Today horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్‌న్యూస్.. అనుకోకుండా డబ్బు వస్తుంది

ప్రతీకాత్మక చిత్రం

Horoscope Today: నేడు గురువారం (అక్టోబరు 14). ఇవాళ ఏ రాశుల వారికి ఎలా ఉంది? జ్యోతిష పండితులు ఏం చెబుతున్నారు? ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తున్నారు? మేషం నుంచి మీనం వరకు రాశుల వారీగా ఇక్కడ తెలుసుకుందాం.

  • Share this:
    కాలజ్ఞానం

    అక్టోబరు 14, 2021

    దిన ఫలాలు

    మేష రాశి (Aries): అన్నివిధాలా సమయం అనుకూలంగా ఉంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఎంతో శమ మీద పనులు పూర్తవుతాయి.

    వృషభ రాశి (Taurus): ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాలి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితుల్ని పలకరిస్తారు. ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. శరీరానికి మధ్య మధ్య విశ్రాంతి అవసరం.

    మిథున రాశి (Gemini): రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎక్కడా ఎవరికీ హామీలు ఉండవద్దు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. చెడు స్నేహాలకు వీలైనంత దూరంగా ఉండండి. వ్యసనాలు, జూదాల జోలికి వెళ్లవద్దు.

    Vastu Tips: దుర్గమ్మ పూజకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పూలు వాడకండి..!

    కర్కాటక రాశి (Cancer): ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు లభిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పలుకుబడిగల వ్యక్తులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    సింహ రాశి (Leo): ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. వివాహప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడిగలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చుకు కళ్లెం వేయాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

    కన్య రాశి (Virgo): అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు పెరుగుతాయి. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. తలపెట్టిన పనులు అతి కష్టం మీద పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఒక చిన్న ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

    Navaratri 2021: దుర్గాష్టమి విశిష్టత.. కన్యాపూజ సమయం!

    తుల రాశి (Libra): ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. అదాయం నిలకడగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉ౦ది. సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కరించుకుంటారు.

    వృశ్చిక రాశి (Scorpio): ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. రావాల్సిన డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం కుదరవచ్చు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత అందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడిగలవారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి.

    ధనస్సు రాశి (Sagittarius): ఉద్యోగం మారదలచుకుంటే గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. స్నేహితులతో సరదాగా కాలక్షీపం చేస్తారు. విదేశాల్లో ఉన్న స౦తానం నుంచి శుభవార్త వింటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఇంటా బయటా శ్రమ ఎక్కువగా ఉంటుంది.

    Dussehra 2021: దసరా ఉత్సవాలు ప్రతీష్టాత్మకంగా జరిగేది ఇక్కడే!

    మకర రాశి (Capricorn): ఉద్యోగం మారడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా ఆలస్యమైనా పనులు పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం రుదిరి అవకాశ ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. అర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కుటుంబ సమస్య ఒకటి పరిష్కార అవుతుంది.

    కుంభ రాశి (Aquarius): ఆదాయం పరవాలేదు కానీ, ఖర్చులు అదుపు తప్పుతాయి. ఉద్యోగంలో బాగా శ్రమ పెరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.

    ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. అదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారు ఆర్థికంగా పుంజుకుంటారు. ఎంతో శ్రమపడి పనులు పూర్తి చేస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. సన్నిహితులు మీకు అండగా నిలబడతారు.
    Published by:Shiva Kumar Addula
    First published: