Home /News /astrology /

VASTU TIPS IF THESE THINGS ARE IN THAT DIRECTION THEN YOU HAVE A LOT OF MONEY VASTU TIPS TO INCREASE WEALTH AND PROSPERITY GH VB

Vastu Tips: ఈ వస్తువులు ఆ దిశలో ఉంటే మీకు డబ్బే డబ్బు.. సంపద, శ్రేయస్సును పెంచే వాస్తు టిప్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. దిశ బాగుంటే దశ తిరుగుతుందని భావిస్తారు. ఏదైనా కొత్తగా నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. ఇంట్లో లేదా ఆఫీసులో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తు శాస్త్రం వివరంగా చెబుతుంది.

ఇంకా చదవండి ...
మన సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఉంది. దిశ బాగుంటే దశ తిరుగుతుందని భావిస్తారు. ఏదైనా కొత్తగా నిర్మాణం చేసేటప్పుడు వాస్తుశాస్త్ర నిపుణుల సలహాలను తీసుకుంటారు. ఇంట్లో లేదా ఆఫీసులో(Office) ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తు శాస్త్రం(Vaastu Sastra) వివరంగా చెబుతుంది. సాధారణంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ నాలుగు ప్రధాన దిశలు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఆర్థిక పురోగతి ఇంటి తూర్పు, ఈశాన్య దిశలపై ఆధారపడి ఉంటుంది. తూర్పు, ఈశాన్య దిశల్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే వాస్తు శాస్ర్తం ప్రకారం.. ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవచ్చు. లేకపోతే తీవ్రమైన సంక్షోభంలోకి కూరుకుపోవచ్చు. దీంతో జీవితంలో ఉన్నత స్థాయి చేరుకోవడానికి, ఆర్థికంగా పుంజుకోవడానికి తూర్పు, ఈశాన్య దిశలను ఎలా వినియోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

* నీలం రంగు పిరమిడ్
ఇంటికి ఉత్తర దిశలో నీలం రంగు పిరమిడ్ ఉంచడం శుభసూచికంగా పనిచేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశలో నీలం రంగు పిరమిడ్‌ను ఉంచడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుంది. ఖజానా నిండుకుండలా ఉంటుంది.

Summer Holidays: హాలిడేస్‌లో అక్కడకు ట్రిప్‌కు వెళ్తున్నారా..? తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు ఇవే..!


* గాజు గిన్నె
వాస్తు శాస్త్రం ప్రకారం... ఇంటికి ఉత్తరం వైపు గాజు గిన్నె ఉంచాలి. అలాగే ఈ గిన్నెలో వెండి నాణేన్ని ఉంచడంతో లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటిపై ఎల్లప్పుడు ఉంటుంది. దీంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

* తులసి, ఉసిరి మొక్కలు
ఇంటికి ఉత్తరం దిక్కులో తులసి మొక్క నాటితే ఇంటికి శుభం కల్గుతుంది. లేకపోతే ఉసిరి మొక్కను నాటిన ఫలితం ఉంటుంది. దీంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

* వినాయక, లక్ష్మిదేవి విగ్రహాలు
వాస్తు ప్రకారం, వినాయకుడు, లక్ష్మీ దేవి విగ్రహాలను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ విగ్రహాలకు ప్రతిరోజూ మట్టి దీపంతో వెలిగించాలి. ఇలా చేస్తే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

* ఉత్తర దిశ
వాస్తుశాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. వీరిని సంపద దేవుడు అని కూడా అంటారు. దీంతో డబ్బుకు సంబంధించిన సేఫ్ లాకర్‌ను ఇంట్లో ఉత్తర దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.

సాధారణంగా ఇల్లు నిర్మించుకునేటప్పుడు వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఉత్తర దిశలో ఇంటి ప్రవేశ ద్వారం, పడకగది, బాల్కనీ ఉంటే అనుకూలంగా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం కూడా ఈ దిశలో ఉత్తమంగా ఉంటుంది. దక్షిణ దిశలో ఎంటర్‌టైన్‌మెంట్ రూమ్‌ ఉంటే బాగుంటుంది.

ఇక పశ్చిమ దిశ శక్తినిచ్చే ప్రాంతం. ఈ దిశలో ఇంటిలోని రూమ్‌ను పడకగదిగా లేక క్రీడా పరికరాల నిల్వ గదిగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని భోజన స్థలం కోసం కూడా ఉపయోగించవచ్చు. పడమటి వైపున ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేయవచ్చు. చివరగా తూర్పు దిశ.. ప్రాణం ఇచ్చే సూర్యునిచే పరిపాలించబడుతున్నందున తూర్పు ప్రవేశించడానికి గొప్ప దిశ. ఉదయం సూర్యకాంతి మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ దిశలో కిటికీలు, తలుపులు, బాల్కనీలు ఉంటే ప్రయోజనం ఉంటుంది. అలాగే లివింగ్ రూమ్, డ్రాయింగ్ రూమ్, ఫ్యామిలీ లాంజ్ కోసం కూడా ఈ దిశ అనువైనది.
Published by:Veera Babu
First published:

Tags: Home made, Vastu, Vastu Tips

తదుపరి వార్తలు