Home /News /astrology /

VASTU TIPS DO YOU KNOW THESE FLOWERS NEVER USE IN MAA DURGA PUJA AND KNOW ABOUT THE GODS AND FLOWERS FROM ACHARYA INDU PRAKASH GH SRD

Vastu Tips: దుర్గమ్మ పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూలు వాడకండి..!

Maa Durga

Maa Durga

Vastu Tips: అందుకే మనం పూజించే దేవతకు ఏ పూలు ఇష్టమో, ఏ పూలు ఇష్టం కాదో తెలుసుకోవాలి. దేవతలకు ఇష్టమైన పూలు మాత్రమే పూజలో వినియోగించాలి. కొన్ని పూలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

హిందూ ధర్మంలో పూజకు అత్యంత ప్రాధాన్యం ఉంది. దేవుళ్లను, దేవతలను పూజించడానికి రకరకాల పూలు వాడుతూ ఉంటాం. అయితే కొన్ని పూలు మాత్రం పూజకు పనికిరావు. కొందరు దేవుళ్లకు, దేవతలకు ప్రత్యేకమైన పూలతో పూజలు చేస్తారు. ఎందుకంటే ఆ దేవతలకు, దేవుళ్లకు ఆ పూలంటే ఎంతో ఇష్టం. అందుకే మనం పూజించే దేవతకు ఏ పూలు ఇష్టమో, ఏ పూలు ఇష్టం కాదో తెలుసుకోవాలి. దేవతలకు ఇష్టమైన పూలు మాత్రమే పూజలో వినియోగించాలి. కొన్ని పూలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

* శాస్త్రం ఏం చెబుతోంది
దేవతను పూజించడంలో అనేక పద్దతులు ఉన్నాయి. ఏపూలు, పత్రాలు వాడాలి. అవి ఏ రంగులో ఉంటే దేవతలు అనుగ్రహిస్తారో వాస్తు నిపుణులు వెల్లడించారు. దేవతకు ఇష్టమైనపూలు, పత్రాలు, రంగుల కలయిక అనేది వాస్తు శాస్త్రంలో ఉంటుందట. అది నేరుగా గృహవాస్తు శాస్త్రానికి చెందినదని నిపుణులు చెబుతున్నారు. తంత్రసార, మంత్ర, మహోదధి గ్రంధాల్లో రుషులు ఏ పూలతో ఎవరిని కొలవాలో సూచించారు. విష్ణు మూర్తికి తెలుపు, పసుపు రంగు పూలు ఎంతో ఇష్టం.

సూర్యుడు, వినాయకుడు, భార్గవుడికి ఎరుపు రంగు పూలు, శివయ్యకు తెలుపు పూలు ఎంతో ప్రీతిపాత్రమైనవని ఈ గ్రంథాల ద్వారా తెలుస్తోంది. దేవుడు, దేవతలను పూజించేప్పుడు భక్తులు తప్పని సరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎవరికి ఏ పూలు, పత్రాలు , ఏ రంగు ఇష్టమో తెలుసుకుని పూజలు చేయడం సత్ఫలితాలు పొందవచ్చు.

* ఇలా చేయవద్దు
మహావిష్ణువుకు నైవేధ్యంగా అన్నం పెట్టకూడదు. మందార, థాతురా పూలు కూడా పూజలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అలాగే దుర్గమ్మకు దూబ్, మందార, హరిసింగార్, కాగితం పూలు, తామర పువ్వులు వాడకూడదు. కలువ పువ్వు, సంపంగి మొగ్గలు మినహా మరే మొగ్గలూ ఉపయోగించకూడదు. నీరుగోరంట, నాగ సంపంగి, బృహతీ పుష్పాలను కూడా దుర్గమ్మ పూజలో వినియోగించకూడదు.

ఇది కూడా చదవండి :  Navaratri 2021: చాముండి దేవి చండా–ముండా రాక్షసులను సంహరించింది ఇక్కడే!

* దుర్గమ్మకు ఏ పూలు ఇష్టం
కనకదుర్గమ్మ రూపాల్లో గాయత్రీదేవి రూపం ఒకటి. గాయత్రి అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి పూజలు చేయడం వల్ల అమ్మ అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే గాయత్రీదేవికి మల్లిక, పొగడ, కుశమంజరి, మాధవి, జిల్లేడు, కదంబ, పున్నాగ, చంపక పుష్పాలతోపాటు గరిక దర్భలతో పూజిస్తే అంతా మంచే జరుగుతుందని శాస్త్రాల్లో స్పష్టం ఉంది. గాయత్రి వేదమాత, గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి కూడా వర్ణించలేనిది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Durga Pooja, Navaratri

తదుపరి వార్తలు