P Ramesh, News18, Kakinada
హిందూ ఆచారం ప్రకారం కొన్ని నమ్మకాలు మనుషుల్లో మరింత బలాన్ని పెంచుతాయి. అయితే వీటిలో కొన్నింటిని మాత్రమే మనిషి ఆచరించగలడు. కొన్ని మనకు అందనివని భావించి దేవుడ్ని స్మరించుకోవడం తప్పిదే చేసేదేమి ఉండదు. ఇలా కోవలో కొన్ని రకాల జంతువులను, మూగ జీవాలను పెంచుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు కొందరు. అలాంటి వాటిలో నక్షత్ర తాబేళ్లు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న జీవులు. సాధారణంగా సముద్ర జీవుల జాబితాలతో పాటు, అటవీ సంరక్షణలో కూడా వీటిని ఉంచాలి. అయితే వీటిని ఆలయాలు, ఆశ్రమాలలో కూడా ఉంచవచ్చు. అందుకే తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లోని రామకృష్ణ మిషన్ (Ramakrishna Mission) లో వీటిని పెంచుతున్నారు.
రాజమండ్రి (Rajahmundry) లోని రామకృష్ణా మిషన్ ఆశ్రమంలో ఇవి కనిపిస్తున్నాయి. భారీ సంఖ్యలో నక్షత్ర తాబేళ్లను పెంచుతూ ఆశ్రమంలో అంతా మంచే జరుగుతుందన్న సూచికను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ తాబేళ్లను చూసేందుకు పరిసర ప్రాంత వాసులు ఆశ్రమానికి వెళతారు. అక్కడే వాటికి ఆహార, పానియాలు అందిస్తారు. వీటికోసం ప్రత్యేక రక్షణగా మెస్‌లను ఏర్పాటు చేశారు రామకృష్ణా మిషన్ నిర్వాహకులు. సమ్మర్ లో చల్లదనాన్ని ఇస్తూ వాటిని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. కేవలం మంచి జరగాలనే ఉద్దేశ్యంతోనే వీటిని పెంచుతున్నట్లు తెలుస్తోంది.
నక్షత్ర తాబేళ్లు ఎక్కువగా ఆకురాల్చో అడవుల్లో పెరుగుతాయి. ఏపీలో గుంటూరు (Guntur District) నుంచి శ్రీకాకుళం జిల్లా (Srikakulam) వరకూ ఉన్న అడవుల్లో ఎక్కువశాతం ఆకులరాల్చేవే. ఇక్కడే తాబేళ్ల సంపద ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది. చాలా సంవత్సరాలుగా ఈ జాతి సంపద ఆనవాళ్లను కోల్పోతోంది. అంతరించి పోతున్న వన్యప్రాణుల జాబితాలోకి చేరింది. వీటిని కొంత మంది స్మగర్లు రవాణా చేసి కాసులు కూడా గడిస్తున్నారు. గత కొంత కాలం కిందట ఈ నక్షత్ర తాబేళ్లను తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు.
ఎంతో విలువైన ఈ నక్షత్ర తాబేళ్లు సాధారణ వాతావరణంలో పెరగవు. వీటిని ఇళ్లల్లో ఉంచితే మంచి జరుగుతుందని అంటారు. అందుకే వీటిని స్మగ్లర్లు అమ్మకానికి పెడుతున్నారు. ఈ కోవలోనే వీటి తరలింపు కూడా ఎక్కువగా ఉంది. విదేశాల్లో వీటికి మరింత డిమాండ్. బంధవులు ఎవరైనా వచ్చినా, శుభకార్యాల్లోనూ నక్షత్ర తాబేళ్లను బహుమతిగా ఇస్తారు. ఈ సాంప్రదాయం ప్రకారం నక్షత్ర తాబేళ్లకు విదేశాలలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ప్రభావంతోనే తాబేళ్లను తరలిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాస్తవానికి భూమి మీద ఉండే వన్యప్రాణుల్లో తాబేలుకు జీవితకాలం చాలా ఎక్కువ. దీన్ని ఇంట్లో పెంచుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న విశ్వాసం మనదేశంలో ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.