Home /News /astrology /

TOMORROW FRIDAY AND JULY 1ST VERY SPECIAL DAY FOR LORD LAXMI MATA THESE WAY TO POOJA IS GOOD FOR WEALTH NGS

Friday Laxmi Puja: ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అనుకుంటున్నారా..? అంతులేని సంపద సొంత చేసుకోవాలా..? అయితే జూలై 1న లక్ష్మీదేవిని ఇలా పూజించండి..

జులై 1 న లక్ష్మీ దేవిని ఇలా పూజించండి

జులై 1 న లక్ష్మీ దేవిని ఇలా పూజించండి

Friday Laxmi Puja: సాధారణంగా సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ఆ మాత అనుగ్రహం ఉంటే చాలు ఇంట్లో సంపదకు.. ఐశ్వర్యానికి లోటు ఉండదు. అయితే లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే శుక్రవారం నాడు ఈ పరిహారాలు చేస్త చాలు ఫలితాలు ఉంటాయి అంటున్నారు పండితులు..

ఇంకా చదవండి ...
    Lakshmi Puja In Special Yog: లక్ష్మీ కటాక్షం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మిదేవి అనుగ్రహం కోసం కొందరు చేయని పూజలు ఉండవు.. కొందరైతే వివిధ సెంటిమెంట్లను నమ్ముతారు.. ఎందుకంటే లక్ష్మీదేవి దయ ఉంటే వారికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అందుక లక్ష్మిదేవి అనుగ్రహం కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు. ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం అమ్మవారిని పూజిస్తారు. తల్లి లక్ష్మి (Goddess Laxmi) కృప ఉంటే చాలు బికారి కూడా బిలియనీర్ అవుతాడు. మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి జూలై 1 చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజున కొన్ని శభయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున లక్ష్మిదేవిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం రెండవ తేదీ శుక్రవారం, జూలై 1న వస్తుంది. ఈ రోజున పుష్య నక్షత్రం ఏర్పడుతోంది. ఈ రాశిలోని లక్ష్మీదేవిని పూజించడం (Lakshmi Puja) వల్ల విశేష ఫలం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున లక్ష్మిదేవిని పూజించడం వల్ల మీరు శుభఫలితాలు పొందవచ్చు.

    జులై ఒకటవ తేదీ లక్ష్మీ దేవికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి.. కొన్ని పరిహారాలతో మాతను ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి జూలై 1 శుక్రవారం చాలా మంచి రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా ఉపవాసం చేయాలి. అలాగే ఉదయం, సాయంత్రం కూడా లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

    అన్నిటికన్నా ముఖ్యంగా పేదింటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేయడం ద్వారా లక్ష్మిదేవి సంతోషిస్తుంది. చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ రోజున తెల్లని వస్త్రాలు, తెల్లని వస్తువులను దానం చేయడం అన్నివిధాల మంచిది. అదే విధంగా లక్ష్మిదేవి మంత్రాలను జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఓం శ్రీశ్రీ లక్ష్మీభ్యో నమ, ఓం శ్రీ మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణు పత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజంతా కుదిరినన్ని సార్లు పఠించాలని సూచిస్తున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునే వారు.. శుక్రవారం లక్ష్మిదేవిని పూజించడం వల్ల సుఖసంతోషాలు , ఐశ్వర్యం, ఆస్తి, వైభవం మొదలైనవి వృద్ధి చెందుతాయి. లక్ష్మి దేవి అనుగ్రహం పొందిన వారు ఆర్థిక సంక్షోభం, పేదరికం, వైఫల్యం మొదలైన వాటిని ఎప్పుడూ ఎదుర్కోరు. లక్ష్మి చంచల, ఒకే చోట స్థిరంగా ఉండదు కాబట్టి ఎవరైనా కొంత సమయం వరకు డబ్బును కలిగి ఉంటారు. మరికొంత సమయం అది ఖర్చు అయితపోతుంది.

    ఇదీ చదవండి : జూలై నెలలో పుట్టిన వారికి లక్కే లక్కు.. వారి టోటల్ నెంబర్‌ను బట్టి జాతకం ఎలా ఉంటుంది అంటే

    శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీ దేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజించండి. పూజ సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మి మాత అనుగ్రహం భిస్తుంది.
    శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధార స్తోత్రాన్ని పఠించాలి. ఈ పారాయణం అపారమైన సంపదల కోసం చేస్తారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Astrology, Earn money, Horoscope, Zodiac signs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు