హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Vastu Tips: బిజినెస్‌లో నష్టాలొచ్చే వారు ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. డబ్బే డబ్బు

Vastu Tips: బిజినెస్‌లో నష్టాలొచ్చే వారు ఈ వాస్తు చిట్కాలు పాటించండి.. డబ్బే డబ్బు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Vastu Tips: వ్యాపారంలో లాభాలు రావాలంటే ఏం చేయాలి? వాస్తు పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో చాలా మంది డబ్బు సంపాదన (Money Earning) కోసం వ్యాపారం (Business) వైపే అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేసే కంటే సొంత వ్యాపారం చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. బాస్‌తో బాధలు ఉండవు.. సెలవుల కోసం తిప్పలు ఉండవు.. నచ్చిన పనిని ఎంచక్కా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్షలు పెట్టుబడి పెట్టి.. బిజినెస్ చేస్తున్నారు. వ్యాపారంలో కొందరు లాభాల పడితే.. మరికొందరు నష్టాల్లో కూరుకుపోతున్నారు. ఎంత కష్టపడినా.. ఆశించిన ఫలితాలు రావు. ఐతే దీనికి చిన్న చిన్న అంశాలే కారణం కావచ్చు. వాస్తు దోషాలు (Vastu dosha) ఉన్నప్పుడు ఇలా జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాపారంలో లాభాలు రావాలంటే ఏం చేయాలి? వాస్తు పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

Dream meaning: కలలో ఇల్లు కనిపిస్తే ఏ సంకేతమో తెలుసా?

వ్యాపారంలో లాభాల కోసం వాస్తు చిట్కాలు:

1. మీరు మీ ఆఫీసు, షాప్ లేదా ఫ్యాక్టరీకి తెలుపు, క్రీమ్ లేదా లేత రంగును వేయాలి. ఈ రంగుల నుండి పాజిటివిటీ వస్తుంది. తద్వారా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది.

2. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇల్లు, కార్యాలయం, దుకాణం లేదా కర్మాగారంలో ఉత్తర దిశను కుబేరుడిగా పరిగణిస్తారు. అందుకే మీ క్యాష్ కౌంటర్‌ను ఉత్తర దిశలో మాత్రమే ఉంచాలి. తద్వారా మీరు డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగుపడతాయి.

3. ఆఫీసు లేదా షాప్ మెయిన్ డోర్ తలుపులను తెరిస్తే అవి లోపలి వైపనకు వెళ్లేలా ఉండాలి. బయటకు వచ్చేలా ఉండకూడదు. కిటికీలు, తలుపులు, అల్మారాలు పగలకుండా, ఖచ్చితమైన స్థితిలో ఉండాలి. ఒకవేళ అవి విరిగిపోయినా.. పగిలిపోయినా.. వెంటనే మరమ్మతు చేయండి.

4. ఆఫీసులోని మీటింగ్ హాలులో దీర్ఘచతురస్రాకారపు టేబుల్ ఉపయోగించండి. దుకాణాల్లో కూడా ఇలాంటి టేబుల్స్ ఉపయోగించవచ్చు.

శివుడికి ఈ వస్తువులను నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయట..

5. వ్యాపారంలో పురోగతి కోసం.. మీ టేబుల్‌పై శ్రీ యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, క్రిస్టల్ తాబేలు, క్రిస్టల్ బాల్, ఏనుగు మొదలైన వాటిని ఉంచుకోవచ్చు. ఇవి శుభానికి చిహ్నాలు. సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

6. వ్యాపారంలో లాభాలు రావాలంటే.. మీ పని ప్రదేశంలో పాంచజన్య శంఖాన్ని ఏర్పాటు చేయాలి. దానిని నిత్యం పూజిస్తే మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. శంఖం లక్ష్మీదేవికి సోదరునిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇద్దరూ సముద్రం నుంచే పుట్టారు. శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది.

7. షాపు లేదా ఆఫీసులో యజమాని గది నైరుతి దిశలో ఉండాలి. కూర్చున్నప్పుడు ఉత్తర దిశ వైపుకు ఎదురుగా ఉండాలి. మీరు ఎక్కడ కూర్చున్నా.. దాని వెనుక ఒక బలమైన గోడ ఉండాలి. గాజు గోడలు, కిటికీలు ఉండకూడదు.

8. ఆఫీసు మెయిన్ డోర్ ఉత్తరం వైపు ఉంటే చాలా మంచిది. వాయువ్య లేదా ఈశాన్య దిశలో ఉంచినా పరవాలేదు. ప్రధాన ద్వారం ముందు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ఈ మార్పులు చేయడం వల్ల మీ పని ప్రదేశంలోకి పాజిటివ్ ఎనర్జీ ప్రసరించి.. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)

First published:

Tags: Business, Vastu Tips

ఉత్తమ కథలు