Home /News /astrology /

VASTU TIPS FOLLOW THESE VASTU TIPS WHILE PLANTING SAPLINGS IN HOME KNOW THE BEST DIRECTION HERE SK

Vastu Tips: ఇంటి ఆవరణలో మొక్కలు నాటుతున్నారా? ఈ వాస్తు చిట్కాలకు తప్పకుండా పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వాస్తు శాస్తం ప్రకారం.. మొక్కలను ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. వాస్తు జాగ్రత్తలు పాటిచాలి. మరి ఏ మొక్కలను ఏ దిశలో నాటితే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

    చెట్లు లేనిదే మానవ జీవనం లేదు. మనిషి జీవితంలో చెట్లు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. చెట్లు లేకుంటే మనకు ఆహారం ఉండదు. ఆహారం లేకుంటే మనం జీవించలేము. అందుకే మనకు బతుకునిచ్చేవి చెట్లే..! అంతేకాదు పచ్చని వృక్షాలు మనసుకు ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. కొన్ని మొక్కలు ఆహారం ఇస్తే.. మరికొన్ని మొక్కలు తమ ఔషధ గుణాలతో మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇంకొన్ని చెట్లు అలంకరణ కోసం పనికొస్తాయి. మొత్తంగా ఇంట్లో చెట్లు ఉంటే.. ఈ కళే వేరు. అందుకే మనలో చాలా మంది ఇంటి ఆవరణలో చెట్లు నాటుకుంటారు. పచ్చని చెట్ల పట్ల గడిపేందుకు ఇష్టపడతారు. ఐతే వాస్తు శాస్తం ప్రకారం.. మొక్కలను ఎక్కడ పడితే అక్కడ నాటకూడదు. వాస్తు జాగ్రత్తలు పాటిచాలి. మరి ఏ మొక్కలను ఏ దిశలో నాటితే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

    ఈశాన్యం: (North-East Direction):
    వాస్తు శాస్త్రం ప్రకారం.. ఈశాన్య దిశలో చిన్న మొక్కలు నాటడం శుభ ఫలితాలను ఇస్తుంది. తులసి, కొత్తిమీర, పుదీనా మొదలైన రోజువారీ అవసరాలకు వచ్చే మొక్కలను ఇక్కడ నాటుకోవచ్చు. ఇలాంటి మొక్కలను తూర్పు లేదా ఈశాన్య దిశలో మాత్రమే నాటాలి. ఇవి కాకుండా లిల్లీ, బంతి పూలతో పాటు సువాసన పువ్వుల మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇంట్లోకి సూర్యకిరణాలు తూర్పు దిక్కు నుంచి వస్తుంటాయి. ఒకవేళ ఇటువైపు పెద్దపెద్ద మొక్కలు నాటితే సూర్యరశ్మి ఇంట్లోకి రాకుండా చేస్తుంది. అందుకే చిన్న మొక్కలను నాటుతారు.

    తులసి మొక్కను ఈ దిశలో నాటుతున్నారా... అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నవారవుతారు

    ఉత్తరం (North Direction)
    వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశను సంపదల దిశ అని పిలుస్తారు. అందుకే ఈ దిశను ఆనందం, ఐశ్వర్యం, వైభవానికి కారకమైన దిశగా పరిగణిస్తారు. ఉత్తర దిశలో కూడా ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. అంటే పెద్ద పెద్ద వృక్షాలు నాటకూడదు. ఐతే చిన్న చిన్న, సుగంధ మొక్కలను నాటవచ్చు. అరటి, ఉసిరి, బంతి పువ్వు, గులాబీ మొక్కలను పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా నీలం పువ్వుల మొక్కలను పెట్టుకుంటే మంచి జరుగుతుంది.

    దక్షిణం (South Direction)
    ఇంటి ఆవరణలో ఏవైనా పెద్ద చెట్లు లేదా దట్టమైన చెట్లను నాటాలనుకుంటే... అందుకు దక్షిణ దిశ సరైనది. కొన్ని కారణాల వల్ల పెద్ద మొక్కలను దక్షిణ దిశలో నాటలేకపోతే.. పశ్చిమ దిశను కూడా ఎంచుకోవచ్చు. దీని వెనక లాజిక్ ఏమిటంటే .. సానుకూల శక్తి ప్రవాహం ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు ఉంటుంది. అందుకే పడమర, దక్షిణ దిశలో పెద్ద చెట్లను నాటితే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోనే నిలిచిపోతుంది. ఎరుపు రంగు పూల మొక్కలను కూడా దక్షిణ దిశలో నాటవచ్చు.

    ఆషాడంలో కొత్త పెళ్లి కూతురు అత్తగారింట్లో ఎందుకు ఉండకూడదు.. ఉంటే జరిగే నష్టం ఇదే..

    పశ్చిమ (West Direction)
    సాధారణంగా ఇంట్లో రావి చెట్టు ఉంటే అది చాలా హానికరమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. రావి చెట్టును ఇంట్లో సరైన దిశలో నాటితే చాలా శుభప్రదంగా ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీరు పడమర దిశలో ఏదైనా చెట్టును నాటాలనుకుంటే.. అక్కడ రావి చెట్టును నాటవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Vastu, Vastu Tips

    తదుపరి వార్తలు