VASTU TIPS BY KEEPING THESE PHOTOS AND IDOLS IN THE HOUSE YOU WILL GET WEALTH AND PROSPERITY SK
Vastu Tips: ఇంట్లో ఈ ఫొటోలు ఉంటే అన్నీ శుభాలే.. ఎల్లప్పుడూ సంతోషం.. చేతి నిండా డబ్బు
ప్రతీకాత్మక చిత్రం
Vastu Tips: ఇంట్లో సానుకూల ప్రభావం చూపే వస్తువులను మాత్రమే ఉంచాలి. అప్పుడే మనల్ని అదృష్టం వరిస్తుంది. ధనలక్ష్మి తలుపు తడుతుంది. ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంది.
మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతారు. మన ఇల్లు లేదా పని స్థలం.. వాస్తు ప్రకారం లేకపోతే ఎన్నో ఇబ్బందులు వస్తాయని విశ్వసిస్తారు. అలాంటి ఇంట్లో జీవితాంతం పేదరికం, బాధ ఉంటుందని నమ్ముతారు. అలా పేదరికం ఉన్న ఇళ్లలో లక్ష్మి ఉండదు. అందుకే కొందరు ఎంత సంపాదించినా.. ఆ ఇంట్లో డబ్బు నిలవదు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మనం ఇంట్లో ఏ వస్తువులు ఉంచినా.. అది మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తే.. మరికొన్ని ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ఇంట్లో సానుకూల ప్రభావం చూపే వస్తువులను మాత్రమే ఉంచాలి. అప్పుడే మనల్ని అదృష్టం వరిస్తుంది. ధనలక్ష్మి తలుపు తడుతుంది. ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడుతుంది. మరి ఇంట్లో ఎలాంటి ఫొటోలు, విగ్రహాలు ఉంటే మంచి జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో హింసల ఫొటోలను ఉంచుకోవడం శుభప్రదం. దీనిని ప్రేమ, శాంతికి చిహ్నంగా పరిగణిస్తారు. అందువల్ల ఇంట్లోని పడకగదిలో లేదా డ్రాయింగ్ రూమ్లో హంసల జంట ఫొటోని ఉంచాలి. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను పెంచుతుంది. అంతేకాదు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఇంట్లో అక్వేరియం ఉంచడం కూడా చాలా శుభప్రదం. అందులో రంగురంగుల చేపలను ఎప్పుడూ ఉంచాలి. వాస్తు ప్రకారం.. చేపలను ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. ఇంటికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఇత్తడి లేదంటే వెండి చేపల ప్రతిమన ఉంచాలి.
వాస్తు ప్రకారం.. ఇంట్లో చిలుకను పెంచుకోవడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. చిలుకను సంతోషం, శాంతికి ప్రతీకగా చెబుతారు. నిజమైన చిలుకను పెంచుకోవడం కుదరకపోతే.. చిలుక ఫొటో లేదా బొమ్మను పెట్టుకోవచ్చు. దీని వల్ల ఇంట్లో సానుకూల వాతావరణ ఏర్పడుతుంది.
ఇంట్లో తాబేలు విగ్రహం ఉంటే చాలా మంచిది. హిందూ మత విశ్వాసాల ప్రకారం.. తాబేలుని విష్ణువు రూపంగా పరిగణిస్తారు. తాబేలు విగ్రహాన్ని ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి. దీని వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచడం వల్ల కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇత్తడి లేదా తెల్లరాతి ఆవు విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూలత ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం.. ఇంట్లో ఒంటె విగ్రహాన్ని ఉంచడం కూడా చాలా శుభప్రదమే. ఇంటి వాయువ్య దిశలో ఒంటె విగ్రహాన్ని ఉంచడం వల్ల వ్యాపారంలో విజయం చేకూరుతుంది.
ఇంటి ఉత్తర గోడపై పరుగెత్తే గుర్రాల చిత్ర పటాన్ని ఉంచాలి. గుర్రాలు ఎప్పుడూ పరుగెడుతున్నట్లుగా కనిపించాలి. అలాంటి ఫొటోలు ఇంట్లో ఉంటే శుభకం కలుగుతుంది. గుర్రాలు పరుగెత్తినట్లుగానే, ఆ ఇంట్లో ఉన్న వారు తమ ప్రగతిపథంలో ముందుకు దూసుకెళ్తారని వాస్తు నిపుణులు చెబుతారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.