Home /News /astrology /

VASTU TIPS DONT DO THESE THINGS IN HOME THEY WILL AFFECT YOUR FINANCIAL STATUS AND MAY FACE MONEY PROBLEMS SK

Vastu Tips: మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులా? డబ్బు నిలవడం లేదా? ఈ తప్పులు చేయకండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాస్తు ప్రకారం.. ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

    కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. పొదుపు తగ్గుతుంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. డబ్బులు ఆదా చేయాలని ఎంత ప్రయత్నించినా.. మనకు తెలియకుండానే ఖర్చయిపోతుంటాయి. నెలఖారున చూసుకుంటే పర్సు ఖాళీ అవుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకు చేరుతుంది. ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అందులో వాస్తు దోషాలు కూడా ఒక కారణం. మనకు తెలియకుడానే ఆదాయ వనరులను ప్రభావితం చేసే కొన్ని పనులను చేస్తాం. తద్వారా ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంట్లో డబ్బు నిలవదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వాస్తు ప్రకారం.. ఇంట్లో ఎలాంటి మార్పులు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

    మీరు ఇంట్లో చీపురు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఇతరకు కనిపించకుండా దాచి ఉంచాలి. చీపురును కాళ్లతో తన్నరాదు. ఎందుకంటే చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణిస్తారు. చీపురు ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది.

    ఆదివారం పుట్టినవారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? కలిసివచ్చే కలర్ కూడా..

    మీ వంటగదిలో విరిగిన, పగిలిపోయిన పాత్రలు ఉంటే వెంటనే వాటిని బయట పారేయండి. అటువంటి పాత్రలను ఉపయోగించడం మీ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట ఆహారం మిగిలిపోయిన పాత్రలను వంటగదిలో ఉంచవద్దు. చిరిగిన పాత బట్టలు ఉపయోగించడం వల్ల కూడా పేదరికం పెరుగుతుంది.

    లక్ష్మీ దేవుతను పూజించడానికి మనం విగ్రహాలు లేదంటే చిత్రాలను ఉపయోగిస్తాం. ఐతే లక్ష్మీ దేవత విగ్రహం లేదా చిత్రపటాన్ని మనకు ముఖాముఖిగా అస్సలు ఉంచకూడదు. పూజ గదిలో ఎదురుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. లక్ష్మీ దేవి చిత్రపటాన్ని ఫేస్ టు ఫేస్‌గా ఉంచితే.. అది డబ్బు రాకపై ప్రభావం చూపుతుంది. అలా చేయడం మానుకోవాలి.

    ఈ 4 రాశులవారు తమ ప్రేమను సాధించడానికి ఏదైనా చేస్తారు.. మరి మీది కూడా అదేనా

    మీ ఇంటి లోపల పాడైపోయిన లేదంటే విరిగిపోయిన గడియారం ఉంటే దానిని అలాగే ఉంచుకోవద్దు. రిపేరు చేసి సరైన స్థితిలో ఉపయోగించుకోవాలి. లేదంటే ఇంట్లో నుంచి బయటకు విసిరేయాలి. గడియారం పురోగతికి సూచికగా పరిగణిస్తారు. గడియారం ఆగిపోయిదంటే మీ ఆర్థిక వృద్ధి కూడా ఆగిపోయినట్లే.

    మీ ఇంటి పెరట్లో పెద్ద పెద్ద చెట్లను నాటవద్దు. బోన్సాయ్ మొక్కలు, ముళ్ల మొక్కలను కూడా పెట్టుకోవద్దు. అవి మీ ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. తద్వారా మీ ఆదాయంపై ప్రభావం పడి.. పురోగతిని అడ్డుకుంటుంది.

    మీ ప్రొఫెషనల్ లైఫ్ లో లక్ రావాలంటే.. అద్దం ఈ దిక్కులో పెట్టండి..

    కొన్నిసార్లు మన పర్స్ చిరిగిపోతుంది. వాడి వాడీ చాలా పాతపడిపోతుంది. కానీ మనం లైట్ తీసుకుంటాం. ఏం కాదులే అని.. దానిని మార్చుకోము. కానీ పర్స్ ఆదాయానికి సంబంధించినది. అందుకే అది నీట్‌గా.. చక్కగా ఉండాలి. చిరిగిపోయిన, పాతపడిపోయిన పర్స్‌లను వినియోగించకూడదు.

    ఈ 6 రాశులవారు పుట్టుకతోనే ఐశ్వర్యవంతులు.. వీరికి లక్ష్మి అనుగ్రహం

    ఇంట్లో లాక్ వేసి ఉన్న తాళాలు ఉంచడం మంచిది కాదు. చెడిపోయిన తాళాలు ఉంటే అలాగే ఉంచుకోవద్దు. వెంటనే బయట పడేయాలి. మనలో కొందరికి మంచం మీద కూర్చొని భోజనం చేయడం అలవాటు. కానీ అలా చేయకూడదు. ఇలాంటి అలవాటు లక్ష్మీ దేవికి ఆగ్రహం తెప్పిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే మంచంపై కూర్చొని తినకూడదు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Finance, Money, Vastu, Vastu Tips

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు