫింగ్ బుద్ధ:

చాలా మంది తమ షాప్‌ల్లో లాఫింగ్ బుద్ధ బొమ్మను పెట్టుకుంటారు. దీనిని ఇంట్లో పెట్టుకుంటే కూడా మంచిది. ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే సానుకూల శక్తి పెరుగుతుంది. ఐతే దీనిని ఈశాన్య దిశలోనే ఉంచాలి.

తులసి:

తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. మీకు కొత్త సంవత్సరంలో ఆర్థిక పురోగతి కావాలంటే ఇంట్లో తులసి మొక్కను నాటుకోవాలి. ఇంట్లో తులసి మొక్కను ప్రతిరోజూ పూజించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయట.

Zodiac signs: ఈ 3 రాశులవారు చాలా స్మార్ట్, ఆకర్షణీయంగా ఉంటారు..

నెమలి ఈకలు:

శ్రీకృష్ణుడికి నెమలి ఎంతో ఇష్టమైనవి. నెమలి ఈకలు ఎక్కడైతే ఉంటాయో.. అక్కడ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వారికి డబ్బుకు కొదువ ఉండదని వాస్తుశాస్త్రం చెబుతుంది.

లోహపు తాబేలు:

మనలో చాలా మంది లోహపు తాబేలును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలాంటి తాబేలును ఇంట్లో ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయట. అది ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొస్తుందని నమ్ముతారు.

దక్షిణావర్తి శంఖం:

దక్షిణావర్తి శంఖాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పూజ చేయాలి. అనంతరం ఎర్రటి వస్త్రంలో ఉంచి.. మీరు డబ్బును పెట్టే ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)

First published:

Tags: Astrology, Money, Vastu Tips

ఉత్తమ కథలు