Horoscope Today: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు జాగ్రత్త.. ఆర్థికంగా ఒడిదుడుకులు

ప్రతీకాత్మక చిత్రం

Today Horoscope: నేడు శుక్రవారం ).. ఇవాళ పలు రాశుల వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ప్రయోజనాలు కలిగే అవకాశముంది. మరికొందరికి మాత్రం ఇబ్బందులు రావచ్చు. వారంతా జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీన రాశి వరకు.. ఎవరికి ఎలా ఉందో తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 1, 2021

    దిన ఫలాలు

    మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1) అన్ని విధాలా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. తల పెట్టిన ప్రతి పనీ పూర్తి చేస్తారు. ఆటంకాలు, వ్యతిరేకతలను అధిగమిస్తారు. కుటుంబపరంగా ఎంతగానో కలిసి వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అదనపు ఆదాయం గడించేందుకు అవకాశం ఉంది.

    వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో మీ శ్రమ ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారపరంగా లాభపడతారు. ఆకస్మిక ధనయోగముంది. చాలాకాలంగా పట్టి పీడిస్తున్న కుటుంబ సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. శుభ వార్తలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యానికి ఢోకా లేదు. శత్రు దోషం పోతుంది. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు, తీసుకోవద్దు.

    ఉత్తరంలో ఈ ఒక్కటి ఉంటే... కొట్ల అప్పు తీరిపోతుండట!

    మిథునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి ఆలోచనలు, నిర్ణయాలతో ఆదాయం పెంచుకుంటారు. ఇంట్లో శుభ కార్యానికి అవకాశముంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థికంగా పరవాలేదు.

    కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేకపోయినా పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మిత్రుల సలహాలు ఉప యోగపడతాయి. ఉద్యోగంలో అధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

    అమావాస్యలోపు ఈ ఒక్క పనిచేయకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే!

    సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1) మీ ప్రతిభాపాటవాలకు తగిన ఉద్యోగం లభించే సూచనలున్నాయి. చదువులో చక్కని విజయం సాధిస్తారు. పట్టుదలతో అనుకున్నవి చేజిక్కించుకుంటారు. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.

    కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ పెంచడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో తగినంత కృషి అవసరం. గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.

    ఈ ఒక్క పువ్వుతో మహాలక్ష్మిని పూజిస్తే..పట్టిందల్లా బంగారమే!

    తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అత్యుత్తమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఉన్నత స్థితికి అవకాశం ఉంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

    వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి ఉంటాయి. సహెూద్యోగులు ఇబ్బందులు కలిగిస్తారు. సమయానుకూలమైన నిర్ణయాలతో కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. మిత్రుల సలహాలను పాటించండి. కలహాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది.

    మహిళలు వంటగదిలో ఈ 5 టిప్స్‌ పాటిస్తే ఆ ఇంటికి ధనమే ధనం!

    ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) ఆర్థిక సంబంధమైన విషయాలు చాలావరకు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తా రు. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి. అందరినీ కలుపుకుని పోయేతత్వం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యులను సంప్రదించండి. బంధుమిత్రులతో అపోహలు తలెత్తే సూచనలున్నాయి.

    మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2) మంచి కాలం నడుస్తోంది. మీ నిర్ణయాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో సుస్థిరత ఏర్పడుతుంది. కొత్త సంస్థ నుంచి ఆఫర్లు వస్తాయి. రావనుకున్న బాకీలు వసూలవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. ఆరోగ్యాన్ని కొద్దిగా కూడా నిర్లక్ష్యం చేయవద్దు.

    పితృశాపం నుంచి విముక్తి పొందాలంటే.. ఒక్కటే మార్గం!

    కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ శక్తికి మించి ఇతరులకు సహాయపడతారు. ఉద్యోగపరంగా కష్టపడాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సలహాలు కలిసి వస్తాయి. ధన యోగం ఉంది. శుభవార్తలు వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్త.

    మీనం (Pisces) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4) ఆర్థికంగా బాగుంది. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు ఎదురైనా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఓర్పు, సహనాలతో వ్యవహరించి కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీ శ్రమకు తగ్గ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: