Home /News /astrology /

వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో చెత్తను ఏ దిశగా ఊడుస్తున్నారు? ఈ దిశ అస్సలు..

వాస్తు ప్రకారం.. మీ ఇంట్లో చెత్తను ఏ దిశగా ఊడుస్తున్నారు? ఈ దిశ అస్సలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంట్లో పూజగదిని తూర్పువైపునకు ఉండే గోడలోనే ఏర్పాటు చేసుకోవడం మంచిదట. ముఖ్యంగా ఈశాన్య మూలలో దేవుడి మందిరాల నిర్మాణం చేపట్టరాదు.

మన దేశంలో వాస్తు శాస్త్రానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తును  (vastu shastra) అనుసరించి.. వాటి నియమాలను పాటిస్తే.. జీవితం అభివృద్ధిపథంలో నడుస్తుందని నమ్మకం. దీన్ని నమ్మేవారున్నారు, అలాగే, కొట్టివేసేవారున్నారు. కానీ, ఎక్కువశాతం వాస్తు శాస్త్రం ఆధారంగా నడుచుకుంటున్నారు. ఇంటి నిర్మాణంతోపాటు, పెళ్లిళ్లు , శుభాకార్యాలు ఇలా ప్రతి విషయంలో వాస్తు (Vastu) తో ముడిపడి ఉంటుంది. అయితే, ఈరోజు ఉదయం లేవగానే మనం చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో కొన్ని మార్పులు చేస్తే.. మన జీవితం సక్సెస్‌ఫుల్‌ అవుతుందని నిపుణులు చెబుతారు.

ప్రతిరోజూ ఉదయం లేవగానే ఏం చేస్తాం? కొంతమంది తమకు ఇష్టమైన దైవం ఫోటో లేదా నచ్చిన కుటుంబ సభ్యుల ముఖం చూస్తారు.మరికొంత మంది పొద్దున లేవగానే వారి అరచేతి గీతలు చూసి, కళ్లు తడుముకోవాలి అంటారు. కానీ, పక్కమీద నుంచి దిగగానే తూర్పు వైపున కు కొంత నడవాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. దీనివల్ల తలపెట్టిన పనులను నిర్విఘ్నంగా కొనసాగుతాయని అంటున్నారు. అంతేకాదు దీనివల్ల మంచి లాభాలను కూడా పొందుతారట.

ఇది కూడా చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఏవో తెలుసా?


అదేవిధంగా ఇంట్లో పూజగదిని తూర్పువైపునకు ఉండే గోడలోనే ఏర్పాటు చేసుకోవడం మంచిదట. ముఖ్యంగా ఈశాన్య మూలలో దేవుడి మందిరాల నిర్మాణం చేపట్టరాదు. దీనివల్ల ఆ మూల మూతబడుతుంది. ఇది ఆ ఇంటికే మంచిది కాదు. అలాగే, ఇంటిని శుభ్రం చేసేటపుడు ఈశాన్య మూల నుంచి ప్రారంభించి..నైరుతి దిశకు చెత్తను పోగు చేయాలి. అంతేకానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈశాన్య మూలకు చెత్తను తీసుకురాకూడదు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం చీపురు శనీశ్వరునికి ఆయుధం .

ఇది కూడా చదవండి: జాగ్రత్త.. ఈ 6 లక్షణాలు ఉంటే.. ఆస్తమా అటాక్ అవ్వచ్చు..


అందుకే ఇంటిని ఊడ్చిన తర్వాత చీపురు పైభాగాన్ని మాత్రమే గోడకు ఉంచుతారు. అది శుభకరం. ఇక ఆగ్నేయ మూల వంట చేయడానికి నిర్మాణాలు చేపడతాం. ఇంటి ఇల్లాలు తూర్పునకు అభిముఖంగా నిలబడి మాత్రమే వంట చేయాలి. ఈ చిన్న మార్పులను అనుసరిస్తే.. జీవితంలో విజయవంతంగా ముందుకు సాగవచ్చు.
Published by:Renuka Godugu
First published:

Tags: Vastu Tips

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు