హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

ఈ ఒక్క వస్తువుతో మీ ఆర్థిక, సంతాన సమస్యలు తీరిపోతాయి?

ఈ ఒక్క వస్తువుతో మీ ఆర్థిక, సంతాన సమస్యలు తీరిపోతాయి?

Money problems

Money problems

సకల దోషాలు తొలగి విజయం చేకూరాలంటే ఈ వస్తువును ఉపయోగించి విజయం సాధించవచ్చు.

ఆర్థిక బాధాలు ఈరోజుల్లో ఎక్కువైనాయి. ఇవి వెంటనే తొలగాలంటే, సంతానం సన్మార్గంలోకి సాగాలంటే ఈ ఒక్క పరిహారంతో తీరిపోతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. కొంతమంది పిల్లలు చెప్పిన మాట వినకుండా నడుచుకుంటారు. మరికొందరు, చిన్నపిల్లలు ఎప్పుడూ ఏడుస్తూ, చిరాకుగా ఉంటారు. అటువంటి వారున్న ఇంట్లో పెద్దవారు ఓ అరకేజీ పాత బెల్లాన్ని భూమిలో పాతి పెడితే తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

అదే ఏదైనా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో యజమాని పాకెట్‌లో ఓ వెల్లుల్లి రెబ్బను వేసుకుని వెళితే విజయం కలుగుతుందని అంటారు. ఇంటి యజమాని బాగుంటేనే ఆ ఇళ్లు బాగుంటుంది. అంతేకాదు వీలైనన్ని సార్లు హనుమాన్‌ ఛాలిసా చదవాలి.

ముఖ్యంగా ఇంటి ఇల్లాలు సూర్యోదయం కంటే ముందుగా లేచి, ఉత్తర దిశగా దంతదావనం చేయాలి. వంట గదిలోకి వెళ్లి, స్టావ్‌ ఆన్‌ చేసే ముందు అగ్నిదేవుడికి నమస్కరించాలి. పాలు పొంగురాకముందే వాటిని నమస్కరించాలి.. ఈ నియమాలన్ని పాటిస్తే.. ఆ ఇల్లు లక్ష్మీకళ ఎప్పుడూ విరాజిల్లుతుంది. వంటింట్లో గృహిణి ఎప్పుడూ కూడా జుట్టు విరాబూసుకుని వంట చేయకూడదు. ఎవరైతే జట్టు విరబూసుకుని వంట చేస్తే.. అది దయ్యపు వంటతో సమానమంటారు. అలా చేస్తే, ఇంట్లో ఉండే పిల్లలు తరచూ కొట్టుకుంటారు. ఇంటి యజమానికి శాంతి ఉండదు.

అందుకే జుట్టు వేసుకున్న తర్వాతే వంటి ఇంట్లోకి వెళ్లాలి. అంతేకాదు, చాలామంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విఫలమవుతారు. అలాంటప్పుడు మచ్చలేని నిమ్మకాయను రాత్రి 12 గంటల సమయంలో నాటుగు బాట ఉన్న చోట నాలుగుమ ముక్కలుగా కోసి వేసి రావాలి. మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు. అలాంటి వ్యక్తులు ఉద్యోగం వచ్చే వరకు నిత్యం ఓం నమఃశివాయ స్వాహా స్వాహా! అని జపించాలి.

అదేవిధంగా ఎప్పుడైనా బయటకు పనిపై వెళ్లినపుడు విజయం సాధించాలంటే ఓ బెల్లం ముక్క నోట్లో వేసుకుని వెళితే శుభం కలుగుతుందని అంటారు. పడుకునే ముందు ఇళ్లలో ఉన్న అన్ని లైట్‌లను ఆఫ్‌ చేయకూడదు. కేవలం ఒక్క లైట్‌ అయినా వెలుగుతూ ఉండాలి. అదే మట్టి ప్రమిద వెలిగిస్తే మరీ మంచిది. ఎందుకంటే దీపం లక్షీదేవికి ప్రతీక. వెలుగులేని చోట లక్ష్మీ ఉండదు. వెలుతురు ఉండి, పరిశుభ్రంగా ఉన్న ఇళ్లను మాత్రమే లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి.

First published:

Tags: Earn money, Jaggery, Saving money

ఉత్తమ కథలు