Vaikunta Ekadashi 2020: ముక్కోటి ఏకాదశి విశిష్టత...పూజ విధానం

ప్రతీకాత్మక చిత్రం

Vaikunta Ekadasi 2020 : హిందువుల పండుగలలో వైకుంఠ ఏకాదశికి ఉన్న విశిష్టతే వేరు. భక్తులకు అభయ ప్రదానం చేసేందుకు 3 కోట్ల మంది దేవతలతో విచ్చేసే విష్ణుమూర్తిని ఎలా కొలుచుకోవాలో తెలుసుకుందాం.

  • Share this:
    Mukkoti Ekadasi 2020 : హిందువులకు పూజలు, వ్రతాలు ఎక్కువే. ఒక్కో పండుగకూ ఒక్కో రకమైన పూజ, వ్రత విధానాలు ఉంటాయి. ఎలా చేసినా... భక్తితో, నిర్మలమైన మనస్సుతో పూజ చేస్తే... ఏ దైవమైనా కరుణిస్తారు. మరి చంద్రమానం, సౌరమానం కలయికతో జరుపుకునే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశికి ఎలాంటి పూజా విధానం పాటించాలి? 3 కోట్ల మంది దేవతలతో కలిసి... విష్ణుమూర్తి... భూలోకానికి విచ్చేసే అద్భుత ఘడియలు ఇవి. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే... అంతకంటే కావాల్సినది ఏముంటుంది? గ్రహ దోషాలు తొలగిపోతాయి.

    పూజా విధానం : ముక్కోటి ఏకాదశి రోజున పూజ, ఉపవాస దీక్ష చేస్తే... పాపాలు తొలగిపోవడమే కాదు... అష్టైశ్వర్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు చేసే పూజలు, దానాల వల్ల ఏడాదిలో ప్రతి ఏకాదశికీ చేసినంత పుణ్యం దక్కుతుంది. ఈ రోజున ఏ చిన్న మంచి పని చేసినా... ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. వైకుంఠ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేయాలి. ఆల్రెడీ ముందుగానే శుభ్రపరచి ఉంచుకున్న పూజ గదిలో... వీలైతే మామిడి ఆకుల్ని తోరణాలుగా కట్టాలి. పసుపు, కుంకుమ బొట్లతో అలంకరించాలి. విష్ణుమూర్తి విగ్రహాన్ని ఉంచి... పూజ చెయ్యాలి. పూలు, తులశిదళాలతో పూజించాలి. కొద్దికొద్దిగా పూల రేకులు స్వామి విగ్రహంపైగానీ... స్వామి పాదాలపై గానీ వేస్తూ... పూజ చేస్తే... స్వామి పరమానందభరితులై కటాక్షిస్తారని ప్రతీతి.

    స్వామిని పూజించేందుకు ప్రత్యేక పూజా పఠన పుస్తకాలుంటాయి. వాటిని కొనుక్కొని పూజించవచ్చు. లేదంటే... స్వామిని మనసారా తలచుకుంటూ... పూలు చల్లుతూ మీకు వచ్చినట్లుగా పూజ చెయ్యవచ్చు. ఎలా చేసినా... నిర్మలమైన మనసుతో... జ్ఞానేంద్రియాలన్నీ లగ్నం చేసి పూజించాలి. అప్పుడు పూజా ఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. దీక్షా సమయంలో తులసితీర్థం తీసుకుంటూ పూజ చేస్తే... మంచి ఫలితం దక్కుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: