Home /News /astrology /

TODAY HOROSCOPE IN TELUGU THESE ZODIAC SIGNS WILL GET PROFITS IN BUSINESS HERE IS TODAYS ASTROLOGY PREDICTIONS SK

Horoscope Today: అక్టోబరు 22 రాశి ఫలాలు.. వ్యాపారంలో లాభాలే లాభాలు.. వీరికి అన్నీ శుభాలే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Horoscope today: నేడు శుక్రవారం. ఇవాళ ఏ రాశి వారికి బాగుంది? ఏ రాశి వారికి బాగా లేదు. జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు.? ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారి దిన ఫలాలను ఇక్కడ చూద్దాం.

  కాలజ్ఞానం

  అక్టోబరు 22, 2021

  దిన ఫలాలు

  మేష రాశి (Aries) :సమయం అంతగా అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులు కాస్తంత అలస్యంగా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో ఆచితూచి అడుగు వేయాలి. వ్యాపారంలో లాభాలు తగ్గుతాయి. కుటుంబ నభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది.

  వృషభ రాశి (Taurus): అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. తలపెట్టిన పనులు చాలావరకు పూర్తి చేస్తారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూల సమయం. ఆరోగ్యం పరవాలేదు. ఎవరికీ హామీలు ఉండొద్దు.

  విష్ణుమూర్తి ఇష్టమైన కార్తీకమాసం.. ప్రాముఖ్యత!

  మిథున రాశి (Gemini): ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం చేకూరుతుంది. సానుకూల వాతావరణం నెలకొని ఉంది. వృత్తి వ్యాపాఠాల్లో కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. కోర్టు కేసులోనెగ్గుతారు.

  కర్కాటక రాశి (Cancer) ముఖ్యమైన పనులను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. అదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

  మీ జాతకంలో కేతువు ఈ స్థానంలో ఉంటే.. విదేశీయానం...!

  సింహ రాశి (Leo): కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం కుదురుతు౦ది. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలకు అవకాశం ఉంది. కొన్ని కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు చాలా బాగుంది.

  కన్య రాశి (Virgo): గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊళ్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్లొంటారు.

  తుల రాశి (Libra): ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. అవసరాలకు ధనం లభిస్తుంది. వ్యక్తిగతంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడికి గురి కాకుండా నిర్ణయాలు తీసుకోండి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.

  Feng Shui Tips: మీ ఇంట్లో అద్దం ఇక్కడ ఉంటే.. వెంటనే తీసేయండి!

  వృశ్చిక రాశి (Scorpio): ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కాలం కలిసి వస్తుంది. ఉద్యోగం కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది. చేస్తున్న పనులలో పురోగతి ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను ఆలోచిస్తారు. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

  ధనస్సు రాశి (Sagittarius): ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంపద పెరిగే సూచనలున్నాయి. వ్యాపారపరంగా శ్రమ ఎక్కువవుతుంది. పలుకుబడి పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎవరికీ హామీలు ఉండొద్దు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.

  మకర రాశి (Capricorn): తగినంత ప్రయత్నం చేస్తే మీకు అంతా బాగుంటుంది. బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం ఇది. ఉద్యోగంలో అవకాశాలు కలిసి వస్తాయి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. ప్రశాంతత చేకూరుతుంది. ప్రేమికులు సరదాగా గడుపుతారు. విద్యార్ధులకు చాలా బాగుంది.

  బ్రహ్మముహూర్తంలో ఈ పని అస్సలు చేయకండి.. లేకుంటే..!

  కుంభ రాశి (Aquarius): ప్రయత్నాల్ని కొనసాగిస్తే మీకు తప్పకుండా విజయం సిద్దిస్తుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడడానికి నా౦ది పలుకుతారు. ఉద్యోగంలో అటంకాలు ఎదురవుతాయి. వ్యాపారంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబ నభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకిది సమయం కాదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంది.

  మీన రాశి (Pisces): ఆర్థిక విషయాలకు అనుకూలమైన సమయం ఇది. పనులన్నీ పూర్తవుతాయి. అవరోధాలు, అటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్‌ వస్తుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడే వారుంటారు. వ్యాపారంలో బాగా లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం కాపాడుకోవాలి.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Rasi phalalu

  తదుపరి వార్తలు