Home /News /astrology /

VASTU TIPS FOR MONEY VASTU TIPS FOR INDOOR PLANTS DO NOT KEEP THESE 5 PLANTS AT HOME SJN

Vastu Tips For Money : ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మొక్కలను మీ ఇంట్లో ఉంచుకోకండి.. లేదంటే డబ్బు కోసం పడరాని పాట్లు పడతారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips For Money : కొందరు మొక్కలను ఉంచుతూ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు లేదా చెట్టను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచడం మంచిది కాదట. వాటి వల్ల ఆ కుటుంబ సభ్యలకు అనేక రకాలుగా సమస్యలు వస్తాయని చెబుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
Plants, Magic To Attract LOVE, Basil, Jasmine, Miniature roses, Orchids, Anthurium, ప్రేమ పంచే మొక్కలు, తులసి మల్లె, చిట్టి గులాబి, ఆర్కిడ్​, ఆంథూరియం
తన ఇంటిని అందంగా ఉంచుకోవడాన్ని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. రకరకాల వస్తువులను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉంచుతూ అందరి చేత ప్రశంసలు పొందేందుకు ఇష్టపడతారు. (ప్రతీకాత్మక చిత్రం)


కొందరు మొక్కలను ఉంచుతూ ఇంటిని అందంగా కనిపించేలా చేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు లేదా చెట్టను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచడం మంచిది కాదట. వాటి వల్ల ఆ కుటుంబ సభ్యలకు అనేక రకాలుగా సమస్యలు వస్తాయని చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)


కాక్టస్ మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకురాగలదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం కాక్టస్, ఇతర ముళ్ళ మొక్కలన ఇంట్లో ఉంచుకుంటే కుటుంబ సభ్యుల మధ్య వాదనలు, గందరగోళాన్ని పెంపొందిస్తాయట. శృంగార సంబంధాలకు హాని కలిగిస్తాయని నమ్ముతారు. అవి ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తాయి. గదిలో, పడకగది లేదా మీ ప్రధాన ద్వారం వద్ద అలాంటి మొక్కలు ఉండకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)


బోన్సాయి వృక్షాలు లేదా వామన వృక్షాలు.. ఇవి చాలా ఖరీదైనవి, ఆకర్షణీయమైనవి. కానీ దురదృష్టవశాత్తు బోన్సాయి వృక్షాలు ఇంట్లో ఉంచవలసినవి కాదు. ఇవి ఇంటి శ్రేయస్సును దెబ్బతీస్తాయి. అంతేకాకుండా ఇంట్లో నివసించేవారి పురోగతిని అడ్డుకుంటుంది. కాబట్టి వాటిని ఇంట్లో ఉంచుకోకుండా ఉండటం ఉత్తమం అని వాస్తు శాస్త్రం చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)


పత్తి మొక్కలను ముఖ్యంగా సిల్కీ కాటన్ మొక్కలు చూడటానికి అందంగా ఉంటాయి. అయితే వాటిని ఇంట్లో ఉంచినట్లయితే దురదృష్టాన్ని తెస్తాయని నమ్ముతారు. కాబట్టి వీటిని ఇంట్లో ఉంచుకోకండి. (ప్రతీకాత్మక చిత్రం)


వాస్తు శాస్త్రం ప్రకారం చింత చెట్లను ఇంటి ఆవరణలో ఉన్న గార్డెన్ లో పెంచకూడదు. అవి ప్రతికూలతను ఆకర్షిస్తాయట, ఇంట్లోని వారి మనశ్శాంతికి ప్రతికూలంగా మారతాయట. కాబట్టి వీటిని ఇంటి దగ్గర ఎక్కడా ఉంచకూడదు.(ప్రతీకాత్మక చిత్రం)


చేతులను అందంగా కనిపించడానికి మహిళలలు గోరింటాకును చేతులకు పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా జుట్టు సంరక్షణ కోసం కూడా గోరింటాకును వాడతారు. కానీ ఈ చెట్లను ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచడం మంచిది కాదు. ఈ చెట్లలో దుష్టశక్తులు ఉన్నాయని నమ్ముతారు. కాబట్టి వీటిని ఇంట్లో పెట్టుకోకపోవడమే మంచిది. దీని నుంచి వచ్చే ఘాటు వాసనను పీలిస్తే మానసిక స్థితిని కూడా భంగపరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)


Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ కోసం చూస్తున్నారా..? ITR రీఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఇలా చెక్ చేసుకోండి..
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Shani Dev, Vastu, Vastu Tips, Weekly Horoscope, Zodiac, Zodiac sign, Zodiac Sings

తదుపరి వార్తలు